India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జొమాటో, ఓలా, ఉబర్, స్విగ్గీ తదితర సంస్థల డెలివరీ సేవలపై పన్ను విధించాలని నిర్ణయించినట్లు కర్ణాటక కార్మిక మంత్రి సంతోష్ లాడ్ తెలిపారు. ‘రవాణా మీద మాత్రమే ఈ పన్ను విధిస్తున్నాం. డెలివరీ ఏజెంట్లు రోడ్డుపైనే ఎక్కువ ఉంటారు కాబట్టి వారు ప్రమాదాలకు గురయ్యేందుకు, కాలుష్యం బారిన పడి అనారోగ్యం పాలయ్యేందుకు అవకాశాలెక్కువ. ఈ డబ్బును వారి సంక్షేమానికి, వారి పిల్లల చదువులకు వినియోగిస్తాం’ అని పేర్కొన్నారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై వివాదాస్పద పోస్టు పెట్టిన ఒడిశా నటుడు బుద్ధాదిత్య మొహంతీపై కేసు నమోదైంది. ఎన్సీపీ నేత సిద్దిఖీని హత్య చేసిన లారెన్స్ బిష్ణోయ్ ముఠా తర్వాత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకోవాలని ఆయన పోస్టు పెట్టినట్లు నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(NSUI) ఆరోపించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొహంతి ఆ పోస్టు డిలీట్ చేసినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేశారు.

కుక్క, పాము కాటు బాధితులకు వెంటనే చికిత్స అందించేందుకు జాతీయ స్థాయిలో హెల్ప్‌లైన్ 15400 టోల్‌ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంది. బాధితులు ఈ నంబర్‌కు కాల్ చేస్తే వ్యాక్సిన్లు ఎక్కడ లభిస్తాయో తెలియజేస్తారు. ఈ నంబర్ ఉ.9 నుంచి సా.6 గంటల వరకు పనిచేస్తుంది. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేలా రూపొందించిన పోస్టర్లను ఏపీ వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తాజాగా ఆవిష్కరించారు.

రిషభ్ పంత్‌ను 90 పరుగులు దాటాక దురదృష్టం వెంటాడుతోంది. 2018లో తాను అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 7సార్లు 90ల్లో ఔటయ్యారు. 2018లో WIపై రాజ్‌కోట్, హైదరాబాద్ టెస్టుల్లో 92 రన్స్‌కి, 2021లో సిడ్నీలో ఆస్ట్రేలియాపై 97 రన్స్, అదే ఏడాది ఇంగ్లండ్‌పై చెన్నైలో 91 రన్స్, 2022లో మొహాలీలో శ్రీలంకపై మ్యాచ్‌లో 96 రన్స్, అదే ఏడాది మీర్పూర్‌లో బంగ్లాదేశ్‌పై 93 రన్స్, ఈరోజు 99 రన్స్‌కి పంత్ ఔటయ్యారు.

సికింద్రాబాద్-గూడూరు సింహపురి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్చినట్లు SCR ప్రకటించింది. ఇకపై రాత్రి 10.05 నిమిషాలకే SCలో బయల్దేరి తర్వాతి రోజు ఉ..8.55కు గూడూరు చేరుతుంది. లింగంపల్లి-తిరుపతి నారాయణాద్రి కూడా లింగంపల్లిలో సా.5.30కి, సికింద్రాబాద్‌లో 6.05 గం.కు బయల్దేరి తర్వాతి రోజు ఉ.5.55 గం.కు TPTY చేరుతుంది. అటు నర్సాపూర్-నాగర్‌సోల్ రైలు NSలో ఉ.9.50కు బయల్దేరి తర్వాతి రోజు ఉ.7.30కు NSL చేరుతుంది.

TG: నిజామాబాద్‌లో ఘోరం జరిగింది. బస్టాండ్ సమీపంలో నిన్న రాత్రి నలుగురు దుండగులు ఒంటరిగా ఉన్న ఓ మహిళను ఆటోలో ఎక్కించుకుని డిచ్‌పల్లి ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఇవాళ ఉదయం నగరానికి చేరుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆటోకు సంబంధించిన సీసీ వీడియో కోసం పరిశీలిస్తున్నారు.

గాయంతో బాధపడుతూనే రిషభ్ పంత్ సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. సెంచరీ చేస్తారని అంతా భావించగా 99 రన్స్ వద్ద ఔట్ అవడంతో స్టేడియమంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. మోకాలి నొప్పితోనే వీరోచితంగా ఆడి 9 ఫోర్లు, 5 సూపర్ సిక్సులతో పంత్ అదరగొట్టారు. పంత్‌కు సెంచరీ మిస్ అయినప్పటికీ ప్రేక్షకులు, ఆటగాళ్ల నుంచి స్టాండింగ్ ఒవేషన్ లభించింది. ఇది అభిమానులకు హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

TG: గ్రూప్-1 పరీక్షను రీషెడ్యూల్ చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. గ్రూప్-1 అభ్యర్థులతో కలిసి ర్యాలీ చేస్తున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రం మొత్తం అగ్గి రగులుతుంటే రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదు. రాబోయే రోజుల్లో రిజర్వేషన్లు రద్దు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోంది’ అని అన్నారు. మరోవైపు ర్యాలీలో BJP, BRS కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

TG: రైతు భరోసా అమలు చేసే వరకూ కాంగ్రెస్‌ను వదిలేది లేదని KTR అన్నారు. ‘కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధు ఇవ్వదన్న KCR మాటలను రేవంత్ సర్కార్ నిజం చేసింది. స్వయంగా వ్యవసాయశాఖ మంత్రే చేతులేస్తున్నట్లు ప్రకటించారు. డబ్బుల్లేక సబ్ కమిటీ అంటూ డ్రామాలు స్టార్ట్ చేశారు. మూసీ సుందరీకరణకు డబ్బులుంటాయి కానీ రైతు భరోసాకు లేవా?’ అని ప్రశ్నించారు. రేపు అన్ని మండలాల్లో ఆందోళనలు చేయాలని BRS శ్రేణులకు పిలుపునిచ్చారు.

TG: మార్పు కావాలనే ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గోషామహల్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో ఆయన మాట్లాడారు. ఈ నెలాఖరుకే ప్రతి నియోజకవర్గానికి 3500-4000 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని నొక్కి చెప్పారు. అర్హత ఉంటే ఎలాంటి రికమండేషన్ అవసరం లేదన్నారు. రాబోయే నాలుగున్నరేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
Sorry, no posts matched your criteria.