India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అంటే ప్రధాని మోదీకి భయమని, అందుకే ఆయనను అరెస్ట్ చేయించారని శివసేన(ఉద్ధవ్ వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. అరెస్ట్ తర్వాత కేజ్రీవాల్ మరింత బలంగా మారారని అన్నారు. రాజకీయ నాయకులను భయపెట్టేందుకు, ప్రతిపక్షాలను నిర్మూలించేందుకు మోదీ దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారని విమర్శించారు. మార్చి 31న చేపట్టే విపక్షాల ర్యాలీలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
రవితేజ హీరోగా 2004లో వచ్చిన వెంకీ సినిమా ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించింది. ఇటీవలే ఆ సినిమాను రీరిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ లభించింది. కాగా వెంకీ సీక్వెల్‌పై తాజాగా మూవీ డైరెక్టర్ శ్రీను వైట్ల స్పందించారు. ‘వెంకీ రీరిలీజ్ తర్వాత ప్రేక్షుకుల స్పందన చూసి వెంకీ-2 చేయాలనిపించింది. స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాం. మళ్లీ అదే కాంబినేషన్‌లో సినిమా ఉంటుంది కానీ ఎప్పుడని చెప్పలేను’ అని ఆయన తెలిపారు.
MI కొత్త ప్లేయర్ నమన్ ధీర్ అందరి దృష్టిని ఆకర్షించారు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు ఏమాత్రం బెదురు లేకుండా ఆడి 10 బంతుల్లో 20 పరుగులు చేశారు. ఫీల్డింగ్‌లోనూ కళ్లుచెదిరే క్యాచ్ అందుకున్నారు. 24ఏళ్ల నమన్ పంజాబ్‌కు చెందిన వ్యక్తి. అతడు సయ్యద్ ముస్తాక్ అలీ, డీవై పాటిల్, షేర్-ఏ-పంజాబ్ టీ20 టోర్నీల్లో మంచి ప్రదర్శన చేసి హిట్టర్‌గా పేరొందారు. దీంతో వేలంలో అతణ్ని MI రూ.20లక్షలకు సొంతం చేసుకుంది.
హోలీ పండుగని దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. రంగులు చల్లుకుంటూ సందడి చేస్తున్నారు. సినీ తారలు, క్రికెటర్లు, రాజకీయ నేతలు ఈ వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్ నిర్వహించిన హోలీ సంబరాల్లో విదేశీ క్రికెటర్లూ పాల్గొని సందడి చేశారు.
AP: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా పోలీస్ వ్యవస్థ అధికార పార్టీకి కొమ్ముకాస్తోందని టీడీపీ నేత బుద్దా వెంకన్న విమర్శించారు. డీజీపీని విధుల నుంచి తప్పించాలంటూ ఈసీకి లేఖ రాస్తామని చెప్పారు. ‘లోకేశ్‌కు ప్రభుత్వం భయపడుతోంది. అందుకే ఆయన వాహనాలను అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు. ఆయనను మంగళగిరిలో ఓడించడానికి వైసీపీ రూ.500 కోట్లు దాచింది. ఓటుకు రూ.30 వేలు ఇవ్వడానికి సిద్ధమైంది’ అని ఆరోపించారు.
TG: టెట్ ఒక్కో పేపర్ ఫీజును రూ.300 నుంచి రూ.1,000కి <<12907253>>పెంచడంపై<<>> అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కోచింగ్, హాస్టళ్లకు రూ.వేలు ఖర్చు పెడుతున్న తమపై ఫీజుల భారం వేయడం తగదని, వెంటనే తగ్గించాలని కోరుతున్నారు. ఈ వ్యవహారం సీఎం రేవంత్ దృష్టికి వెళ్లింది. ఫీజు పెంపు అధికారుల స్థాయిలోనే జరిగిందని CMO వర్గాలు ఆయనకు చెప్పాయట. సమస్య తీవ్రతరం కాకముందే ఫీజు తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ముంబైతో మ్యాచ్‌లో సాయి సుదర్శన్ తమకు బ్యాటింగ్ ఎలా చేయాలో చేసి చూపించాడని గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నారు. అతని సహకారంతో మంచి లక్ష్యాన్ని నిర్దేశించగలిగామని పేర్కొన్నారు. పేసర్లతో పాటు స్పిన్నర్లూ రాణించడంతోనే విన్నింగ్ రేసులో నిలువగలిగామని చెప్పారు. మంచు ప్రభావం ఉన్న సమయంలోనూ తమ బౌలర్లు అదరగొట్టారని ప్రశంసించారు. కాగా 39 బంతుల్లో 45 రన్స్ చేసిన సుదర్శన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు.
TG: పార్టీ నిర్ణయాలపై బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేస్తోన్న సీనియర్లపై కాంగ్రెస్ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పీసీసీ నిర్ణయాలను ఎవరైనా ఆమోదించాల్సిందేనని, వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తప్పవని వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఏవైనా భిన్నాభిప్రాయాలు ఉంటే అంతర్గత సమావేశాల్లో చెప్పాలన్నారు. ఇటీవల వీహెచ్, నిరంజన్ బహిరంగంగా విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.
ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్‌లో ప్రియదర్శి హీరోగా సినిమా ప్రారంభమైంది. మల్లేశం, బలగం చిత్రాల తర్వాత అతను హీరోగా చేస్తోన్న ఈ మూవీలో రూపా కొడువాయుర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. గత ఏడాది విడుదలైన బలగం సినిమా సూపర్ హిట్‌గా నిలిచి, అనేక అవార్డులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
హీరోయిన్ తాప్సీ తన ప్రియుడు మథియాస్ బోను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈనెల 23న ఉదయ్‌పూర్‌లో అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వారి వివాహం జరిగినట్లు సమాచారం. బాలీవుడ్ నుంచి పలువురు నటీనటులు ఈ పెళ్లి వేడుకకు హాజరైనట్లు తెలుస్తోంది. మథియాస్‌తో గత పదేళ్లుగా డేటింగ్ చేస్తున్నట్లు తాప్సీ ఇదివరకే వెల్లడించిన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.