India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: ఈ నెల 16న అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ భేటీ జరగనుంది. నిన్న జరగాల్సిన క్యాబినెట్ భేటీ రతన్ టాటా మరణంతో వాయిదా పడింది. ఈ భేటీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, చెత్త పన్ను రద్దు, పీ-4 విధానం వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. పోలవరం, అమరావతి నిర్మాణాలపై కూడా చర్చ జరుగుతుందని సమాచారం.

భారత వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై కఠిన, ధ్రువీకరించదగిన చర్యలు తీసుకున్నప్పుడే కెనడాతో బంధాలు మెరుగుపడతాయని భారత్ స్పష్టం చేసింది. భారత్-ఆసియన్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా PM మోదీని కలిసి వాస్తవిక సమస్యలపై చర్చించినట్టు కెనడా PM ట్రూడో పేర్కొన్నారు. అయితే దీనిపై స్పందించిన విదేశాంగ శాఖ ఇరు దేశాధినేతల మధ్య ఎలాంటి అర్థవంతమైన చర్చలు జరగలేదని పేర్కొనడం గమనార్హం.

1957లో జన్మించిన నోయల్ టాటా UKలో విద్యాభ్యాసం చేశారు. 2000 ప్రారంభ దశకంలో టాటా గ్రూప్‌లో చేరి వ్యాపార సామ్రాజ్య విస్తరణలో కీలకపాత్ర పోషించారు. 1998లో ఒక స్టోర్ ఉన్న ట్రెంట్ రిటైల్‌ను సంస్థ MDగా 700 స్టోర్లకు విస్తరించారు. $500M విలువగల టాటా ఇంటర్నేషనల్‌ను $3 బిలియన్లకు తీసుకెళ్లారు. టాటా ట్రస్ట్ ఛైర్మన్‌గా ఆయన రతన్ టాటా ట్రస్ట్, దొరాబ్జీ ట్రస్టుల విధులను పర్యవేక్షిస్తారు.

అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ భారతీయుల్ని ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో భారత్‌పై ఆయన ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఎన్నికల ప్రచార ప్రకటనల్ని కూడా భారతీయ భాషల్లోనే ఇస్తున్నారు. ముఖ్యంగా తమిళ, తెలుగు ప్రకటనలు చాలా చోట్ల దర్శనమిస్తున్నాయి. ‘సంస్కృతి-సన్మార్గం, దేశానికి ఆధారం. Vote Republican’ అంటూ పలు పోస్టర్లలో కనిపిస్తోంది.

TG: ఆరోగ్యశాఖలో మరో 371 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 272 నర్సింగ్ ఆఫీసర్లు, 99 ఫార్మాసిస్ట్ పోస్టులకు మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా గత నెలలో 2,050 స్టాఫ్ నర్స్ పోస్టులకు ప్రకటన రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. నర్సింగ్ పోస్టులకు అక్టోబర్ 14, ఫార్మాసిస్ట్ పోస్టులకు అక్టోబర్ 21 వరకు అప్లై చేసుకోవచ్చు. <

TG: రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఈ కమిషన్ ఎస్సీల్లోని ఉపవర్గాల వెనుకబాటుతనంపై అధ్యయనం చేయనుంది. 60 రోజుల్లో రిపోర్ట్ సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.

బారామతికి సంబంధించి శరద్ పవార్ పంపిన ప్రతిపాదనలను CM ఏక్‌నాథ్ శిండే క్యాబినెట్ ముందుంచడంపై Dy.CM అజిత్ కినుక వహించినట్లు తెలుస్తోంది. దీనిపై గురువారం జరిగిన క్యాబినెట్ భేటీలో వీరిద్దరి మధ్య వాడీవేడి చర్చ జరిగినట్టు స్థానిక మీడియా తెలిపింది. శిండే ప్రవేశపెట్టిన అంశాల ఆమోదానికి అజిత్ నిరాకరించారని, అనంతరం మీటింగ్ నుంచి వెళ్లిపోయారని ప్రచారం జరిగింది. అయితే, అజిత్ దీన్ని ఖండించారు.

ఏపీవ్యాప్తంగా రేపు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, పల్నాడు, నంద్యాల, ATP, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి, GNT, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, YSR, అన్నమయ్య, చిత్తూరు, TPT జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లలో ఒకదానికి కెప్టెన్ <<14326057>>రోహిత్ శర్మ గైర్హాజరయ్యే<<>> అవకాశం ఉండడంతో ఆ మ్యాచ్‌కి సారథ్యం వహించేది ఎవరన్న దానిపై ఆసక్తి నెలకొంది. బుమ్రా, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్‌లలో ఒకరికి కెప్టెన్‌గా ఛాన్స్ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. AUS లాంటి బలమైన జట్టుతో మ్యాచ్ కాబట్టి మళ్లీ కోహ్లీకి పగ్గాలు ఇచ్చే అవకాశం లేకపోలేదు.

TG: పంచాయతీ, మున్సిపల్, వార్డు స్థాయిలో ఇందిరమ్మ కమిటీలను శనివారం నాటికి ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రామస్థాయిలో సర్పంచి లేదా ప్రత్యేక అధికారి, మున్సిపాలిటీ స్థాయిలో కౌన్సిలర్/ కార్పొరేటర్ ఛైర్మన్‌గా కమిటీలను ఏర్పాటు చేయాలంది. పంచాయతీ కార్యదర్శి/ వార్డు ఆఫీసర్ కమిటీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారని GOలో పేర్కొంది. SHG గ్రూపు సభ్యులు, ముగ్గురు స్థానికులు కమిటీలో ఉంటారు.
Sorry, no posts matched your criteria.