News March 26, 2024

APPLY: 2,253 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రేపటితో లాస్ట్

image

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన 2,253 పోస్టులకు దరఖాస్తు చేసేందుకు రేపటితో గడువు ముగియనుంది. ఇందులో నర్సింగ్ ఆఫీసర్ 1930, పర్సనల్ అసిస్టెంట్ 323 పోస్టులున్నాయి. బీఎస్సీ నర్సింగ్, బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. అభ్యర్థులు ఈ నెల 27వ తేదీలోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. వయోపరిమితి, జీతభత్యాలు, పరీక్షా విధానం, ఇతర వివరాలకు https://upsc.gov.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.

News March 26, 2024

ఆట పట్ల విరాట్ ఆకలి అలాగే ఉంది: డుప్లెసిస్

image

విరాట్ కోహ్లీలో క్రికెట్ పట్ల ఆకలి ఏమాత్రం తగ్గలేదని ఆయన ఆర్సీబీ సహచరుడు డుప్లెసిస్ అన్నారు. ఆటను పూర్తిగా ఆస్వాదిస్తున్నారని కితాబిచ్చారు. ‘పంజాబ్‌తో మ్యాచ్‌లో విరాట్ చాలా కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఈమధ్య కొన్ని నెలల విరామం తీసుకోవడంతో తాజాగా ఉన్నారు. బాగా ఆడాలనే తపన అతడిలో కనిపిస్తోంది’ అని వెల్లడించారు.

News March 26, 2024

స్పాట్ వాల్యూయేషన్.. ఫోన్లకు నో పర్మిషన్

image

TG: ఇంటర్ జవాబు పత్రాల స్పాట్ వాల్యూయేషన్‌ను బోర్డు మరింత కట్టుదిట్టంగా నిర్వహిస్తోంది. వాల్యూయేషన్ కేంద్రాల్లోకి ఫోన్లను అనుమతించకూడదని ఆదేశించింది. గతంలో సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో 16 కేంద్రాల్లో 20 వేల మంది అధ్యాపకులు వాల్యూయేషన్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. నాణ్యమైన మూల్యాంకనం కోసం ఒక్కొక్కరికి రోజుకు 30 పేపర్లు మాత్రమే ఇస్తున్నారు.

News March 26, 2024

3-6 లక్షల మెజార్టీతో గెలిచినా ఈసారి సీటు దక్కలేదు

image

లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా 370 సీట్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. సామాజిక సమీకరణాలతోపాటు పార్టీకి చేటు తెచ్చేలా మాట్లాడిన వారిపై వేటు వేసింది. గత ఎన్నికల్లో 3 లక్షల నుంచి 6 లక్షల మెజార్టీతో గెలిచిన 39 మందిని పక్కనపెట్టింది. వారిలో సంజయ్ భాటియా(కర్నాల్), రంజనాబెన్(వడోదరా), పర్వేష్(పశ్చిమ ఢిల్లీ), హన్స్‌రాజ్(వాయవ్య ఢిల్లీ), అనంత కుమార్(ఉత్తర కన్నడ) ఉన్నారు.

News March 26, 2024

ఆరు మ్యాచుల్లో హోమ్ టీమ్‌లదే హవా

image

ఐపీఎల్ 2024లో హోమ్ టీమ్‌లదే హవా నడుస్తోంది. ఆయా జట్లు సొంత వేదికల్లో విజయాలను నమోదు చేశాయి. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 6 మ్యాచులు జరగగా వీటిలో ఆతిథ్య జట్లే గెలుపొందడం గమనార్హం. మరి ఇవాళ చెపాక్ వేదికగా చెన్నై, గుజరాత్ మ్యాచులో ఈ జోరుకు బ్రేక్ పడుతుందేమో వేచి చూడాలి.

News March 26, 2024

ఐటీ ఉద్యోగం చేస్తున్నారా? షాకింగ్ న్యూస్!

image

ఐటీ ఉద్యోగుల్లో చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు HCL హెల్త్ కేర్ తెలిపింది. దేశవ్యాప్తంగా 56వేల మందికి మెడికల్ టెస్టులు చేయగా, 77% మందికి అనారోగ్య సమస్యలు ఉన్నట్లు తేలింది. 22% మంది ఊబకాయం, 17% ప్రిడయాబెటిస్, 11% రక్తహీనతతో బాధపడుతున్నారని వెల్లడైంది. జంక్ ఫుడ్స్, గంటల కొద్దీ కదలకుండా కూర్చోవడం, సరైన డైట్ పాటించకపోవడం, నిద్రలేమి, ఆల్కహాల్, సిగరెట్ల వల్ల సంతానలేమి సమస్యా పెరుగుతోందట.

News March 26, 2024

హోలీ వేళ విషాదాలు.. రాష్ట్రంలో 17 మంది దుర్మరణం

image

TG: నిన్న హోలీ పండుగ పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వేర్వేరు ఘటనల్లో 17 మంది దుర్మరణం పాలయ్యారు. రంగులు చల్లుకున్న తర్వాత స్నానానికి నదులు, వాగులు, చెరువుల్లోకి దిగి 16 మంది మరణించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏడుగురు, ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఆరుగురు, రంగారెడ్డిలో ఇద్దరు, జగిత్యాలలో ఒకరు మృతి చెందారు. నారాయణపేటలో నీటి ట్యాంక్ కూలి ఓ చిన్నారి కన్నుమూసింది.

News March 26, 2024

ఇంటింటి ప్రచారానికీ అనుమతి తప్పనిసరి: సీఈవో

image

AP: సార్వత్రిక ఎన్నికల్లో సభలు, రోడ్‌షోలతోపాటు ఇంటింటి ప్రచారానికీ అభ్యర్థులు ముందస్తు అనుమతి తీసుకోవాలని CEO ముకేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు. సమావేశానికి 48 గంటల ముందు సువిధ యాప్ లేదా నేరుగా రిటర్నింగ్ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలంటూ పార్టీలకు లేఖ రాశారు. ప్రచార సామగ్రి అనుమతులు సీఈవో వద్ద, ఊరేగింపులు, ర్యాలీలకు జిల్లాల ఎన్నికల అధికారుల వద్ద అనుమతులు తీసుకోవాలని పేర్కొన్నారు.

News March 26, 2024

ప్రస్తుతం ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఇలా..

image

TG: ✒ నాగార్జున సాగర్: ప్రస్తుత నిల్వ-137.8TMC, పూర్తి సామర్థ్యం 312.5 TMC
✒ శ్రీరాంసాగర్: ప్రస్తుత నిల్వ-17.5 టీఎంసీలు, సామర్థ్యం 90 TMC
✒ మల్లన్నసాగర్: ప్రస్తుత నిల్వ-9.9TMC, సామర్థ్యం 50 టీఎంసీలు
✒ మేడిగడ్డ బ్యారేజీ: ప్రస్తుత నిల్వ-0 టీఎంసీలు, సామర్థ్యం 16.17 TMC
✒ ఎల్లంపల్లి: ప్రస్తుత నిల్వ-8.73 టీఎంసీలు, సామర్థ్యం 20.17 టీఎంసీలు
✒ సింగూరు: ప్రస్తుత నిల్వ-18.78 టీఎంసీలు సామర్థ్యం 29.917 TMC

News March 26, 2024

దుర్గమ్మ ప్రత్యేక దర్శనాలకు టికెట్ తప్పనిసరి

image

AP: విజయవాడలోని దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ప్రత్యేక దర్శనాలకు టికెట్ తప్పనిసరి చేస్తూ EO రామారావు ఆదేశాలు జారీ చేశారు. ₹100, ₹300, ₹500 టికెట్లు ఉన్నప్పటికీ కొనుగోలు చేయకుండా పలువురు సిఫార్సుల పేరుతో నేరుగా దర్శనానికి వెళ్తున్నారు. దీంతో ఆదాయం తగ్గిపోయింది. ఇకపై అంతరాలయ దర్శనం చేసుకునే భక్తులకు ₹500 టికెట్ ఉండాల్సిందేనని ఈవో స్పష్టం చేశారు. నిత్యం తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు.

error: Content is protected !!