India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

* దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా కన్నుమూత
* బంగ్లాపై భారత్ విజయం.. 2-0తో సిరీస్ కైవసం
* TG: డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్
* రాష్ట్రంలో పండుగ వాతావరణం లేదు: కేటీఆర్
* 3 రోజుల్లో ఖాతాల్లో ధాన్యం కొనుగోళ్ల డబ్బులు: మంత్రి కోమటిరెడ్డి
* AP: అన్ని ఎన్నికలు ఒకే సారి నిర్వహించాలి: CBN
* దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు

ఢిల్లీ CM ఆతిశీ కొత్తగా షిఫ్ట్ అయిన ‘శీష్ మహల్’ బంగళాను PWD శాఖ ఖాళీ చేయించి సీజ్ చేసింది. మాజీ CM కేజ్రీవాల్ ఇటీవలే ఈ నివాసాన్ని ఖాళీ చేశారు. అనంతరం భవనం తాళాలు తమకు ఇవ్వాల్సి ఉండగా ఆతిశీ తీసుకుని షిఫ్ట్ అయ్యారని PWD అధికారులు తెలిపారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలతో భవనాన్ని ఖాళీ చేయించి సీజ్ చేశామని స్పష్టం చేశారు. ఆ భవనంలో ఏం రహస్యాలున్నాయని వెంటనే షిఫ్ట్ అయ్యారంటూ ఆతిశీని BJP ప్రశ్నించింది.

ప్రముఖ వ్యాపారవేత్త, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా(86) మరణించారు. అనారోగ్యంతో ఇవాళ ముంబైలోని బ్రీచ్ ఆసుపత్రిలో చేరిన ఆయన కాసేపటి క్రితమే కన్నుమూశారు. టాటా 1937 డిసెంబర్ 28న ముంబైలో జన్మించారు. ఆయన మరణాన్ని టాటా గ్రూప్స్ అధికారికంగా ధ్రువీకరించింది.

రాత్రి పడుకునే ముందు గ్లాసు పాలు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి శరీరంలో సెరోటోనిన్‌ను పెంచి ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో మంచిగా నిద్ర పడుతుంది. ఉదయం పేగు కదలిక ప్రక్రియ సులభమై మలబద్దకం సమస్య ఉండదు. సంతానోత్పత్తిని పెంచడంలోనూ ఉపయోగకరంగా ఉంటుంది. రాత్రి పాలు తాగితే కొందరికి లాక్టోస్ సైడ్ ఎఫెక్ట్ కారణంగా ఉబ్బరం, విరేచనాలు, గ్యాస్ వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో తనది పవిత్ర బంధం అని దివ్వెల మాధురి చెప్పారు. ప్రజలు తమ మధ్య సంబంధాన్ని ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ప్రజా జీవితం వేరు.. రాజకీయాలు వేరు. రెండింటికీ ముడి పెట్టొద్దు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ది తప్పు కాకపోతే మాదీ తప్పు కాదు. ఇక్కడ ఎవరూ రాముడిలాగా ఏకపత్నీవ్రతులు లేరు’ అని ఆమె చెప్పుకొచ్చారు.

జంతు ప్రపంచంలో నియమాలు చాలా భిన్నంగా ఉంటాయి. కొన్ని జంతువులు సొంత బిడ్డల్నే తినేస్తుంటాయి. తమకు పుట్టని పిల్లల్ని తినేసే మగసింహాలు, ఆహారం దొరక్క మాడిపోతున్న సమయంలో సొంత పిల్లల్ని తినేందుకు వెనుకాడవు. మొసళ్లు, మగ హిప్పోపొటమస్‌లు, చిట్టెలుకలు, ఆక్టోపస్‌లు, పీతలు, కొన్ని జాతుల పాములు కూడా కొన్నిసార్లు వాటి పిల్లల్ని అవే తినేస్తాయి. వినడానికి వింతగా ఉన్నా మనుగడ కోసం జంతు ప్రపంచంలో ఇది సహజమే.

మహిళల టీ20 వరల్డ్ కప్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. 82 పరుగుల తేడాతో ఆ జట్టును చిత్తు చేసి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. 173 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన లంక 19.5 ఓవర్లలో 90 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో కవిషా దిల్హారి (21), అనుష్క సంజీవని (20) కాసేపు పోరాడారు. తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి, ఆశా శోభన చెరో 3 వికెట్లతో లంకేయుల భరతం పట్టారు.

TG: CM రేవంత్ అందజేసిన డీఎస్సీ నియామకపత్రాలు కేసీఆర్ చలవేనని హరీశ్ రావు అన్నారు. 2014లో కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తే తెలంగాణను అమ్మేసేవారని, కేసీఆర్ చేతిలో తెలంగాణ సురక్షితంగా ఉంది కాబట్టే ఇవాళ రేవంత్ సీఎం అయ్యారని చెప్పారు. KCRను దెయ్యం అని తెలంగాణ ద్రోహులు తప్ప ఎవరూ అనరని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో దొరికిన వ్యక్తి ఇవాళ టీచర్లకు నీతివాక్యాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

TG: డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి నియామకపత్రాలు అందజేశారు. ‘సార్ పుణ్యమా అంటూ డీఎస్సీలో జాబ్ వచ్చింది’ అంటూ ఓ వ్యక్తి ఎల్బీ స్టేడియంలోని సీఎం ఫ్లెక్సీకి దండం పెట్టారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కేంద్రం 2020లో 59 చైనా యాప్స్‌ను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. డాక్యుమెంట్లను కెమెరాతో స్కాన్ చేసి పీడీఎఫ్ ఫైల్స్‌లా సేవ్ చేసుకునేందుకు ఉపకరించే క్యామ్‌స్కానర్ కూడా వాటిలో ఉంది. దీన్నుంచి కూడా చైనాకు సమాచారం వెళ్తోందన్న ఆరోపణలున్నాయి. అలాంటి ఈ యాప్‌ను స్వయంగా కేంద్ర ఎన్నికల సంఘమే వాడుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఓ నెటిజన్ ఈ విషయాన్ని గుర్తించి పోస్ట్ పెట్టగా దానిపై చర్చ జరుగుతోంది.
Sorry, no posts matched your criteria.