India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హీరోయిన్ తాప్సీ తన ప్రియుడు మథియాస్ బోను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈనెల 23న ఉదయ్‌పూర్‌లో అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వారి వివాహం జరిగినట్లు సమాచారం. బాలీవుడ్ నుంచి పలువురు నటీనటులు ఈ పెళ్లి వేడుకకు హాజరైనట్లు తెలుస్తోంది. మథియాస్‌తో గత పదేళ్లుగా డేటింగ్ చేస్తున్నట్లు తాప్సీ ఇదివరకే వెల్లడించిన సంగతి తెలిసిందే.
AP: విశాఖ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ కంపెనీలో నలుగురు ప్రతినిధులకు సీబీఐ నోటీసులు పంపింది. కంపెనీకి సంబంధించిన పూర్తి స్థాయి డేటా కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇదే సమయంలో పలువరు ఆక్వా బిజినెస్ ప్రతినిధులను కూడా సీబీఐ ప్రశ్నించనుంది. ఇప్పటికే సంధ్యా ఆక్వా కంపెనీలో తనిఖీలు జరిపిన సీబీఐ.. కంపెనీ వ్యాపార లావాదేవీలపై లోతుగా విచారణ చేస్తోంది.
*చేవెళ్ల- కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్, రంజిత్ రెడ్డి
*మహబూబ్‌నగర్- డీకే అరుణ, మన్నె శ్రీనివాస్ రెడ్డి, వంశీచంద్ రెడ్డి
*నాగర్‌కర్నూల్- పోతుగంటి భరత్, RS ప్రవీణ్ కుమార్, మల్లు రవి
*నల్గొండ- సైది రెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి, రఘువీర్ రెడ్డి
*భువనగిరి- బూర నర్సయ్య గౌడ్, క్యామ మల్లేశ్ (BRS)
*వరంగల్- ఆరూరి రమేశ్, కడియం కావ్య (BRS)
*మహబూబాబాద్- సీతారాం నాయక్, మాలోత్ కవిత (BRS)
*ఖమ్మం- తాండ్ర వినోద్ రావు, నామా నాగేశ్వర రావు (BRS)
*ఆదిలాబాద్- గొడం నగేశ్, ఆత్రం సక్కు (BRS)
*పెద్దపల్లి- గోమాస శ్రీనివాస్, కొప్పుల ఈశ్వర్, గడ్డం వంశీకృష్ణ
*కరీంనగర్- బండి సంజయ్, బోయినపల్లి వినోద్ కుమార్ (BRS)
*నిజామాబాద్- అర్వింద్ ధర్మపురి, బాజిరెడ్డి గోవర్ధన్ (BRS)
*జహీరాబాద్- BB పాటిల్, గాలి అనిల్ కుమార్, సురేశ్ షెట్కార్
*మెదక్- రఘునందన్ రావు, వెంకట్రామిరెడ్డి (BRS)
*మల్కాజిగిరి- ఈటల రాజేందర్, రాగిడి లక్ష్మారెడ్డి, సునీతా మహేందర్ రెడ్డి
*సికింద్రాబాద్- కిషన్ రెడ్డి, పద్మారావు గౌడ్, దానం నాగేందర్
*హైదరాబాద్- మాధవీలత, గడ్డం శ్రీనివాస్ యాదవ్ (BRS)
సొంతగడ్డ HYDలో ఐపీఎల్ మ్యాచ్ చూడాలనుకునే అభిమానులకు నిరాశే మిగులుతోంది. ఈనెల 27న జరిగే హైదరాబాద్-ముంబై మ్యాచ్ టికెట్లు చాలా మందికి దొరకలేదు. తాజాగా SRH-CSK టికెట్లు పెట్టిన కొద్దిసేపట్లోనే అందుబాటులో లేకుండా పోయాయి. పూర్తి కోటా టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచట్లేదని, బ్లాక్ చేస్తున్నారన్న అనుమానాలు పెరుగుతున్నాయని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ప్రియమణి, యామీ గౌతమ్ కీలక పాత్రల్లో నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఆర్టికల్ 370. ఫిబ్రవరి 23న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. రూ.20 కోట్లతో తెరకెక్కగా.. రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఈ చిత్రం జియో సినిమాలో ఏప్రిల్ 19 నుంచి అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.
AP: టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి అధికారంలోకి రాగానే పారదర్శకంగా పోలీస్ నియామకాలు చేపడతామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తెలిపారు. తాడేపల్లిలో ప్రచారంలో మాట్లాడుతూ.. ‘ఐదేళ్లుగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. ఎన్నికల సమయంలో అధికార పార్టీ నేతలు గొడవలు సృష్టిస్తారు. ఓర్పు, సహనంతో అందరూ ఓటు వేయాలి’ అని పిలుపునిచ్చారు.
గుజరాత్‌తో జరిగిన మ్యాచులో ఫస్ట్ ఓవర్ హార్దిక్ వేయడంపై విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై బ్యాటింగ్ కోచ్ పొలార్డ్ స్పందించారు. ‘హార్దిక్ GT జట్టులో ఉండగా గత 2 సీజన్లలో కొత్త బంతితో బౌలింగ్ చేసి రాణించాడు. స్వింగ్‌ను ఉపయోగించుకోవాలనేదే అతని ఉద్దేశం. అతని నిర్ణయంలో తప్పులేదు. అలాగే డేవిడ్‌ను హార్దిక్ కంటే ముందు బ్యాటింగ్‌కు పంపడం టీమ్ తీసుకున్న నిర్ణయం. హార్దిక్ సొంత నిర్ణయం కాదు’ అని తెలిపారు.
కర్ణాటక మాజీ మంత్రి, కళ్యాణ రాజ్యప్రగతి పార్టీ అధినేత గాలి జనార్దన్ రెడ్డి BJPలో చేరారు. బెంగళూరులో మాజీ CM యడ్యూరప్ప, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. తన KRPP పార్టీని BJPలో విలీనం చేస్తున్నట్లు జనార్దన్ ప్రకటించారు. BJPలో చేరడం అదృష్టంగా భావిస్తున్నానన్న ఆయన.. BJP అనేది తన రక్తంలోనే ఉందన్నారు. మూడోసారి మోదీ ప్రధాని అయ్యేందుకు కృషి చేస్తానని తెలిపారు.
Sorry, no posts matched your criteria.