News March 22, 2024

మెక్సికన్ మోడల్‌ను పెళ్లాడిన జొమాటో సీఈఓ?

image

జొమాటో CEO దీపిందర్ గోయల్ మెక్సికోకు చెందిన వ్యాపారవేత్త, మాజీ మోడల్‌ గ్రేసియా మునోజ్‌ను వివాహమాడినట్లు తెలుస్తోంది. రెండు నెలల క్రితమే వీరి వివాహం జరిగిందని ఈ విషయాన్ని గుట్టుగా ఉంచినట్లు సమాచారం. ‘ఇండియాలో నా ఇంటికి వచ్చేశాను’ అనే క్యాప్షన్‌తో ఇటీవల గ్రేసియా ఇన్‌స్టాలో ఫొటోలు షేర్ చేశారు. కాగా గోయల్‌కు ఇది రెండో వివాహం. గతంలో ఆయన తన ఐఐటీ క్లాస్‌మేట్ కంచన్ జోషిని వివాహమాడారు.

News March 22, 2024

కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తొలగించాలని పిల్

image

కేజ్రీవాల్‌ను ఢిల్లీ సీఎం పదవి నుంచి తప్పించాలని ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. సామాజిక కార్యకర్త సుర్జిత్ సింగ్ యాదవ్ ఈ పిల్ దాఖలు చేశారు. లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ అరెస్టు అయ్యారని, సీఎంగా ఆయనను తొలగించాలని పిటిషన్‌లో కోరారు. కాగా, సీఎంను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ రౌస్ అవెన్యూ కోర్టును కోరుతోంది. దీనిపై వాదనలు కొనసాగుతున్నాయి.

News March 22, 2024

ఈడీ అధికారులపై కేజ్రీవాల్ నిఘా?

image

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈడీ అధికారులు కేజ్రీవాల్ ఇంట్లో సోదాలు చేస్తుండగా దాదాపు 150 పేజీల డాక్యుమెంట్ దొరికినట్లు తెలుస్తోంది. ఇందులో ఈడీ స్పెషల్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ హోదాలో ఉన్న ఇద్దరు అధికారుల సమగ్ర వివరాలు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆ అధికారులపై కేజ్రీవాల్ నిఘా ఉంచారేమోనని ఈడీ అనుమానిస్తోందట.

News March 22, 2024

మొన్న BSP నుంచి.. ఇప్పుడు BRS నుంచి..

image

TG: అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నుంచి BSP అభ్యర్థిగా పోటీ చేసిన RS ప్రవీణ్ కుమార్ ఓడిపోయారు. తర్వాత BRSతో పొత్తు పెట్టుకుని.. BSP తరఫున నాగర్‌కర్నూల్ ఎంపీగా పోటీకి సిద్ధమయ్యారు. అనూహ్యంగా పొత్తు విడిపోవడంతో BRSలో చేరిపోయారు. ఇప్పుడు అదే పార్టీ, అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక సిద్దిపేట కలెక్టర్‌గా VRS తీసుకున్న వెంకట్రామిరెడ్డి BRSలో చేరి MLC అయ్యారు. ఇప్పుడు మెదక్ టికెట్ దక్కించుకున్నారు.

News March 22, 2024

తెలంగాణ వ్యక్తికి MP టికెట్ ఇచ్చిన చంద్రబాబు

image

AP: టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితాలో ఆసక్తికర అంశం చోటుచేసుకుంది. తెలంగాణ క్యాడర్ ఐపీఎస్ అధికారి తెన్నేటి కృష్ణప్రసాద్‌కు చంద్రబాబు బాపట్ల (SC) ఎంపీ టికెట్ కేటాయించారు. 1960లో HYDలో జన్మించిన ఈయన NIT వరంగల్, అహ్మదాబాద్ IIMలో చదివారు. 1984లో IPSగా ఎంపికై.. మావోయిస్టులను జనజీవన స్రవంతిలో కలపడంలో కీలకపాత్ర పోషించారు. విజయవాడ సీపీగా పని చేశారు. ఈయన కొద్ది రోజుల క్రితం వరంగల్ BJP ఎంపీ టికెట్ ఆశించారు.

News March 22, 2024

లిక్కర్ స్కాం మొత్తం రూ.600 కోట్లకు పైనే: ED లాయర్

image

కేజ్రీవాల్ కనుసన్నల్లోనే ఢిల్లీ మద్యం విధానానికి రూపకల్పన జరిగిందని ఈడీ తరఫు లాయర్ ఎస్వీ రాజు కోర్టు దృష్టికి తెచ్చారు. ‘కిక్‌బ్యాక్‌లకు బదులుగా సౌత్ గ్రూప్ మద్యం వ్యాపారంపై పట్టు సాధించింది. ఈ నేర ఆదాయం రూ.100 కోట్ల లంచం మాత్రమే కాదు. లంచం చెల్లించే వారి ద్వారా వచ్చే లాభాలు కూడా ఉన్నాయి. అవన్నీ కలిపితే రూ.600 కోట్లకు పైమాటే. రూ.45 కోట్లు హవాలా ద్వారా గోవాకు బదిలీ చేశారు’ అని తెలిపారు.

News March 22, 2024

ఈ ఇద్దరు నేతలకు నిరాశే!

image

AP: YCP నుంచి TDPలో చేరి సస్పెన్షన్‌కు గురైన ఇద్దరు నేతల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. గుంటూరు(D) తాడికొండ Ex MLA శ్రీదేవి, నెల్లూరు(D) ఉదయగిరి Ex MLA చంద్రశేఖర్ రెడ్డికి TDP మూడో జాబితాలోనూ చుక్కెదురైంది. ఆ జిల్లాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తి కావడంతో.. ఇక వీరు ఈ ఎన్నికల బరిలో లేనట్లేనని తెలుస్తోంది. మరో ఇద్దరు నేతలు కోటంరెడ్డి(నెల్లూరుR), రామనారాయణ రెడ్డి(ఆత్మకూరు)కి TDP సీట్లు కేటాయించింది.

News March 22, 2024

అప్పుడు కటింగ్ షాప్.. కట్ చేస్తే రూ.1200 కోట్లు

image

ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అనేది నిజమే. ఇందుకు ఈ రమేశ్ ఉత్తమ ఉదాహరణ. తనకు వచ్చిన ఓ ఆలోచనను ఆచరణలో పెడితే వచ్చిన ఫలితం రూ.1200 కోట్లు. ఇంతకీ ఆయనకు వచ్చిన ఆ ఆలోచన ఏంటి, ఏం చేశారు? కటింగ్ షాపు నుంచి సీన్ కట్ చేస్తే ఇంత సంపద ఎలా వచ్చింది..? అనే విషయాల కోసం ఇక్కడ <>క్లిక్ చేయండి<<>>. ఇలాంటి ఆసక్తికర కంటెంట్ కోసం ఈ పేజ్ ఫాలో చేయండి.

News March 22, 2024

బిగ్‌బాస్ నటి అరెస్ట్

image

కన్నడ బిగ్‌బాస్ ఫేమ్ సోను శ్రీనివాస గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎనిమిదేళ్ల బాలికను ఆమె అక్రమంగా దత్తత తీసుకోవడంతో బైదరహళ్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను బాలికను దత్తత తీసుకున్నానంటూ ఇటీవల సోను సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు ఆమెపై ఫిర్యాదు చేశారు. సమాజంలో సానుభూతి, పేరు ప్రఖ్యాతల కోసమే ఆమె చిన్నారిని దత్తత తీసుకున్నట్లు పేర్కొన్నారు.

News March 22, 2024

పెస్టిసైడ్స్‌తో వణుకుడు రోగం

image

ప్రస్తుత రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో మనిషి శరీర భాగాల్లో వణుకు మొదలవుతుంది. కాగా ఈ వ్యాధికి పెస్టిసైడ్స్ ఓ కారణమని పరిశోధకులు తేల్చారు. అట్రాజైన్, లిండేన్, సిమేజైన్ వంటి 14 రకాల క్రిమిసంహారక మందుల ద్వారా ఈ వ్యాధి ప్రబలుతోందని తెలిపారు. వ్యవసాయ క్షేత్రాల్లో పని చేసేవారు, ఆయా పరిసర ప్రాంతాల్లో ఉండేవారు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందట.

error: Content is protected !!