India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ అటవీ ప్రాంతంలో కిడ్నాప్‌నకు గురైన జవాన్ మృతిచెందారు. బుల్లెట్ గాయాలతో పడి ఉన్న ఆయన మృతదేహాన్ని భద్రతా బలగాలు గుర్తించాయి. టెరిటోరియల్ ఆర్మీకి చెందిన ఇద్దరు జవాన్లను ఉగ్రవాదులు నిన్న కిడ్నాప్ చేయగా, ఒక జవాన్ చాకచక్యంగా తప్పించుకున్నారు. మరో జవాన్ కోసం భద్రతా బలగాలు గాలించగా, తాజాగా మృతదేహం లభ్యమైంది.

AP: ఇంద్రకీలాద్రిపై సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అనిత తెలిపారు. వీఐపీల కోసం క్యూలైన్లు ఆపడం లేదని స్పష్టం చేశారు. మూడు గంటల్లోనే దర్శనం పూర్తి అవుతోందని సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. మొదటి 2-3 గంటలే భక్తులు కంపార్ట్‌మెంట్లలో నిరీక్షించారని తెలిపారు. ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పని చేస్తూ భక్తులకు దర్శన ఏర్పాట్లు చేస్తున్నాయన్నారు.

TG: BRS MLA మల్లారెడ్డి CM రేవంత్‌రెడ్డిని కలిశారు. తన మనవరాలి వివాహానికి రావాలంటూ రేవంత్‌కు ఆహ్వానపత్రిక అందజేశారు. అటు మాజీ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబును సైతం మల్లారెడ్డి ఆహ్వానించారు.

ఈ దసరాకు తెలుగులో ఆరు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇందులో ముందుగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘వేట్టయన్’ ఈనెల 10న విడుదలవనుంది. 11వ తేదీన సుధీర్ బాబు ‘మా నాన్న సూపర్ హీరో’, గోపీచంద్ ‘విశ్వం’, ఆలియా భట్ ‘జిగ్రా’, ధ్రువ సర్జా ‘మార్టిన్’ రిలీజ్ కానున్నాయి. కాగా సుహాస్ ‘జనక అయితే గనక’ మూవీ ఈనెల 12న రానుంది. వీటిలో మీరు ఏ మూవీకి వెళ్లాలనుకుంటున్నారు? కామెంట్ చేయండి.

AP: వైసీపీ తప్ప రాజకీయ పార్టీలన్నీ ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తున్నాయని TDP నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. గత ప్రభుత్వం కుల గణన చేసినా వివరాలు వెల్లడించలేదని విమర్శించారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును కూటమి ప్రభుత్వం ఆహ్వానించిందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఈ నెల 11న దుర్గామాత ఆలయాల్లో పూజలు నిర్వహిస్తామని తెలిపారు. త్వరలో గవర్నర్, మంత్రులు, అఖిలపక్ష నేతలను కలుస్తామని అన్నారు.

JK ఓటర్ల వైఖరిలో మార్పు కనిపిస్తోంది. తమకు వ్యతిరేకంగా భావించే BJPకి ముస్లిములు గణనీయంగా ఓట్లేశారు. గురెజ్‌లో 97% ఓటర్లు ముస్లిములే. ఇక్కడ BJP అభ్యర్థి ఫకీర్ మహ్మద్ 1132 ఓట్లతో ఓడిపోయారు. ఆయనకు 40.3%, విజేత నజీర్ అహ్మద్ (NC)కు 46.64% ఓట్లు పడ్డాయి. 70% ముస్లిములు ఉండే కిష్టావర్‌లో BJP అభ్యర్థి షగున్ పరిహార్ 521 ఓట్లతో గెలిచారు. మొత్తం ఓట్లలో ఆమెకు 48%, ప్రత్యర్థి సాజద్ (NC)కు 47.14% వచ్చాయి.

AP: కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రేపు జరిగే క్యాబినెట్ సమావేశంలో కొత్త కార్డుల జారీ, అడ్రస్ మార్పులు, కుటుంబ సభ్యుల చేర్పులు/తొలగింపులు వంటి అంశాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. 6వేల రేషన్ డీలర్ల భర్తీ, 4వేల కొత్త రేషన్ షాపుల ఏర్పాటుపై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే త్వరలోనే రేషన్ కార్డుల తుది డిజైన్‌ను ఖరారు చేస్తారని తెలుస్తోంది.

సినీతారల డేట్స్, ప్రమోషన్స్, బిజినెస్ చూసేందుకు వారికి మేనేజర్స్ ఉంటారనే విషయం తెలిసిందే. స్టార్స్ ఎదుగుదలలో కీలకంగా ఉండే మేనేజర్లకు కూడా భారీగా జీతాలుంటాయని సినీవర్గాలు పేర్కొన్నాయి. ‘షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ ఏడాదికి రూ.7-9 కోట్లు, అంజుల ఆచార్య (ప్రియాంక చోప్రా) రూ.6కోట్లు సంపాదిస్తున్నారు. గతంలో పూనమ్(కరీనా) రూ.3 కోట్లు, సుసాన్(రణ్‌వీర్ సింగ్) రూ.2కోట్లు ఛార్జ్ చేసేవారు’ అని తెలిపాయి.

TG: రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై BRS సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించింది. చిట్టినాయుడి ప్రజా పాలన కేవలం మాటలకే పరిమితమైందని, మూడు నెలలు గడిచినా పంచాయతీ కార్మికులకు జీతాలు అందలేదని పేర్కొంది. జీతాలు రాక తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలి అంటూ వాళ్లు నిరసన చేపడుతున్నారని ట్వీట్ చేసింది. ఈ ప్రభుత్వం పండుగలకు కార్మికులను పస్తులు ఉంచుతోందని మండిపడింది.

‘యానిమల్’లో తాను పోషించిన రోల్‌పై సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన విమర్శలు రావడంతో నటి త్రిప్తి దిమ్రీ 2-3 రోజులు ఏడుస్తూ కూర్చున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సందీప్‌రెడ్డి డైరెక్షన్‌లో రణ్‌బీర్ హీరోగా వచ్చిన ఆ మూవీలో త్రిప్తి బోల్డ్ క్యారెక్టర్ చేశారు. దానిపై వచ్చిన ట్రోలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాలేదని ఆమె అన్నారు. అయితే కొన్నిసార్లు ఏడవటమూ గాయం నుంచి బయటపడేస్తుందని చెప్పుకొచ్చారు.
Sorry, no posts matched your criteria.