India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. హర్మన్‌ప్రీత్‌కౌర్‌కు విశ్రాంతి ఇచ్చారు.
న్యూజిలాండ్: బేట్స్, ప్లిమ్మర్, కెర్, సోఫీ డివైన్(C), బ్రూక్ హాలిడే, మాడీ గ్రీన్, గాజ్, లారెన్ డౌన్, జెస్ కెర్, పెన్‌ఫోల్డ్, కార్సన్.
భారత్: మంధాన(C), షఫాలీ, భాటియా, హేమలత, రోడ్రిగ్స్, దీప్తిశర్మ, హసబ్నిస్, రాధా యాదవ్, అరుంధతిరెడ్డి, సైమా ఠాకూర్, రేణుకాసింగ్.

AP: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో CM చంద్రబాబు ఒక్కటి కూడా నెరవేర్చలేదని జగన్ విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికే లడ్డూ అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. గుర్లలో డయేరియాతో చనిపోయిన 14 మంది కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. ‘మదనపల్లిలో ఫైల్స్ తగలబడితే DGPని పంపారు. ఇక్కడ ప్రాణాలు పోతుంటే ఒక్క మంత్రి కూడా రాడు’ అని మండిపడ్డారు.

నేషనల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా 500 పోస్టులు ఖాళీలున్నాయి. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన 21 నుంచి 30 ఏళ్ల లోపు వారు అర్హులు. రిజర్వేషన్ బట్టి వయోసడలింపు ఉంటుంది. అభ్యర్థులు నవంబర్ 11లోపు ఆన్‌లైన్లో అప్లై చేసుకోవాలి. నవంబర్ 30న ఫేజ్-1, డిసెంబర్ 28న ఫేజ్-2 రాత పరీక్షలు నిర్వహిస్తారు. వెబ్‌సైట్: nationalinsurance.nic.co.in/recruitment

సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. హాలీవుడ్ నటుడు రాన్ ఎలీ(86) కన్నుమూశారు. 1960లో కండలు తిరిగిన ‘టార్జాన్’గా ఆయన నటించారు. ఈ సినిమాతో ఎంతో గుర్తింపు పొందారు. ఆయన మరణ వార్తను కుమార్తె కిర్‌స్టెన్ సోషల్ మీడియా ద్వారా తాజాగా ధ్రువీకరించారు. ఈ ప్రపంచం ఓ గొప్ప వ్యక్తిని, తాను తండ్రిని కోల్పోయినట్లు ట్వీట్‌లో ఆమె పేర్కొన్నారు. 100కు పైగా సినిమాల్లో నటించిన ఆయన 2001లో నటనకు స్వస్తిపలికి రచయితగా మారారు.

TG: నమ్ముకున్న పార్టీయే తనను అవమానిస్తోందంటూ AICC చీఫ్ మల్లికార్జున ఖర్గేకు కాంగ్రెస్ MLC జీవన్‌రెడ్డి లేఖ రాశారు. తన భవిష్యత్తు కార్యాచరణపై పార్టీనే మార్గదర్శకం చేయాలన్నారు. కాంగ్రెస్ కూడా కేసీఆర్‌లా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందన్నారు. పార్టీలో ప్రస్తుత పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

TG: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా రేపు ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తామని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రకటించారు. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని, కాంగ్రెస్ దోపిడీకి, పేదల ఇళ్ల కూల్చివేతలకు తాము వ్యతిరేకమన్నారు. మూసీ ప్రాజెక్ట్ ఓ పెద్ద స్కామ్ అని బండి ఆరోపించారు. ఉద్యోగులకు సరిగ్గా జీతాలు ఇవ్వలేని ప్రభుత్వానికి మూసీ కోసం రూ.1.50 లక్షల కోట్లు ఎక్కడివని నిలదీశారు.

సుప్రీంకోర్టులో విప్లవాత్మక మార్పులను కపిల్ సిబల్ నేతృత్వంలోని బార్ అసోసియేషన్ ప్రశ్నించింది. కొత్త ఎంబ్లెమ్, న్యాయదేవత మార్పులపై తమను సంప్రదించలేదని పేర్కొంది. మ్యూజియం ప్రతిపాదించిన స్థలంలో లాయర్లకు కెఫేను నిర్మించాలని డిమాండ్ చేసింది. తాము వ్యతిరేకిస్తున్నా మ్యూజియం పనులు మొదలవ్వడంపై ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయ పరిపాలనలో తామూ సమాన హక్కుదారులమని, మార్పులు తమ దృష్టికి తీసుకురాలేదని తెలిపింది.

కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోక్సో కేసులో అరెస్టయిన జానీ ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు. ఈ అరెస్టు నేపథ్యంలో ఆయనకు ప్రకటించిన నేషనల్ అవార్డు కూడా రద్దయిన విషయం తెలిసిందే.

NZతో రెండో టెస్టులో వాషింగ్టన్ సుందర్‌కు చోటివ్వడం టీమ్‌ఇండియా భయానికి సంకేతమని సునిల్ గవాస్కర్ అన్నారు. అందుకే కుల్‌దీప్ యాదవ్‌ను తీసుకోలేదన్నారు. ‘సాధారణంగా గాయాల బెడద ఉంటే తప్ప జట్టులోంచి ముగ్గుర్ని తప్పించరు. బ్యాటింగ్ డెప్త్‌పై ఆందోళనతోనే కుల్‌దీప్‌ను కాదని సుందర్‌ను తీసుకున్నారు. నిజమే, NZలో ఎక్కువ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. కానీ కుల్‌దీప్ వారికి దూరంగా బంతిని టర్న్ చేయగలరు’ అని వివరించారు.

AP: అవినాశ్ రెడ్డిని విమర్శించడం మానేస్తేనే షర్మిలకు ఆస్తి రాసిస్తానంటూ YS జగన్ బ్లాక్‌మెయిల్ చేశారని TDP ట్వీట్ చేసింది. ‘నీ గురించి రాజకీయంగా విమర్శించవద్దని అన్నావు ఓకే. కానీ మధ్యలో అవినాశ్ ఎందుకు వచ్చాడు? అవినాశ్‌ను విమర్శిస్తున్నారని సొంత తల్లి, చెల్లిపై కేసు పెట్టడం ఏంటి? బాబాయ్ హత్యలో నిందితుడైన అతని గురించి మాట్లాడితే నీ ఇంటి నుంచి జరిగిన హత్య మంత్రాంగం బయటపడుతుందని భయమా?’ అని పేర్కొంది.
Sorry, no posts matched your criteria.