News January 19, 2026

నేడు దావోస్‌కు CM రేవంత్

image

TG: వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో పాల్గొనేందుకు నేడు సీఎం రేవంత్ దావోస్ వెళ్లనున్నారు. మేడారంలో మహాజాతరను ప్రారంభించాక ఉ.8 గం.కు హెలికాప్టర్‌లో HYD చేరుకుంటారు. ఉ.9.30గం.కు శంషాబాద్ నుంచి CM, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శులు పర్యటనకు వెళ్లనున్నారు. గూగుల్, సేల్స్‌ఫోర్స్, యూనిలివర్, లోరియల్, టాటా గ్రూప్, ఇన్ఫోసిస్, సిస్కో వంటి సంస్థల అధినేతలతో రేవంత్ భేటీ అవుతారు.

News January 19, 2026

శివపార్వతుల నిత్య నివాసం, మోక్ష క్షేత్రం ‘వారణాసి’

image

పురాణాల ప్రకారం.. పార్వతీదేవి కోరిక మేరకు శివుడు కైలాసం వదిలి గంగాతీరంలోని కాశీని తన స్థిర నివాసంగా చేసుకున్నాడు. అందుకే కాశీ శివపార్వతుల గృహంగా, మోక్ష నగరంగా విరాజిల్లుతోంది. ఇక్కడి విశ్వనాథ జ్యోతిర్లింగ దర్శనం పాపాలను తొలగిస్తుందని నమ్మకం. జీవన్మరణాల సంగమమైన ఈ క్షేత్రంలో మరణించిన వారికి శివుడు స్వయంగా మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అందుకే భారతీయ సంస్కృతిలో కాశీకి అత్యంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది.

News January 19, 2026

సంక్రాంతి ముగిసింది.. రొటీన్ లైఫ్ మొదలైంది

image

సంక్రాంతి సెలవులు ముగిశాయి. ఇష్టం లేకపోయినా, మనసుకు కష్టమైనా సరే పల్లెలు విడిచి తిరిగి పట్టణాలకు చేరుకున్నారు. మళ్లీ అదే ఉరుకులు పరుగుల జీవితంలోకి అడుగు పెట్టేశారు. బాస్ మెప్పు కోసం తిప్పలు, కెరీర్ వెనుక పరుగులు, నైట్ షిఫ్టులతో కుస్తీలు పడాల్సిందే. ఈ ఏడాది సొంతూరులో గడిపిన క్షణాలు, అమ్మానాన్న ఆప్యాయతలు, అయినవాళ్ల పలకరింపులను మనసులో దాచుకుని మళ్లీ వచ్చే సంక్రాంతి వరకు వాటినే నెమరువేసుకోవాలి!

News January 19, 2026

24% పెరిగిన ఆటోమొబైల్ ఎగుమతులు

image

భారత్ నుంచి 2025లో ఆటోమొబైల్ ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. 2024లో 50,98,474 వాహనాల ఎగుమతి జరగ్గా.. గతేడాది ఆ సంఖ్య 63,25,211(24.1%)కు చేరింది. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో డిమాండ్ బాగా పెరుగుతోంది. ప్యాసింజర్ వాహనాల ఎగుమతి 16%, యుటిలిటీ వెహికల్స్ 32శాతం, కార్ల ఎగుమతులు 3% మేర పెరిగాయి. వీటిలో 3.95 లక్షల యూనిట్లు ఎగుమతి చేసి మారుతీ సుజుకీ అగ్రస్థానంలో నిలిచింది.

News January 19, 2026

గ్రీన్‌లాండ్‌కు మద్దతుగా నిలుస్తాం: NATO దేశాలు

image

గ్రీన్‌లాండ్ ప్రజలకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని డెన్మార్క్, ఫిన్‌లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్, UK దేశాలు జాయింట్ స్టేట్మెంట్ రిలీజ్ చేశాయి. ‘ఆర్కిటిక్ రక్షణకు కట్టుబడి ఉన్నాం. మా సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు కలిసి పనిచేస్తాం. టారిఫ్ బెదిరింపులు ట్రాన్స్‌అట్లాంటిక్(US-యూరప్) సంబంధాలను దెబ్బతీస్తాయి. పరిస్థితులు మరింత దిగజారొచ్చు కూడా’ అని అమెరికాను హెచ్చరించాయి.

News January 19, 2026

శభాష్ హర్షిత్ రాణా.. నీపై బాధ్యత పెరిగింది!

image

NZతో జరిగిన వన్డే సిరీస్‌లో హర్షిత్ రాణా అద్భుత ప్రదర్శన చేశారు. 3 వన్డేల్లో కలిపి 6 వికెట్లు తీసి.. 83 రన్స్ చేశారు. అతను జట్టులో అవసరమా అన్న పరిస్థితి నుంచి జట్టుకు అతని అవసరముంది అనేలా రాణించారు. ట్రోల్స్‌ని పట్టించుకోకుండా ముందుకు సాగారు. కోచ్ గంభీర్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టారు. అతనికి బ్యాటర్‌గానూ అవకాశాలిస్తే జట్టులో మంచి ఆల్రౌండర్‌గా ఎదిగే ఆస్కారముందని క్రీడా నిపుణులు అంటున్నారు.

News January 19, 2026

జనవరి 19: చరిత్రలో ఈరోజు

image

1597: ఉదయపూర్ రాజు మహారాణా ప్రతాప్ మరణం * 1736: భౌతిక శాస్త్రవేత్త జేమ్స్ వాట్ జననం * 1855: ‘ది హిందూ’ పత్రిక వ్యవస్థాపకుడు జి.సుబ్రహ్మణ్య అయ్యర్ జననం * 1905: భారత తత్వవేత్త దేవేంద్రనాథ్ ఠాగూర్ మరణం * 1972: భారత క్రికెటర్ వినోద్ కాంబ్లీ జననం * 1990: ప్రముఖ ఆధ్యాత్మిక బోధకుడు ఓషో మరణం (ఫొటోలో).

News January 19, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News January 19, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News January 19, 2026

ఘోర పరాభవం

image

2024లో న్యూజిలాండ్‌పై స్వదేశంలో తొలి టెస్టు సిరీస్‌ను చేజార్చుకున్న టీమ్ ఇండియా తాజాగా తొలి వన్డే సిరీస్‌ను కోల్పోయింది. ఇప్పటివరకు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో సిరీస్‌ను కోల్పోని భారత జట్టు తాజా ఓటమితో ఈ అప్రతిష్ఠను మూటగట్టుకుంది. ఇక ఇండోర్ వేదికలో ఆడిన 8 మ్యాచుల్లో భారత్‌కిదే తొలి ఓటమి కావడం గమనార్హం.