India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, మహబూబ్‌నగర్, మేడ్చల్, నాగర్‌కర్నూల్, నారాయణపేట్, రంగారెడ్డి, వికారాబాద్, భువనగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, గంటకు 40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

దేశంలో డిజిటల్ ప్రకటనలకు డిమాండ్ పెరుగుతోంది. ఆన్‌లైన్ ద్వారా తమ వస్తువులు, ఉత్పత్తుల ప్రచారానికి వ్యాపారులు పెద్దపీట వేస్తున్నారు. Google India ఆదాయం FY24లో గత ఏడాదితో పోల్చితే 26% పెరిగి రూ.5,921 కోట్లుగా నమోదవ్వడమే అందుకు నిదర్శనం. భారత్‌లో డిజిటల్ అడాప్షన్ పెరగడంతో ప్రకటనల్లో వృద్ధి, ఎంటర్‌ప్రైజ్ ఉత్పత్తుల విక్రయాలు ఈ పెరుగుదలకు కారణమని సంస్థ తెలిపింది.

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈనెల 25న ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20వ తేదీ వరకు కొనసాగనున్న ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది.

అమెరికాలోని 52 లక్షల మంది భారతీయ అమెరికన్లలో ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో 26 లక్షల మంది అర్హులు ఓటు వేయనున్నారు. గతంలో ఉదారవాద భావాలున్న డెమోక్రాట్లకు వీరు అనుకూలంగా ఉన్నారు. అయితే క్రమేణా వారికి దూరమవుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. 2020 ఎన్నికల్లో 56% మంది డెమోక్రాట్లకు మద్దతు ఇవ్వగా, 2024లో 47% మాత్రమే సపోర్ట్ చేస్తున్నట్టు ఇండియన్ అమెరికన్ ఆట్టిట్యూడ్స్ సర్వేలో తేలింది.

గతంలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు అండర్ వరల్డ్ నుంచి బెదిరింపులు వచ్చాయని ఆయన మాజీ ప్రేయసి సోమీ అలీ తెలిపారు. సల్మాన్‌తోపాటు గ్యాలెక్సీ అపార్ట్‌మెంట్‌లో ఉన్నప్పుడు కొన్ని సంఘటనలు జరిగాయని చెప్పారు. ‘ఓ రోజు సల్మాన్ ఫోన్‌కు ఎవరో కాల్ చేయగా నేను లిఫ్ట్ చేశా. సల్మాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. ఈ విషయం ఆయనతో చెప్పగానే కాస్త భయపడ్డారు. ఆ తర్వాత మళ్లీ ఫోన్ కాల్స్ రాలేదు’ అని గుర్తు చేసుకున్నారు.

TG: ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ‘లబ్ధిదారుల ఎంపిక వేగవంతం చేశాం. మొత్తం 4 దశల్లో ఇళ్లు కేటాయిస్తాం. మొదటిదశలో నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇస్తాం. ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల వివరాలను ప్రకటిస్తాం. 400 చ.అడుగుల్లో ఇంటి నిర్మాణం ఉంటుంది. సొంత స్థలం ఉన్న వారికి రూ.5లక్షలు దశల వారీగా ఇస్తాం. ఇంటి యజమానిగా మహిళనే గుర్తిస్తాం’ అని ఆయన వెల్లడించారు.

TG: దేశవ్యాప్తంగా కులగణన జరగాలన్నది తమ పార్టీ నిర్ణయమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈనెల 5న బోయినపల్లిలో కులగణనపై సలహాలు, సూచనల కోసం నిర్వహించే కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొంటారని పేర్కొన్నారు. కులగణన ప్రక్రియకు సంబంధించిన వివరాలు తెలుసుకుంటారని చెప్పారు.

టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో అర్ధ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో భారతీయ వికెట్ కీపర్‌లలో అత్యధిక సార్లు 50+ స్కోర్ చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచారు. మహేంద్ర సింగ్ ధోనీ 39 సార్లు 50+ రన్స్ బాది ప్రథమ స్థానంలో ఉండగా పంత్ 19 అర్ధ సెంచరీలు చేశారు. మూడు, నాలుగు స్థానాల్లో ఫారుఖ్ ఇంజినీర్ (18), సయ్యద్ కిర్మాణి (14) ఉన్నారు.

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటించిన ‘షోలే’ సినిమా 1975లో రిలీజై భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమా నెలకొల్పిన రికార్డును ఇప్పటి వరకు ఏ చిత్రం బ్రేక్ చేయలేకపోయింది. ఈ సినిమా ఏకంగా 25 కోట్ల టికెట్లను విక్రయించినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. ఇది భారతీయ సినీ చరిత్రలో అత్యధికం. రాజమౌళి ‘బాహుబలి-2’ మూవీ టికెట్లు 10కోట్ల కంటే ఎక్కువే విక్రయించారు. ఇప్పుడు ఇలాంటివి సాధ్యమవుతాయా?

TG: ప్రధాని మోదీ వ్యాఖ్యలపై CM రేవంత్ <<14511450>>స్పందించగా<<>> దానిపై మాజీ మంత్రి, BRS నేత హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ కేవలం తెలంగాణనే కాదు మొత్తం దేశాన్ని తప్పుదోవపట్టించారని ఆరోపించారు. BRS ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తే ఆ నియామకపత్రాలను కాంగ్రెస్ ఇచ్చిందని, ఎన్నికల కోడ్ వల్ల తాము నియామకపత్రాలు ఇవ్వలేకపోయామన్నారు. రేవంత్ చెబుతున్న 50వేల ఉద్యోగాలు కూడా BRS హయాంలో ఇచ్చినవేనని హరీశ్ అన్నారు.
Sorry, no posts matched your criteria.