India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భారత్‌ను దుర్భర పేదరికం వెంటాడుతోందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. దేశంలో 12.9 కోట్ల మంది పేదలు ఉన్నారని తాజా నివేదికలో వెల్లడించింది. దీనికి జనాభా పెరుగుదలే కారణమని వివరించింది. వీరంతా ధనవంతులుగా మారడానికి దశాబ్దాలు పట్టొచ్చని పేర్కొంది. భారత్‌లో పేదల ఆదాయం రోజుకు రూ.181 కన్నా తక్కువగా ఉందని తెలిపింది. అయితే 1990లో 43.1కోట్ల మంది పేదలు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 12.9కోట్లకు చేరుకుందని వివరించింది.

TG: గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేయాలన్న కొందరు అభ్యర్థుల డిమాండ్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే మూడు సార్లు ప్రిలిమ్స్ రాశామని, మళ్లీ వాయిదా వేయడం ఎందుకని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమయం, డబ్బులు వృథా అవుతున్నాయని వాపోతున్నారు. రిజర్వేషన్లపై కోర్టులో కేసులు ఉన్నాయని, ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తే మళ్లీ మొదటికి వస్తుందని మరికొందరు వాదిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

AP: వాయుగుండం ప్రభావంతో కాకినాడ(D) ఉప్పాడ తీరం అల్లకల్లోలంగా మారింది. భారీగా ఎగసిపడుతున్న రాకాసి అలలు, ఈదురుగాలుల ధాటికి పలు ఇళ్లు, విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. పలు ఇళ్లలోకి సముద్ర జలాలు చేరాయి. దీంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ప్రస్తుతం గంటకు 17KM వేగంతో వాయుగుండం కదులుతోంది. మరికొన్ని గంటల్లో పుదుచ్చేరి-నెల్లూరు మధ్య తీరం దాటనుంది. దీనిప్రభావంతో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి.

TG: హైడ్రాకు విశేష అధికారాలు వచ్చాయని, ఇక నుంచి చెరువులతో పాటు పార్కులు, ప్రభుత్వ స్థలాలు, రోడ్లను పరిరక్షిస్తుందని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు నోటీసులివ్వడం, వాటిని తొలగించడం, అనధికార భవనాలను సీజ్ చేయడం వంటి అధికారాలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ మేరకు GHMC చట్టంలోని సెక్షన్ 374 (B)ని హైడ్రా అధికారాలుగా చేరుస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిందన్నారు.

చెన్నైలో అత్యంత భారీ వర్షాలు కురుస్తుండటంతో ముందు జాగ్రత్తగా ధనవంతులు హోటళ్లకు వెళ్లిపోతున్నారు. గతేడాది భారీ వరదలతో ఇబ్బందులు పడడంతో ఈసారి ఆ సమస్య లేకుండా ముందే ఖాళీ చేసి వెళ్తున్నారు. కార్ పార్కింగ్, విద్యుత్, వైఫై సౌకర్యాలు ఉన్న విలాసవంతమైన హోటళ్లలో దిగుతున్నారు. మరోవైపు వాతావరణ శాఖ గురువారం అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. సాధారణ ప్రజలు ఎక్కడికీ వెళ్లలేక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

TG: ఒక్క ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను రద్దు చేయాలంటూ ఆందోళన చేస్తున్న అభ్యర్థులకు ఆయన మద్దతు తెలిపారు. ఇవాళ HYDలోని అశోక్ నగర్ లేదా తెలంగాణ భవన్‌లో వారిని కలుస్తానని ట్వీట్ చేశారు. మెయిన్స్ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని, అరెస్టు చేసిన అభ్యర్థులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

AP: వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అనంతపురం, సత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, వైఎస్సార్, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వానలు పడతాయని అంచనా వేసింది. వాయుగుండం నేడు తీరం దాటే సమయంలో 55 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే ఆస్కారం ఉందని పేర్కొంది. రాష్ట్రంలోని వివిధ పోర్టులకు హెచ్చరికలు చేసింది.

AP: రాష్ట్రంలో మరోసారి నామినేటెడ్ పదవుల భర్తీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నెల 23న రెండో జాబితాను సీఎం చంద్రబాబు విడుదల చేస్తారని సమాచారం. ఈ సారి మహిళా నేతలకు భారీగా పదవులు దక్కే అవకాశముంది. టీడీపీకి 60 శాతం, జనసేనకు 30, బీజేపీకి 10 శాతం చొప్పున కేటాయించనున్నట్లు సమాచారం. ఈ పదవుల కేటాయింపు ముగిసిన వెంటనే టీడీపీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభించనుంది.

TG: కోర్టు కేసులన్నీ పరిష్కరించిన తర్వాతనే రాష్ట్రంలో గ్రూప్-1 పరీక్షలు నిర్వహించాలని BRS నేత రాకేశ్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘జీఓ 29 వర్సెస్ 55తోపాటు అనేక కేసులు ఉన్నాయి. ప్రభుత్వం వీటిని పరిష్కరించి పరీక్ష నిర్వహిస్తుందా? లేదా పట్టించుకోకుండా నిర్వహిస్తుందా? కోర్టు తీర్పు తర్వాత మళ్లీ మెయిన్స్ పరీక్ష పెడతారా? ఈ విషయంలో అభ్యర్థులు సందిగ్ధంలో ఉన్నారు’ అని ఆయన ట్వీట్ చేశారు.

హరియాణా సీఎంగా రెండోసారి నాయబ్ సింగ్ సైనీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ శాసనసభాపక్షం ఆయన పేరును ఏకగ్రీవంగా ఆమోదించడంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. సైనీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ హాజరుకానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వెళ్లనున్నారు.
Sorry, no posts matched your criteria.