News March 23, 2024

శుభ ముహూర్తం

image

తేదీ: మార్చి 23, శనివారం,
ఫాల్గుణము
శుద్ధ త్రయోదశి: ఉదయం 07:17 గంటలకు
పుబ్బ: తెల్లవారుజామున 07:33 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 06:09-06:58 గంటల వరకు,
మధ్యాహ్నం 06:58-07:46 గంటల వరకు
వర్జ్యం: మధ్యాహ్నం 01:30-03:18 గంటల వరకు

News March 23, 2024

బోణి కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్

image

ఐపీఎల్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఆ జట్టు 174 పరుగుల టార్గెట్‌ను 18.4 ఓవర్లలోనే చేధించింది. జట్టులో రచిన్ రవీంద్ర (37), అజింక్య రహానే (27) రాణించారు. చివర్లో శివమ్ దూబే (34), రవీంద్ర జడేజా (25) మెరుపులు మెరిపించడంతో ఆ జట్టు విజయ తీరాలకు చేరింది. బెంగళూరు బౌలర్లలో కామెరూన్ గ్రీన్ 2 వికెట్లు తీశారు.

News March 23, 2024

ఈరోజు హెడ్‌లైన్స్

image

* అట్టహాసంగా IPL ప్రారంభం
* CM కేజ్రీవాల్‌కు ఈనెల 28వరకు రిమాండ్
* AP: పిఠాపురం నుంచే పవన్ ఎన్నికల ప్రచారం
* TG: ఈ నెల 24న తెలంగాణ బంద్‌‌కు మావోయిస్టుల పిలుపు
* AP: మూడో జాబితా ప్రకటించిన టీడీపీ
* TG: ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ: మంత్రి జూపల్లి
* ఉపాధి హామీ పథకం కూలీల వేతనాలు త్వరలో పెంపు
* AP: పురందీశ్వరి రాజీనామా వార్త అవాస్తవం: బీజేపీ
* BJP నాలుగో జాబితా విడుదల

News March 22, 2024

గ్రూప్1 దరఖాస్తుల ఎడిట్‌కు ఛాన్స్: TSPSC

image

TG: గ్రూప్1 అభ్యర్థులు తాము చేసుకున్న దరఖాస్తుల్లో మార్పులు చేసుకునేందుకు TSPSC అవకాశం కల్పించింది. రేపటి నుంచి ఈ ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఈ నెల 23 ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 27 సాయంత్రం 5గంటల వరకు అభ్యర్థులు దరఖాస్తుల్లోని వ్యక్తిగత వివరాలు సవరించుకోవచ్చని పేర్కొంది.

News March 22, 2024

BJPతో ఉంటే ఏ కేసూ ఉండదు: CM మమత

image

CBI, ED కేసులు ఎదుర్కొంటున్నవారు BJPతో కలిస్తే ఏ కేసులూ ఉండవని పశ్చిమ బెంగాల్ CM మమతా బెనర్జీ అన్నారు. ఆ పార్టీతో సంబంధాలున్నవారు ఎన్ని అక్రమాలు చేసినా శిక్షలుండవని ఆమె ఆరోపించారు. ప్రతిపక్ష CMలను లక్ష్యంగా చేసుకొని అరెస్టులు చేయడం దారుణమని వాపోయారు. కేజ్రీవాల్ అరెస్టును ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళతానని ఆమె పేర్కొన్నారు. ఆయన అరెస్టును ఖండిస్తున్నామని, ఇది అప్రజాస్వామికమని మమత స్పష్టం చేశారు.

News March 22, 2024

16వేల మారుతీ సుజుకీ కార్లు రీకాల్

image

మారుతీ సుజుకీ 16వేల కార్లను రీకాల్ చేసింది. ‘2019లో JUN 30 నుంచి NOV 1 మధ్య సేల్ అయిన 11,851 బాలెనో.. 4,190 వాగన్-ఆర్ కార్లలో ఫ్యూయెల్ పంప్ మోటార్‌లో లోపం ఉన్నట్లు గుర్తించాం. దీంతో ఇంజిన్ స్టార్ట్ కాకపోవడం లేదా ఆగిపోవడం వంటి సమస్యలు రావొచ్చు. సంబంధిత కస్టమర్లను సంప్రదించి ఉచితంగా రిపేర్ చేస్తాం’ అని తెలిపింది. కాగా 2023లో స్టీరింగ్ రాడ్ లోపం కారణంగా 87,599 ఎస్-ప్రెసో, ఎకో కార్లను రీకాల్ చేసింది.

News March 22, 2024

హోలీ ఆదివారమా? సోమవారమా?

image

హోలీ పండుగ ఆదివారం జరుపుకోవాలా? సోమవారం జరుపుకోవాలా? అనే దానిపై పండితులు స్పష్టతనిచ్చారు. ప్రతి ఏడాది ఫాల్గుణం శుక్ల పక్షం పౌర్ణమి రోజున హోలీ జరుపుకుంటారు. దృక్ పంచాంగం ప్రకారం ఆదివారం (మార్చి 24) ఉదయం 9.54 నుంచి సోమవారం (మార్చి 25) మ.12.29 వరకు పౌర్ణమి తిథి ఉంది. అందుకే మార్చి 24న లేదా మార్చి 25న ఉదయం కూడా హోలీ జరుపుకోవచ్చని చెప్పారు.

News March 22, 2024

కేజ్రీవాల్ పిటిషన్లు ఎందుకు వెనక్కి తీసుకున్నారు?

image

తమ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ CM కేజ్రీవాల్ సుప్రీంలో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇటీవల కవిత సైతం ఇలాగే చేశారు. రౌస్ అవెన్యూ కోర్టుతో పాటు సుప్రీం కోర్టులోనూ విచారణ ఒకే రోజు ఉండటంతో పిటిషన్ వెనక్కి తీసుకున్నట్లు కేజ్రీవాల్ లాయర్ చెప్పారు. కాగా కవిత పిటిషన్‌పై స్పందించిన SC.. లోయర్ కోర్టుకు వెళ్లాలని సూచించింది. తమ విషయంలోనూ ఇదే జరుగుతుందనే కేజ్రీవాల్ విత్‌డ్రా చేసుకున్నారని తెలుస్తోంది.

News March 22, 2024

డాక్టర్లు సైతం ఏఐ వాడాల్సిందే: ప్రముఖ సర్జన్

image

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైద్య రంగాన్ని దెబ్బతీయొచ్చని ఊహాగానాలు వస్తున్న వేళ ప్రముఖ సర్జన్ డాక్టర్ అతుల్ గవాండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘వైద్య రంగంలో ఏఐ ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఏఐ డాక్టర్లను భర్తీ చేయదు. కానీ ఏఐని ఉపయోగించని డాక్టర్ స్థానంలో ఆ టెక్నాలజీ వాడే మరో డాక్టర్ వస్తారు. ఏఐతో వ్యాధులను ముందస్తుగా గుర్తించడమే కాక మరింత వేగంగా చికిత్స అందించొచ్చు’ అని పేర్కొన్నారు.

News March 22, 2024

కోహ్లీ.. T20ల్లో 12,000 రన్స్

image

రన్ మెషీన్ కోహ్లీ అరుదైన మైలురాయి అందుకున్నారు. T20 క్రికెట్‌లో 12,000 పరుగులు పూర్తి చేసుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్‌గా అవతరించారు. మొత్తంగా 6వ క్రికెటర్‌గా నిలిచారు. గతంలో గేల్(14562), మాలిక్(13360), పొలార్డ్(12900), హేల్స్(12319), వార్నర్(12065) ఈ ఫీట్ సాధించారు. కాగా తక్కువ ఇన్నింగ్సుల్లో(360) ఈ మైలురాయి అందుకున్న 2వ క్రికెటర్‌గా కోహ్లీ నిలిచారు. గేల్(345) టాప్‌లో ఉన్నారు.

error: Content is protected !!