News October 16, 2024

బాలయ్య, సూర్య.. ఒకే వేదికపైకి..?

image

నందమూరి బాలకృష్ణ, తమిళ నటుడు సూర్య కలిసి ఒకే వేదికపైకి వచ్చే అవకాశం ఉంది. సూర్య నటించిన కంగువ మూవీ రిలీజ్‌కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దాని ప్రమోషన్ల కోసం బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ షోకి సూర్య రానున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చేవారం దీనికి సంబంధించిన ఎపిసోడ్స్ చిత్రీకరిస్తారని సమాచారం. కంగువ వచ్చే నెల 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

News October 16, 2024

అమెరికాలో ప్రమాదం.. ఏపీలో తీవ్ర విషాదం

image

AP: అమెరికాలోని రాండాల్ఫ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ముగ్గురు కారులో వెళ్తుండగా సౌత్ బాన్‌హాన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వీరితోపాటు మరో ఇద్దరు భారతీయులు కూడా మరణించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 16, 2024

నెతన్యాహు హామీ ఇచ్చారు: అమెరికా

image

ఇరాన్ అణు, చమురు క్షేత్రాలపై దాడి చేయబోమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హామీ ఇచ్చారని అమెరికా తెలిపింది. అలాగే గాజాలో పౌరులకు మానవతా సాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు యూఎస్ తెలిపింది. లేదంటే సైనిక సహాయంలో కోత తప్పదని హెచ్చరించింది. ఇందుకు నెల గడువు ఇస్తున్నట్లు తెలిపింది. సాయంలో పురోగతి కనిపించకుంటే సైనిక సాయంలో కోత తప్పదని స్పష్టం చేసింది.

News October 16, 2024

మహారాష్ట్రలో బుధవారమే పోలింగ్.. ఎందుకంటే?

image

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. నవంబర్ 20న బుధవారం పోలింగ్ జరగనుంది. కాగా బుధవారమే పోలింగ్ జరపడం వెనుక పెద్ద కారణమే ఉందని సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ‘పోలింగ్ కోసం మేం కావాలనే ఆ రోజును ఎంచుకున్నాం. వారం మధ్యలో బుధవారం పోలింగ్ పెడితే పట్టణ ఓటర్లు అధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకుంటారు. అదే వీకెండ్‌లో పెడితే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు’ అని ఆయన చెప్పారు.

News October 16, 2024

RCB ఫ్యాన్స్ అత్యంత విశ్వాసంగా ఉంటారు: అశ్విన్

image

RCB టీమ్‌ను, అభిమానుల్ని భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసించారు. ఆ జట్టు అభిమానులు అత్యంత విశ్వాసం కలిగినవాళ్లని పేర్కొన్నారు. ‘ఆర్సీబీ ఫ్యాన్స్‌కు విరాట్ అంటే ప్రాణం. సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతున్నప్పుడు వాళ్లు నిరాశకు లోనవుతుంటారు. అయినా మద్దతును మాత్రం ఆపరు. RCBకి వారి ఫ్యాన్స్ దేవుడిచ్చిన వరం. గడచిన పదేళ్లలో అత్యంత స్థిరంగా ఆడుతున్న జట్టు ఆర్సీబీయే’ అని కొనియాడారు.

News October 16, 2024

అక్టోబర్ 16: చరిత్రలో ఈ రోజు

image

1916: నటుడు, క్రీడాకారుడు దండమూడి రాజగోపాలరావు జననం
1948: నటి, రాజకీయ నాయకురాలు హేమా మాలిని జననం
1958: రచయిత తెన్నేటి సూరి మరణం
1975: సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాక్వెస్ కల్లిస్ జననం
1985: భారతదేశంలో జాతీయ భద్రతా దళం (NSG) ఏర్పాటు
1990: నెల్సన్ మండేలాకు భారతరత్న పురస్కారం
1990: మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ జననం
ప్రపంచ ఆహార దినోత్సవం

News October 16, 2024

క్రాష్ టెస్టులో టాటా కర్వ్‌కు 5 స్టార్ రేటింగ్!

image

టాటా మోటార్స్ మరో ఘనత సాధించింది. ఆ సంస్థ లేటెస్ట్ కార్ ‘కర్వ్’కు BNCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ దక్కింది. భద్రత విషయంలో కార్లలో ఈ రేటింగ్‌నే అత్యుత్తమంగా చెబుతారు. పెద్దల రక్షణలో 29.50/32, పిల్లల రక్షణలో 43.66/49 స్కోర్లు సాధించింది. కర్వ్‌లో బేసిక్ వేరియెంట్ నుంచీ 6 ఎయిర్‌బ్యాగ్స్ ఇస్తుండటం విశేషం. ప్రయాణికుల భద్రత విషయంలో టాటా కార్లకు మంచి పేరున్న సంగతి తెలిసిందే.

News October 16, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 16, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: అక్టోబర్ 16, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున 4:57 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:09 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:02 గంటలకు
అసర్: సాయంత్రం 4:16 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5:53 గంటలకు
ఇష: రాత్రి 7.06 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 16, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.