India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: ప్రభుత్వ జూనియర్, ఎయిడెడ్ కాలేజీల సమయాల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ప్రస్తుతం ఉ.9 నుంచి సా.4 వరకు టైమింగ్స్ ఉండగా, ఈ నెల 16 నుంచి సా.5 వరకు సమయాన్ని పొడిగించింది. గత ఏడాది ఫలితాల్లో ఆశించిన స్థాయిలో విద్యార్థులు రాణించకపోవడంతో సా.4-5 గంటల మధ్య స్టడీ అవర్ నిర్వహించాలని ఇంటర్ బోర్డు డైరెక్టర్ కృతిక శుక్ల ఉత్తర్వులిచ్చారు. ఈ మేరకు టైమ్ టేబుల్ సిద్ధం చేసుకోవాలని ప్రిన్సిపల్స్‌ను ఆదేశించారు.

శ్రీసింహా, సత్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మత్తు వదలరా-2’ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. అర్ధరాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. రితీశ్ రాణా దర్శకత్వం వహించిన ఈ మూవీ గత నెల 13న విడుదలైన సూపర్ హిట్‌గా నిలిచింది. కాలభైరవ సంగీతం అందించగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించారు. వెన్నెల కిశోర్, సునీల్, రోహిణి, ఝాన్సీ కీలక పాత్రలు పోషించారు.

తెలంగాణ నుంచి ఏపీకి 15వేల క్వింటాళ్ల శనగ విత్తనాలు రానున్నాయి. ప్రస్తుత ఏపీ అవసరాల దృష్ట్యా మంత్రి అచ్చెన్నాయుడి విజ్ఞప్తితో కిలో రూ.90 చొప్పున అమ్మేందుకు TG మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంగీకరించారు. విత్తనోత్పత్తి, ప్రాసెసింగ్, హమాలీ సహా అన్ని ఖర్చులు కలిపి రూ.86 చొప్పున గిట్టుబాటు అవుతుండగా, ఏపీకి ఎగుమతి చేయడంతో కిలో రూ.4 లాభం తెలంగాణ సీడ్ కార్పొరేషన్‌కు లభించనుంది.

AP: దసరా కానుకగా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెండింగ్ DAలు, PRC, IR ప్రకటించాలని ఏపీ ఉపాధ్యాయ సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఏ ప్రభుత్వం ఉన్నా దసరా కానుకగా IR ప్రకటించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపింది. నూతన వేతన సవరణ కోసం కమిటీకి వెంటనే ఛైర్మన్‌ను నియమించాలని ప్రభుత్వాన్ని కోరింది. గత ప్రభుత్వం వేసిన కమిటీ ఛైర్మన్ వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నట్లు పేర్కొంది.

Internet Archive వెబ్‌సైట్‌పై ప్రో పాలస్తీనా హ్యాకర్లు దాడిచేశారు. 3.1 కోట్ల మంది పర్సనల్ డేటా, ఈ-మెయిల్ అడ్రస్‌లు, స్క్రీన్ నేమ్స్, ఎన్‌క్రిప్టెడ్ పాస్‌వర్డ్స్‌ను చోరీచేశారు. అక్టోబర్ 9న జావాస్క్రిప్ట్ లైబ్రరీ ఆధారంగా హ్యాకర్లు డేటాబ్రీచ్‌కు పాల్పడ్డారు. వారి నుంచి 6.4GB డేటాబేస్ అందినట్టు Have I Been Pwned? ఫౌండర్ ట్రాయ్ హంట్ తెలిపారు. తామే హ్యాకింగ్ అటాక్స్ చేశామని SN_BlackMeta తెలిపింది.

AP: రాష్ట్రవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడ కనకదుర్గమ్మ ఇవాళ మహిషాసురమర్దనిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అష్టభుజాలతో సింహ వాహనంపై కొలువుదీరారు. ఈ అలంకారంలో అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సర్వదోషాలు తొలగిపోతాయని, ధైర్య, స్థైర్య, విజయాలు చేకూరుతాయని భక్తుల నమ్మకం.

TG:వృద్ధాప్యంలో తండ్రికి నీడగా నిలవాల్సిన కొడుకులు కాదనుకున్నారు. సిరిసిల్ల(D) తంగళ్లపల్లిలో తండ్రి రాజమల్లు పేరుతో రావాల్సిన డబుల్ బెడ్ రూమ్‌ను భార్య పేరుతో పెద్ద కొడుకు రాయించుకున్నాడు. 6 నెలలుగా ఇద్దరు కొడుకులూ పట్టించుకోకపోవడంతో భిక్షాటన చేస్తూ కడుపునింపుకుంటున్నాడు. ఇటీవల ఫిర్యాదు చేయడంతో కొడుకు డబుల్ బెడ్ రూమ్ ఇంటిని RDO తండ్రికి కేటాయించారు. ఆయనకు నెలకు ₹2000 ఇవ్వాలని కొడుకులను ఆదేశించారు.

దివంగత రతన్ టాటా దేశానికి చేసిన సేవకు గుర్తుగా భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ప్రజల నుంచి పెరుగుతోంది. గొప్ప మానవతావాది అయిన టాటా నిజమైన రత్నమని, ఆయనను అత్యున్నత పురస్కారంతో గౌరవించుకోవడం సముచితమని పేర్కొంటున్నారు. తాజాగా మహారాష్ట్ర క్యాబినెట్ కూడా ఆయనకు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేసింది. కాగా నిన్న కోట్లాది మంది అశ్రునయనాల మధ్య ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి.
* టాటాకు ‘భారతరత్న’ డిమాండ్‌పై మీరేమంటారు?

AP: కేంద్ర పథకం PMFMEని రాష్ట్రంలో మహిళ ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం అనుసంధానించనుంది. డ్వాక్రా సంఘాల్లో ఉంటూ ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్ ఆసక్తి ఉన్న మహిళలకు కేవలం 6 శాతం వడ్డీకి రూ.40వేల చొప్పున రుణం మంజూరు చేయనుంది. దీన్ని రెండేళ్లలో చెల్లించాలి. ఈ ఏడాది 10వేల మందికి అమలుచేసేందుకు కసరత్తు జరుగుతోంది. కేంద్రం రూ.40 కోట్లు విడుదలకు అనుమతివ్వగా, వారం రోజుల్లోనే మహిళల ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి.

ఉగ్రవాదాన్ని ఎగుమతిచేసే పాకిస్థాన్ ఇప్పుడు వేర్పాటువాదుల దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. SCO సమ్మిట్‌కు భద్రత కల్పించడం తలకు మించిన భారంగా మారింది. OCT 12 నుంచి 16 వరకు ఇస్లామాబాద్, రావల్పిండి నగరాలను షట్‌డౌన్ చేస్తోంది. ఇక్కడ పావురాలు, గాలిపటాలు ఎగరకూడదని ఆదేశించింది. అందుకని పావురాల గూళ్లను తొలగించాలని సూచించింది. దీంతో మహిళా పోలీసుల సాయంతో 38 రూఫ్‌టాప్స్‌పై గూళ్లను తీసేసింది డిపార్ట్‌మెంట్.
Sorry, no posts matched your criteria.