India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: ఈ నెల 3 నుంచి 21 వరకు టెట్-2024 పరీక్షలు జరగనున్నాయి. మొదటి సెషన్ ఉ.9.30 నుంచి మ.12 వరకు, రెండో సెషన్ మ.2.30 నుంచి సా.5 వరకు ఉంటుంది. హాల్ టికెట్లలో తప్పులు ఉంటే సరైన ఆధారాలు చూయించి సెంటర్ దగ్గరున్న నామినల్ రోల్స్‌లో సరిచేసుకోవాలని అధికారులు సూచించారు. ఇప్పటివరకు హాల్ టికెట్లు తీసుకోని వారు https://aptet.apcfss.in/కు వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.

AP: రాజకీయాల కోసమే తిరుమల లడ్డూ వివాదాన్ని తీసుకొచ్చారని ఎంపీ అవినాశ్ రెడ్డి విమర్శించారు. ‘కల్తీ నెయ్యి వాడలేదని EO ప్రకటించారు. వాడారని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వంలోని పెద్దలకే సయోధ్య లేదు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో అయినా ప్రభుత్వం కళ్లు తెరవాలి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది. YCP నాయకులను కేసులతో వేధిస్తున్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని గుర్తు పెట్టుకోవాలి’ అని హెచ్చరించారు.

యానిమల్ సినిమాతో స్టార్ డమ్ సొంతం చేసుకున్న హీరోయిన్ తృప్తి దిమ్రి వివాదంలో చిక్కుకున్నారు. జైపూర్‌కు చెందిన మహిళా వ్యాపారవేత్తలు FICCI FLO ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈవెంట్‌కు వస్తానని తృప్తి రూ.5.5 లక్షలు తీసుకున్నారని సమాచారం. నిన్న ఈవెంట్‌కు ఆమె రాకపోవడంతో మోసం చేశారంటూ నిర్వాహకులు ఆమె ఫొటోపై పెయింట్ వేసి నిరసన తెలిపారు. ఆమె సినిమాలను బ్యాన్ చేస్తామని, లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు.

TG: 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి విద్యుత్ ఉద్యోగులకు డిస్కమ్‌లు భారీగా జీతాలు పెంచనున్నాయి. 20శాతం ఫిట్‌మెంట్ అమలు చేస్తామని ప్రకటించాయి. 2022లో వేతన సవరణ జరగ్గా 7శాతం ఫిట్‌మెంట్ ఇచ్చాయి. గత పదేళ్లలో మూడు సార్లు వేతన సవరణ జరగ్గా వేతనాలు 180శాతానికి పైగా పెరిగినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల ఖర్చు ఏటా 7శాతం పెరుగుతుండటంపై ERC వివరణ కోరగా, డిస్కంలు ఈ మేరకు ప్రకటించాయి.

AP: కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రులే కామపిశాచులై అఘాయిత్యాలకు పాల్పడ్డ ఘటనలు నెల్లూరు(D)లో జరిగాయి. అల్లూరు(M)లో ఓ గ్రామానికి చెందిన దంపతులకు ముగ్గురు కుమార్తెలు. మద్యం మత్తులో ఉన్న తండ్రి తలుపు గడి పెట్టి పెద్దకూతురి(12)పై అత్యాచారానికి ఒడిగట్టాడు. నిస్సహాయ స్థితిలో ఆ తల్లి ఇంటి బయటే పిల్లలతో రోదిస్తూ కూర్చుంది. చేజర్ల(M)లో బాలికపై తండ్రే అత్యాచారం చేశాడు. నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

TG: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో సోదాల తర్వాత ఈడీ ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై మాజీ మంత్రి KTR స్పందించారు. ‘మహా సంపన్న తెలంగాణ మంత్రిపై దాడుల తర్వాత ఏంటి ఈ మౌనం ఈడీ? 5 రోజుల తర్వాత కూడా ఎలాంటి ప్రకటన లేదా? ఈ డ్రామా బీజేపీ, కాంగ్రెస్ ‘అజబ్ ప్రేమ్‌కి గజబ్ కహానీ’లో భాగమేనా?’ అని ప్రశ్నల వర్షం కురిపించారు.

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడి మరువకముందే డెన్మార్క్ రాజధాని కోపెన్ హేగెన్‌లో పేలుళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. అక్కడి ఇజ్రాయెల్ ఎంబసీకి సమీపంలో వెంట వెంటనే రెండు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఇప్పటివరకూ ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు.

iPhone16 అమ్మకాలతో ఊపుమీదున్న యాపిల్ వచ్చే ఏడాది సరికొత్త Low end ఫోన్‌ను తీసుకురానుందని తెలిసింది. V59 కోడ్‌నేమ్‌తో వస్తున్న అప్‌డేటెడ్ iPhone SE మొబైళ్లు ప్రొడక్షన్‌కు చేరువైనట్టు సమాచారం. ఇదే టైమ్‌లో కొత్త iPad Air మోడళ్లు, కీబోర్డుల రిలీజుకు ప్లాన్ చేస్తోందని అంతర్గత వర్గాలు చెప్తున్నాయి. తక్కువ ధర ఆండ్రాయిడ్ మొబైళ్లకు చెక్ పెట్టేందుకు iPhone SEని మోడర్న్‌గా మార్చేందుకు కంపెనీ సిద్ధమైంది.

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ & రూరల్ డెవలప్‌మెంట్ (NABARD) నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 108 ఆఫీస్ అటెండెంట్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 2 నుంచి 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్/ఓబీసీ/EWSకు ఫీజు రూ.450 ఎస్సీ/ఎస్టీ/PWDకి రూ.50. వయసు: 18 నుంచి 30 ఏళ్లు. టెన్త్ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. సైట్: https://www.nabard.org/

OCT 1 నుంచి అమల్లోకి వచ్చిన TRAI <<13981589>>వైట్‌లిస్టింగ్<<>> రూల్స్‌తో తొలిరోజు ఎలాంటి అవాంతరాలు కలగలేదు. బ్యాంకులు, ఇతర సంస్థలు పంపిన కమర్షియల్ మెసేజులు సరిగ్గానే వెళ్లాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికీ URLsను వైట్‌లిస్ట్ చేయకపోవడంతో 15-20% ట్రాఫిక్ తగ్గినట్టు అధికారులు తెలిపారు. టెలికం ఆపరేటర్లు బ్లాక్ చేస్తారు కాబట్టి వారు మెసేజులను పంపలేదని చెప్పారు. త్వరలోనే వారూ వైట్‌లిస్ట్ చేస్తారని వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.