News March 27, 2024

ఆర్టీసీ ఉద్యోగులకూ పోస్టల్ బ్యాలెట్ సదుపాయం: ఈసీ

image

AP: పోలింగ్ రోజు విధులు నిర్వహించే ఆర్టీసీ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించాలని జిల్లా కలెక్టర్లకు ఈసీ ఆదేశాలిచ్చింది. అలాగే అత్యవసర సేవల్లో ఉండే 33 శాఖలకు చెందిన ఉద్యోగులకు ఈ సౌకర్యం కల్పించనుంది. రైల్వే, విద్యుత్, ఫైర్, అంబులెన్స్, హెల్త్, పోలీస్, ఫుడ్ కార్పొరేషన్‌తో పాటు తదితర డిపార్ట్‌మెంట్లలో పనిచేసే ఉద్యోగులు, ఈసీ అనుమతి పొందిన మీడియా సంస్థల్లో పనిచేసేవారు ఈ లిస్టులో ఉన్నారు.

News March 27, 2024

నా ఫోన్‌నూ ట్యాప్ చేశారు: బండి

image

TG: రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘గత ప్రభుత్వం 18 మంది ఇంటెలిజెన్స్ సిబ్బందితో నాపై నిఘా పెట్టింది. నా ఫోన్‌నూ ట్యాప్ చేయించింది. మంత్రి పొన్నం ప్రభాకర్, BRS నేత కేటీఆర్ కలిసి నన్ను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారు’ అని ఆరోపించారు.

News March 27, 2024

రోహిత్ ఖాతాలో అరుదైన ఘనత

image

ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో అరుదైన ఘనత చేరనుంది. ఐపీఎల్ చరిత్రలో ముంబై తరఫున 200 మ్యాచులు ఆడిన తొలి ప్లేయర్‌గా ఆయన నిలవనున్నారు. ఇవాళ SRHతో మ్యాచులో ఈ మైలురాయిని చేరుకోనున్నారు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ(239-RCB), ధోనీ(222-CSK) మాత్రమే ఒకే జట్టు తరఫున 200కు పైగా మ్యాచులు ఆడిన ప్లేయర్లుగా ఉన్నారు.

News March 27, 2024

టెట్ ఫలితాలు, DSC నిర్వహణపై కీలక అప్‌డేట్

image

AP: TET ఫలితాల ప్రకటన, DSC-2024ను హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించాలని యోచిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. దీనిపై అనుమతి కోరుతూ ECకి లేఖ రాశామన్నారు. అనుమతిస్తే TET ఫలితాలను ప్రకటించి, DSC హాల్ టికెట్లు విడుదల చేస్తామన్నారు. హైకోర్టు ఆదేశాలతో SGT పరీక్షలకు అనర్హులైన వారికి, ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోలేకపోయిన వారికి త్వరలోనే ఫీజులను తిరిగి చెల్లిస్తామని పేర్కొన్నారు.

News March 27, 2024

ఏడుగురు అక్కాచెల్లెళ్లు పోలీసులయ్యారు

image

బిహార్‌లోని ఛప్రా పట్టణానికి చెందిన కమల్ సింగ్, శారదాదేవి దంపతులకు ఏడుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. తల్లిదండ్రులు కష్టపడి చదివించడంతో ఏడుగురు కుమార్తెలు పోలీసు ఉద్యోగాలను సాధించారు. ఆబ్కారీ శాఖ, కేంద్ర సాయుధ బలగాల్లో పనిచేస్తున్నారు. తమ తల్లిదండ్రులు, తమ్ముడికి 4 అంతస్తుల భవనాన్ని నిర్మించి ఇచ్చారు. ఇప్పుడు ఆ భవనం ద్వారా వచ్చే అద్దెతో వారు హాయిగా జీవిస్తున్నారు.

News March 27, 2024

మునావర్ ఫరూఖీ అరెస్ట్

image

స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్‌బాస్-17 విజేత మునావర్ ఫరూఖీని పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని బోరా బజార్‌లో ఉన్న ఓ హుక్కా పార్లర్‌పై అర్ధరాత్రి రైడ్ చేసి, అతనితో సహా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. హెర్బల్ హుక్కా ముసుగులో పొగాకు ఆధారిత హుక్కా వాడుతున్నారన్న సమాచారం రావడంతో రైడ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పొగాకు హుక్కా పీల్చినట్లు తేలితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

News March 27, 2024

నేడు హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన

image

TG: తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి నేడు సీజేఐ చంద్రచూడ్ శంకుస్థాపన చేయనున్నారు. రంగారెడ్డి(D) బుద్వేల్‌లో సాయంత్రం 5.30 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. హైకోర్టు నిర్మాణానికి వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయానికి చెందిన 100 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. పాత భవనాన్ని చారిత్రక కట్టడంగా పరిరక్షిస్తూ సివిల్ కోర్టు అవసరాలకు వినియోగించనున్నారు.

News March 27, 2024

వడగాడ్పుల హెచ్చరికలు.. రాష్ట్రాలకు ఈసీ కీలక సూచనలు

image

మార్చి-జూన్ మధ్య వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉందన్న IMD హెచ్చరికల నేపథ్యంలో ఈసీ అప్రమత్తమైంది. సార్వత్రిక ఎన్నికల్లో జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు సీఈసీ లేఖ రాసింది. పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, సరైన నీడ, మెడికల్ కిట్, ORS ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలంది. సీనియర్ సిటిజన్లు, గర్భిణులు, పోలింగ్ ఏజెంట్లకు ఫర్నీచర్‌‌తో పాటు ప్రత్యేక టాయిలెట్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

News March 27, 2024

మళ్లీ YCPలోకి క్రికెటర్ అంబటి రాయుడు?

image

క్రికెటర్ అంబటి రాయుడు చేసిన తాజా ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ‘సిద్ధం!!’ అని రాయుడు పోస్ట్ చేశారు. నేటి నుంచి వైసీపీ అధినేత, సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే రాయుడు ‘సిద్ధం’ అని పోస్ట్ చేయడంతో మళ్లీ వైసీపీలోకి వస్తారా? అనే చర్చ మొదలైంది. కాగా, గతేడాది DECలో వైసీపీలో చేరిన రాయుడు.. జనవరి 7న రాజీనామా చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్‌ను కలిశారు.

News March 27, 2024

103 సిట్టింగ్‌లకు నో టికెట్

image

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటిదాకా బీజేపీ 405 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆశ్చర్యకరంగా ఈ జాబితాలో 103 మంది సిట్టింగ్‌లకు టికెట్ నిరాకరించింది. పూర్తి జాబితా వచ్చేసరికి ఈ సంఖ్య పెరగొచ్చు. గత ఎన్నికల్లో ఇదే విధానాన్ని అనుసరించినప్పటికీ BJP 300కు పైగా సీట్లను గెలుచుకుంది. ఈ సారి ఏకంగా 400 స్థానాలు లక్ష్యంగా పెట్టుకోగా.. అభ్యర్థుల మార్పు ఏ మేరకు కలిసి వస్తుందో వేచి చూడాలి.