India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డాషింగ్ ప్లేయర్ సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ జట్టు ఫ్రాంచైజీకి ఆడినప్పుడు తన ఆటతీరు మారిందని.. స్ట్రైక్ రేట్ తగ్గిపోయిందని చెప్పారు. జట్టుకు తగినట్లుగా ఉండాలనేది ఈ విషయంలో రుజువైందన్నారు. ప్లేయర్లు సరిగా ఆడకపోవడంతో పంజాబ్ ట్రోఫీ గెలవలేకపోయిందని తెలిపారు. IPLలో సెహ్వాగ్ ఢిల్లీ, పంజాబ్ జట్ల తరఫున ఆడిన సంగతి తెలిసిందే. 104 మ్యాచుల్లో 2,728 పరుగులు చేశారు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి.
AP: YCP అధినేత జగన్ నేడు ఇడుపులపాయ నుంచి బస్సు యాత్రతో ఎన్నికల ప్రచార భేరికి శ్రీకారం చుట్టనున్నారు. మ.ఒంటిగంటకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి, మ.1.30 నుంచి కడప పార్లమెంట్ పరిధిలో పర్యటించనున్నారు. వేంపల్లి, VNపల్లి, యర్రగుంట్ల మీదుగా ప్రయాణించి సా.4 గంటలకు ప్రొద్దుటూరు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం దువ్వూరు, చాగలమర్రి మీదుగా ఆళ్లగడ్డకు చేరుకుని, అక్కడ బస చేస్తారు.
AP: నేడు పలమనేరు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ‘ప్రజాగళం’ పర్యటన మొదలుపెట్టనున్నారు. ఇవాళ పలమనేరుతో పాటు పుత్తూరు, మదనపల్లెలో పర్యటిస్తారు. రేపు రాప్తాడు, శింగనమల, కదిరి, శుక్రవారం శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలులో ప్రచారం నిర్వహిస్తారు. ఈ నెల 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో, 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో CBN పర్యటించనున్నారు.
TS: సిరిసిల్ల జిల్లా కందికట్కూర్ గ్రామంలో విషాదం జరిగింది. సాయితేజ అనే 14 ఏళ్ల విద్యార్థి గుండెపోటుతో పాఠశాల ఆవరణలోనే ప్రాణాలు వదిలాడు. ఎనిమిదో తరగతి చదువుతున్న ఈ బాలుడికి పుట్టుకతోనే గుండెకు రంధ్రం ఉంది. ఆపరేషన్ తప్పనిసరిగా చేయించాలని డాక్టర్లు చెప్పినా ఆర్థిక స్తోమత సరిగా లేకపోవడంతో తల్లిదండ్రులు వైద్యం చేయించలేకపోయారు. ఈ క్రమంలో నిన్న స్కూల్ ఆవరణలోనే గుండెపోటుతో చనిపోయాడు.
TG: రాష్ట్రంలో రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణం కంటే 2-3 డిగ్రీల వరకు పెరిగే అవకాశముందని తెలుపుతూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో ఆరుబయట పనిచేసేవారు, పగటి పూట ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. నిన్న ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తలమడుగు, జైనథ్ మండలాల్లో గరిష్ఠంగా 42.3 డిగ్రీలు రికార్డయ్యాయి.
హీరో అక్కినేని నాగచైతన్య, డైరెక్టర్ కార్తీక్ దండు కాంబినేషన్‌లో త్వరలో ఓ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం. థ్రిల్లర్ కథతో రానున్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశమున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం చైతూ ‘తండేల్’ సినిమాతో బిజీగా ఉన్నారు. కాగా కార్తీక్ దండు గత ఏడాది ‘విరూపాక్ష’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.
TG: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం కానుంది. అయితే TETకు అప్లై చేసుకునే ప్రభుత్వ టీచర్లు కచ్చితంగా విద్యాశాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని టెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు. లేదంటే నిబంధనలు ఉల్లంఘించినట్లుగా పరిగణిస్తామన్నారు. కాగా, ఎస్జీటీలు స్కూల్ అసిస్టెంట్లుగా, స్కూల్ అసిస్టెంట్లు HMలుగా పదోన్నతి పొందాలంటే టెట్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.
AP: ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పిల్లలను వాడుకోవద్దని రాజకీయ పార్టీలకు రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సూచించింది. 18 ఏళ్ల లోపు బాలలను సార్వత్రిక ఎన్నికల కార్యక్రమాల్లో వినియోగించవద్దని కమిషన్ ఛైర్మన్ అప్పారావు అన్నారు. ఉల్లంఘిస్తే ఈసీ కఠిన చర్యలు తీసుకుంటుందని గుర్తు చేశారు. కొద్ది రోజులుగా కొందరు అభ్యర్థులు బాలలను ఎన్నికల పనులకు ఉపయోగిస్తున్నట్లు కమిషన్ దృష్టికి వచ్చిందన్నారు.
రాష్ట్రంలో పంట నష్టాన్ని పరిశీలించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు. వచ్చే నెల మొదటివారంలో ఆయన నల్గొండ, భువనగిరి, ఆలేరులో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి రూట్ మ్యాప్‌ను మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. రైతులతో ముచ్చటించి వారి ఇబ్బందుల్ని కేసీఆర్ స్వయంగా తెలుసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
AP: రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరందుకోనుంది. ప్రధాన పార్టీల అధినేతలు ప్రచార రంగంలోకి దిగనున్నారు. నేటి నుంచి ‘మేమంతా సిద్ధం’ యాత్రకు సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు. ఇడుపులపాయలోని వైఎస్ సమాధి నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర 21 రోజుల పాటు సాగనుంది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నేటి నుంచి ‘ప్రజాగళం’ పేరిట ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఈ నెల 30నుంచి జనసేనాని పవన్ రాష్ట్రవ్యాప్త పర్యటన ప్రారంభిస్తారు.
Sorry, no posts matched your criteria.