News March 27, 2024

ఈ స్వేచ్ఛ నాకు మరే టీమ్ ఇవ్వలేదు: దూబే

image

నిన్న రాత్రి జరిగిన చెన్నైలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 23 బంతుల్లోనే 51 రన్స్ కొట్టిన శివమ్ దూబే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు. ఈ సందర్భంగా సీఎస్కే మేనేజ్‌మెంట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘చెన్నై ఇచ్చిన స్వేచ్ఛ మరే టీమ్ నాకు ఇవ్వలేదు. జట్టుకు అనేక విజయాలు అందించాలని కోరుకుంటున్నా. అన్ని ఫ్రాంచైజీలకంటే చెన్నై భిన్నం’ అని కొనియాడారు.

News March 27, 2024

బెంగళూరు వాసులకు మెగాస్టార్ సూచనలు

image

బెంగళూరులో ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత నీటి సంక్షోభం ప్రస్తుతం నెలకొంది. ఈ నేపథ్యంలో నీటి సంరక్షణపై కర్ణాటకవాసులకు మెగాస్టార్ చిరంజీవి ట్విటర్‌లో పలు సూచనలు చేశారు. ఇంకుడు గుంతలు, చిన్నచిన్న బావులు ఉండేలా ఇళ్లను నిర్మించుకోవాలని, అక్కడి తన ఫామ్ హౌస్‌లోనూ అలాంటి జాగ్రత్తలే తీసుకున్నామని పేర్కొన్నారు. కాగా.. ట్వీట్ మొత్తాన్ని ఆయన కన్నడ భాషలోనే చేయడం విశేషం.

News March 27, 2024

ఫిలిప్పీన్స్‌కు భారత్ అండ, చైనా ఆగ్రహం

image

ఫిలిప్పీన్స్ సౌర్వభౌమత్వానికి అండగా నిలుస్తామని భారత్ ఆ దేశానికి హామీ ఇచ్చింది. దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్ ప్రాదేశిక జలాలను కూడా చైనా తమవేనంటూ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ హామీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. మరోవైపు చైనా భారత్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సౌత్ చైనా సీలో తమ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని తేల్చిచెప్పింది. ఆ విషయంలో మూడో దేశపు జోక్యం సరికాదని హితవుపలికింది.

News March 27, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News March 27, 2024

మార్చి 27: చరిత్రలో ఈరోజు

image

1845: ఎక్స్ రే ఆవిష్కర్త కన్రాడ్ రాంట్జెన్ జననం
1868: మైసూరు మహారాజా ముమ్మడి క‌ృష్ణరాజ్ వడయార్ మరణం
1898: భారత విద్యావేత్త సయ్యద్ అహ్మద్ ఖాన్ మరణం
1903: తెలుగు సినీ దర్శకుడు హెచ్‌వీ బాబు జననం
1968: రోదసిలోకి వెళ్లిన తొలి మనిషి యూరీ గగారిన్ మృతి
1985: నటుడు రామ్ చరణ్ జననం
1998: నరాల బలహీనతకు ఔషధంగా వయాగ్రాకు ఆమోదం
☞ నేడు ప్రపంచ రంగస్థల దినోత్సవం

News March 27, 2024

ఈ రోజు నమాజ్ వేళలు

image

తేది: మార్చి 27, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున గం.5:02
సూర్యోదయం: ఉదయం గం.6:15
జొహర్: మధ్యాహ్నం గం.12:21
అసర్: సాయంత్రం గం.4:45
మఘ్రిబ్: సాయంత్రం గం.6:28
ఇష: రాత్రి గం.07.41
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 27, 2024

శుభ ముహూర్తం

image

తేదీ: మార్చి 27, బుధవారం
బహుళ విదియ: సాయంత్రం 05:06 గంటలకు
చిత్త: మధ్యాహ్నం 04:15 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 11:48-12:36 గంటల వరకు
వర్జ్యం శేషం: తెల్లవారుఝాము 12:14, రాత్రి 10.25 ల

News March 27, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News March 27, 2024

నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు

image

* TS: ఎమ్మెల్సీ కవితకు జుడీషియల్ కస్టడీ
* AP: రెండు రోజులు ఆలస్యంగా పెన్షన్ పంపిణీ
* TS: ఈ కరువు BRS తెచ్చిందే: మంత్రి సీతక్క
* AP: అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ముత్యాలనాయుడు
* TS: సీఎం రేవంత్ BJPలో చేరతారు: కేటీఆర్
* TS: కేంద్రానికి పెట్రోల్ పంప్ డీలర్ల అల్టిమేటం
* IPL: గుజరాత్‌పై చెన్నై విజయం
* FIFA WC క్వాలిఫయర్స్‌లో అఫ్గాన్ చేతిలో ఇండియా ఓటమి

News March 26, 2024

గుజరాత్‌పై CSK ఘనవిజయం

image

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో CSK 63 రన్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన CSK 20 ఓవర్లలో 206/6 రన్స్ చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన GTలో సుదర్శన్(37), మిల్లర్(21), సాహా(21) తప్ప ఎవరూ రాణించకపోవడంతో ఆ జట్టు 20 ఓవర్లలో 143/8 రన్స్ మాత్రమే చేసింది. CSK బౌలర్లలో చాహర్, ముస్తఫిజుర్, దేశ్‌పాండే తలో 2 వికెట్లు తీయగా.. మిచెల్, పతిరాణాలకు చెరో వికెట్ దక్కింది.