India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తేది: సెప్టెంబర్ 30, సోమవారం
త్రయోదశి: రా.7.06గంటలకు
మఖ: ఉ.6.18 గంటలకు
వర్జ్యం: మ.3.17- సా.5.05 గంటల వరకు
దుర్ముహూర్తం: మ.12.21 నుంచి మ.1.09 గంటల వరకు
తిరిగి మ.2.44 నుంచి మ.3.32 గంటల వరకు
రాహుకాలం: ఉ.7.30 నుంచి ఉ.9.00 వరకు

✒ స్వచ్ఛ భారత్ గాంధీకి సముచిత నివాళి: మోదీ
✒ మోదీని దించేవరకు నేను చావను: ఖర్గే
✒ నేపాల్ వరదల్లో 148 మంది మృతి..
✒ APకి 30 ESI ఆస్పత్రులు: పెమ్మసాని
✒ విశాఖలో షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్: లులు ఛైర్మన్
✒ దీపావళికి ఫ్రీ సిలిండర్లు.. సన్నాహాలు ప్రారంభం
✒ త్వరలో 3వేల TGSRTC ఉద్యోగాల భర్తీ: పొన్నం
✒ రేవంత్‌ది రాతి గుండె: హరీశ్ రావు
✒ రాజకీయాలు కాదు.. నటనే నా తొలి ఆప్షన్: ఎన్టీఆర్

తన గెలుపు వెనుక అదానీ గ్రూప్ ఇచ్చిన మద్దతు చాలా ఉందని చెస్ ఛాంపియన్ ప్రజ్ఞానంద తాజాగా ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ‘నేను నిరంతరం సాధన చేయాల్సి ఉంటుంది. అదానీ గ్రూప్ అండగా నిలవడంతో అది సాధ్యమైంది. ఈ ఏడాది మొదట్లో నేను గౌతమ్ అదానీని కలిశాను. భారత్‌కోసం లక్ష్యం చేరాలని ఆయన సూచించారు. ఆయన ఇస్తున్న సపోర్ట్‌కు కృతజ్ఞుడిని’ అని తెలిపారు.

కశ్మీర్‌లో ఎన్నికల ర్యాలీ సమయంలో స్వల్ప అనారోగ్యంపాలైన AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను PM మోదీ ఫోన్‌లో పరామర్శించారు. ఖర్గే పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారని పీఎంఓ వర్గాలు వెల్లడించాయి. కాగా.. మోదీని దించేవరకూ తాను చావనని కశ్మీర్ సభలో ఖర్గే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ‘నాకు 83 ఏళ్లు. కానీ అంత సులువుగా చావను. మీ కోసం ఈ ప్రభుత్వంతో పోరాడతాను’ అంటూ ఖర్గే ఆ ప్రసంగంలో నిప్పులు చెరిగారు.

మారిన ఆహారపు అలవాట్లతో నిద్రలేమి సమస్య పెరుగుతోంది. దీంతో చాలా మంది అనారోగ్యాల పాలవుతున్నారు.
*పడుకునే ముందు కంప్యూటర్, ఫోన్లు ఎక్కువగా వాడొద్దు. దీంతో కళ్లు దెబ్బతినే ప్రమాదమూ ఉంది.
*బ్రీతింగ్ వ్యాయామం చేయాలి. ఉదయం గంటసేపు వర్కౌట్స్ చేయాలి.
*లైటింగ్, సౌండ్ లేకుండా చూసుకోవాలి.
*రాత్రి భోజనంలో ఆకుకూరలు, కివీ పండ్లు, డెయిరీ పదార్థాలు ఉండేలా చూసుకోండి.

TG: మిరపకాయ బజ్జీలు ఉద్దెరకు ఇవ్వలేదని కాగుతున్న నూనెను యజమానిపై పోసిన ఘటన గద్వాల జిల్లా కేటిదొడ్డి మం. గువ్వలదిన్నెలో జరిగింది. నిన్న రాత్రి వినోద్ అనే వ్యక్తి ఓ హోటల్‌కు వెళ్లి బజ్జీలు ఇవ్వాలని, డబ్బులు మళ్లీ ఇస్తానని అడిగాడు. యజమాని బుజ్జన్న గౌడ్ ఇవ్వనని చెప్పడంతో వినోద్ కోపంతో పొయ్యిపై కాగుతున్న నూనెను అతడిపై పోశాడు. పక్కనే ఉన్న మరో వ్యక్తిపై కూడా పడటంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న డయాబెటిస్‌కు ఎట్టకేలకు పరిష్కారం దొరికినట్లు కనిపిస్తోంది. షిన్హువా వార్తాసంస్థ ప్రకారం.. చైనా శాస్త్రవేత్తలు స్టెమ్ సెల్ థెరపీ ద్వారా టైప్-1 డయాబెటిస్‌ను పూర్తిగా తగ్గించారు. టియాంజిన్ ఫస్ట్ సెంట్రల్ హాస్పిటల్, పెకింగ్ వర్సిటీ వైద్యులు ఈ పరిశోధన నిర్వహించారు. 11 ఏళ్లుగా మధుమేహం ఉన్న రోగికి స్టెమ్ సెల్ మార్పిడి చేయగా 75 రోజులకి డయాబెటిస్ పూర్తిగా మాయమైంది.

గత ఏడాది తనను తానే వివాహం(Sologamy) చేసుకుని తుర్కియేలో సంచలనం సృష్టించిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ కుబ్రా ఐకుట్(26) ఆత్మహత్య చేసుకున్నారు. సూసైడ్‌కు కొన్ని గంటల ముందు ఆమె టిక్‌టాక్‌లో చేసిన పోస్టు ప్రస్తుతం వైరలవుతోంది. ‘ప్రతి రోజూ KG చొప్పున బరువు తగ్గిపోతున్నా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. త్వరగా నేను బరువు పెరగాలి’ అని పేర్కొన్నారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆస్ట్రేలియాతో 5 వన్డేల సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ హ్యారీ బ్రూక్ అదరగొట్టారు. వరుసగా 39, 4, 110*, 87, 72(మొత్తం 312) పరుగులు చేశారు. ఈ క్రమంలో ద్వైపాక్షిక సిరీస్‌లో ఆసీస్‌పై అత్యధిక పరుగులు(310) చేసిన కెప్టెన్‌గా కోహ్లీ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టారు. ఆ జట్టుపై ఓ సిరీస్‌లో ధోనీ 285, మోర్గాన్ 278, బాబర్ 276, డివిలియర్స్ 271, ఆండ్రూ స్ట్రాస్ 267 రన్స్ చేశారు.

TG: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు, ఎల్లుండి హైదరాబాద్ నగరంలోని మూసీ పరీవాహక ప్రాంతాల్లో పర్యటించనున్నారు. 72 గంటల తర్వాత జ్వరం తగ్గిందని.. సోమ, మంగళవారాల్లో రాజేంద్రనగర్, అంబర్‌పేట నియోజకవర్గ పరిధిలో పర్యటిస్తానని తెలిపారు. బుల్డోజర్ బెదిరింపులను సాధ్యమైనంత వరకు అరికట్టాలని, దాని కోసం తాము చేయగలిగినంత వరకు చేస్తామని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.