India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

IPL-2025కు సంబంధించి IPL గవర్నింగ్ కౌన్సిల్ ప్లేయర్ రెగ్యులేషన్స్‌ను ప్రకటించింది. ఒక్కో ఫ్రాంఛైజీ ప్రస్తుతం ఉన్న జట్టులో ఆరుగురు ప్లేయర్లను రిటెన్షన్/RTM ఆప్షన్ ద్వారా రిటైన్ చేసుకోవచ్చని తెలిపింది. వీరిలో MAX ఐదుగురు క్యాప్‌డ్ ప్లేయర్లు లేదా MAX ఇద్దరు అన్ క్యాప్‌డ్ ప్లేయర్లు ఉండాలని పేర్కొంది. 2025 వేలానికి ₹120కోట్లను ఆక్షన్ పర్స్‌గా ఖరారు చేసింది. టోటల్ శాలరీ క్యాప్ ₹146కోట్లు అని తెలిపింది.

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి

తేది: సెప్టెంబర్ 29, ఆదివారం
ద్వాదశి: సా.04.47 గంటలకు
మఖ: పూర్తి
వర్జ్యం: సా.04.58- సా.06.44 గంటల వరకు
దుర్ముహూర్తం: సా.4.21 నుంచి సా.5.09 గంటల వరకు
రాహుకాలం: సా.4.30 నుంచి సా.6.30 వరకు

✒ అర్బన్ నక్సల్స్ నియంత్రణలో కాంగ్రెస్: PM
✒ ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ నస్రుల్లా హతం
✒ సీఎం CBNతో లులు ఛైర్మన్ భేటీ.. APలో పెట్టుబడులు
✒ ఎల్లుండి నుంచి ధర్మ పరిరక్షణ కార్యక్రమాలు: జనసేన
✒ లడ్డూ వివాదం.. రాష్ట్రవ్యాప్తంగా YCP పూజలు
✒ మహిళే యజమానిగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు: CM రేవంత్
✒ రేవంత్ మూసీలో పేదల కన్నీళ్లు పారిస్తున్నారు: హరీశ్
✒ హైడ్రా బూచి కాదు.. భరోసా: రంగనాథ్

NASA-SpaceX శనివారం రాత్రి 10.47 గంటలకి కీలక ప్రయోగానికి సిద్ధమయ్యాయి. బోయింగ్ స్టార్‌లైనర్‌లో సమస్య కారణంగా ISSలోనే ఉండిపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను తిరిగి భూమికి తీసుకొచ్చేందుకు క్ర్యూ-9 మిషన్‌ను ప్రయోగించనున్నాయి. అలాగే 5 నెలలపాటు పలు ప్రయోగాల నిమిత్తం ఇద్దరు వ్యోమగాములను ఈ ప్రయోగం ద్వారా ISSకి పంపనున్నారు. ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ నుంచి ప్రయోగం జరుగుతుంది.

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టులో రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు చోటు దొరకలేదు. దీనిపై వారి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. బీసీసీఐ రాజకీయాల వల్ల వీరి కెరీర్ దెబ్బతింటోందని వాపోతున్నారు. సరైన కారణాలు లేకుండా కావాలనే వీరికి జట్టులో చోటు కల్పించట్లేదని ఆరోపిస్తున్నారు. జట్టులోకి రావాలంటే వారు ఇంకేం చేయాలని ప్రశ్నిస్తున్నారు.

ఢిల్లీలోని జామా మసీదును రక్షిత స్మారక చిహ్నంగా ప్రకటించకూడదన్న సంబంధిత ఫైల్‌ను సమర్పించడంలో పురావస్తు శాఖ విఫలమైందని ఢిల్లీ హైకోర్టు మండిపడింది. మసీదును ASI పరిధిలోకి తెస్తే ప్రభుత్వ పర్యవేక్షణ అధికమవుతుంది. దీంతో అలాంటి నిర్ణయం తీసుకోబోమని నాటి ప్రధాని మన్మోహన్ 2004లో షాహీ ఇమామ్‌కు హామీ ఇచ్చారు. దీన్ని ASI కూడా అంగీకరించింది. అయితే, సంబంధిత పత్రాలను సమర్పించకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది.

పాలస్తీనా, లెబనాన్‌కు పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ సంఘీభావం ప్రకటించారు. హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా సహా ఇతర అమరవీరులకు ఆమె సంతాపం తెలిపారు. ఈ నేపథ్యంలో వారికి సంఘీభావంగా తాను జమ్మూకశ్మీర్‌లో ఒకరోజు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండనున్నట్టు ఆమె ప్రకటించారు. ఈ విపత్కర సమయంలో తాము పాలస్తీనా, లెబనాన్‌లకు అండగా ఉంటామని పేర్కొన్నారు.

అథ్లెట్లు పాజిటివ్ మైండ్‌సెట్‌తో ఉండాలని ఒలింపిక్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా చెప్పారు. హరియాణా స్పోర్ట్స్ వర్సిటీ ఈవెంట్‌లో తన సక్సెస్ సీక్రెట్ తెలిపారు. ‘మనం చేయగలమని, ఫీల్డ్‌లో రాణిస్తామని బలంగా నమ్మితే అది జరుగుతుంది. శరీరం సహకరించకపోయినా ట్రైనింగ్ కొనసాగించాలి. బాడీ కంటే మైండ్ శక్తిమంతమైందని నేను భావిస్తా. నా ప్రణాళిక ప్రకారం ఎలాంటి పరిస్థితుల్లోనైనా శిక్షణ పూర్తిచేస్తా’ అని పేర్కొన్నారు.

APలోని మన్యం, అల్లూరి, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో రేపు మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, ఉ.గో, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, YSR, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయంది. TGలోని HYD, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, భద్రాద్రి, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది.
Sorry, no posts matched your criteria.