News September 30, 2024

VIRAL: 1985 నాటి రెస్టారెంట్ బిల్

image

ఫ్యామిలీ అంతా కలిసి రెస్టారెంట్‌ డిన్నర్‌కి వెళ్తే రూ.వేలల్లో ఖర్చవడం పక్కా. కానీ, రూ.26తో ముగ్గురు పుష్టిగా తినొచ్చు. ఏంటీ షాక్ అయ్యారా? 40 ఏళ్ల క్రితం ఇది సాధ్యమే మరి. 1985 నాటి రెస్టారెంట్ బిల్లు ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. షాహీ పనీర్ రూ.8, దాల్ మఖానీ రూ.5కే సర్వ్ చేశారు. పాత రోజులే బెటర్ అని, సరసమైన ధరలకే మంచి ఆహారం లభించేదని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు.

News September 30, 2024

‘ఎమ‌ర్జెన్సీ’ సెన్సార్ క‌ట్‌కు అంగీక‌రించిన కంగ‌న‌

image

నటి, బీజేపీ ఎంపీ కంగ‌నా ర‌నౌత్ న‌టించిన ఎమ‌ర్జెన్సీ చిత్రం విడుద‌ల‌కు అడ్డంకులు తొల‌గ‌నున్నాయి. ఈ చిత్రం విడుద‌ల‌కు సంబంధించి తాము సూచించిన మార్పులు చేయ‌డానికి కంగ‌న అంగీక‌రించిన‌ట్టు బాంబే హైకోర్టుకు సెన్సార్ బోర్డు తెలిపింది. బోర్డు సూచించిన మార్పుల‌ను చిత్రంలో స‌ర్దుబాటు చేసే విష‌య‌మై చిత్రం కో-ప్రొడ్యూస‌ర్ జీ స్టూడియోస్ కొంత స‌మ‌యం కోర‌డంతో కోర్టు గురువారానికి కేసు వాయిదా వేసింది.

News September 30, 2024

సీఎం, TTD ప్రకటనలపై స్పష్టత ఇవ్వాలి: సుప్రీం

image

AP: తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంలో సీఎం చంద్రబాబు, టీటీడీ ప్రకటనలపై స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ‘నెయ్యిలో మీరు చెప్పిన అవశేషాలు ఉన్నాయా? SEP 18 నాటి సీఎం ప్రకటనకు ఆధారం లేదు. ఆ నెయ్యి వాడలేదని TTD చెబుతోంది’ అని సుప్రీం తెలిపింది. అయితే గతంలో ఇదే కాంట్రాక్టర్ 4ట్యాంకర్ల నెయ్యి సరఫరా చేశారని, కల్తీ నెయ్యి వినియోగం జరిగిందని భావిస్తున్నామని GOVT తరఫు న్యాయవాది కోర్టుకి తెలిపారు.

News September 30, 2024

$200 బిలియన్ల క్లబ్‌లో జుకర్‌బర్గ్

image

Meta CEO మార్క్ జుకర్‌బర్గ్ అధికారికంగా $200 బిలియన్ల నిక‌ర సంప‌ద క‌లిగిన వారి క్లబ్‌లో చేరారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం మార్క్ జుకర్‌బర్గ్ నికర సంప‌ద‌ విలువ $201 బిలియన్లకు చేరుకుంది. టెస్లా CEO ఎలోన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, LVMH ఛైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ తర్వాత జుక‌ర్‌బ‌ర్గ్ ప్ర‌పంచంలోనే అత్య‌ధిక సంప‌ద క‌లిగిన నాలుగ‌వ వ్య‌క్తిగా నిలిచారు.

News September 30, 2024

దేవుడినైనా రాజకీయాలకు దూరంగా పెట్టండి: సుప్రీం

image

AP: తిరుమల లడ్డూ కల్తీ జరిగిందన్న రిపోర్టుపై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా? అని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ‘మైసూర్/ ఘజియాబాద్ ల్యాబ్‌ల నుంచి ఎందుకు ఒపీనియన్ తీసుకోలేదు? ఇతర సప్లయర్ల నుంచి శాంపిల్స్ ఎందుకు సేకరించలేదు? ముందుగానే పరీక్షలకు ఎందుకు పంపలేదు? కల్తీ జరిగినట్లు సాక్ష్యాలు చూపండి. దేవుడినైనా రాజకీయాలకు దూరంగా పెట్టండి’ అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.

News September 30, 2024

భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్న Stock Market

image

దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాల్లో నడుస్తున్నాయి. ఇటీవల సెన్సెక్స్, నిఫ్టీ జీవిత కాల గరిష్ఠాలకు చేరుకోవడంతో ఇన్వెస్టర్లు జాగ్రత్తపడుతున్నారు. దీంతో అధిక వెయిటేజీ స్టాక్‌లతోపాటు అన్ని కీలక రంగాల్లో అమ్మకాలు జోరందుకున్నాయి. ఓవర్ వాల్యూయేషన్ భయాలతో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం, FIIల మనీ ఫ్లో తగ్గడంతో Mon మిడ్ సెషన్ వరకే సెన్సెక్స్ 1,200 పాయింట్లు, నిఫ్టీ 350 పాయింట్లు నష్టపోయాయి.

News September 30, 2024

తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

image

AP: తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ‘లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా? లడ్డూలను టెస్టింగ్‌కు పంపారా? కల్తీ జరిగిందని గుర్తించిన తర్వాత ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వినియోగించారా? అలా వినియోగించినట్లు ఆధారాలు లేవు. విచారణ జరగకుండానే లడ్డూ కల్తీ జరిగిందని ప్రకటన చేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

News September 30, 2024

BREAKING: చరిత్ర సృష్టించిన భారత్

image

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ చరిత్ర సృష్టించింది. టెస్టు క్రికెట్‌లో అతి తక్కువ బంతుల్లో(18) 50 పరుగులు చేసిన జట్టుగా నిలిచింది. ఇంగ్లండ్ గతంలో 26 బంతుల్లో 50 రన్స్ పూర్తిచేసింది. రోహిత్ 11 బాల్స్‌లో 23 రన్స్ చేసి ఔటవగా, జైస్వాల్ 30(13 బంతుల్లో), గిల్(1) క్రీజులో ఉన్నారు.

News September 30, 2024

జేసీ ప్రభాకర్ పర్మిషన్ కావాలంటే అడుగుతా: కేతిరెడ్డి

image

AP: దసరా తర్వాత తాడిపత్రిలో అడుగుపెడతానని YCP మాజీ MLA కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. ‘నా ఇంటికి నేను వెళ్లేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి పర్మిషన్ అవసరమని ఎస్పీ చెబితే అలాగే చేస్తా. ఓ మాజీ MLAని నియోజకవర్గంలో రానివ్వకపోవడం దుర్మార్గం’ అని ఫైర్ అయ్యారు. కాగా ఎన్నికల సందర్భంగా చెలరేగిన అల్లర్ల తర్వాత కేతిరెడ్డి తాడిపత్రి విడిచి వెళ్లారు. ఇటీవల మళ్లీ తిరిగి రాగా TDP, YCP వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి.

News September 30, 2024

233 పరుగులకు బంగ్లాదేశ్ ఆలౌట్

image

కాన్పూర్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్సులో బంగ్లాదేశ్ 233 పరుగులకు ఆలౌటైంది. మోమినల్ హక్(107*) మినహా అందరు బ్యాటర్లు విఫలమయ్యారు. బుమ్రా 3 వికెట్లు, సిరాజ్, అశ్విన్, ఆకాశ్ దీప్ తలో రెండు వికెట్లు, జడేజా ఒక వికెట్ పడగొట్టారు. తొలి రోజు కొద్ది సేపు మ్యాచ్ జరగగా, రెండున్నర రోజులు వర్షార్పణమైన విషయం తెలిసిందే. మరో ఒకటిన్నర రోజు మాత్రమే ఆట మిగిలి ఉంది.