News September 30, 2024

లైంగిక వేధింపుల కేసులో నటుడికి ముందస్తు బెయిల్

image

లైంగిక వేధింపుల కేసులో మాలీవుడ్ న‌టుడు సిద్ధిక్‌కి సుప్రీంకోర్టు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే పోలీసుల‌ విచార‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ని ఆదేశించింది. ఆయ‌న‌పై వేధింపుల ఆరోప‌ణ‌లు రావ‌డంతో కేరళ పోలీసులు విచార‌ణ చేపట్టారు. ఈ నేపథ్యంలో సిద్ధిక్ దాఖ‌లు చేసిన‌ ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్‌ను కేర‌ళ హైకోర్టు కొట్టేసింది. దీంతో సుప్రీంను ఆశ్రయించగా తాజాగా ఆయ‌న‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగింది.

News September 30, 2024

తిరుమల లడ్డూ వ్యవహారంపై విచారణ వాయిదా

image

AP: తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ వచ్చే గురువారానికి వాయిదా పడింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌తో దర్యాప్తు కొనసాగించాలా? లేదా? అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణపై అభిప్రాయం చెప్పాలని కేంద్రాన్ని అడిగింది.

News September 30, 2024

సత్యమేవ జయతే: YCP

image

AP: తిరుమలలో నెయ్యి కల్తీ వ్యవహారంలో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ స్పందించింది. నెయ్యి కల్తీ జరిగినట్లు ఆధారాలు లేవని, సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదంటూ ధర్మాసనం చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించింది. ‘సత్యమేవ జయతే’ అని ట్వీట్ చేసింది.

News September 30, 2024

లడ్డూ వివాదం.. సీఎం చంద్రబాబుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

image

తిరుమల లడ్డూలలో జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యి వాడారంటూ వ్యాఖ్యానించిన CM చంద్రబాబుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారంలో ఆధారాలు లేకుండా, రెండో అభిప్రాయం తీసుకోకుండా పబ్లిక్ మీటింగ్‌లో ఎలా మాట్లాడారు? లడ్డూలను టెస్టులకు పంపారా? ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించినప్పుడు బహిరంగ ప్రకటన చేయాల్సిన అవసరం ఏముంది?’ అని ప్రభుత్వ లాయర్‌ను ప్రశ్నించింది.

News September 30, 2024

చాలా ప్రాంతాల్లో ‘దేవర’ బ్రేక్ ఈవెన్ పూర్తి!

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. చాలా చోట్ల థియేటర్లు హౌస్‌ఫుల్‌తో నడుస్తున్నాయి. దీంతో బ్రేక్ ఈవెన్ మార్కును దాటేసినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఈ మార్క్‌ను చేరుకున్నట్లు తెలిపాయి. మాస్ ఏరియాల్లో ముఖ్యంగా సి సెంటర్లలో దేవర రికార్డు స్థాయిలో కలెక్షన్లు నమోదు చేస్తోందని వెల్లడించాయి.

News September 30, 2024

ఆవును ‘రాజ్య మాత’గా ప్రకటించిన మహారాష్ట్ర

image

ఆవును ‘రాజ్య మాత’గా ప్ర‌క‌టిస్తూ మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్తర్వులిచ్చింది. భార‌తీయ సంప్ర‌దాయంలో ఆవుకు ఉన్న సాంస్కృతిక ప్రాధాన్య‌త‌ను గుర్తించి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిపింది. వ్యవసాయంలో ఆవు పేడ వాడకం వల్ల ఆహారంలో పోషకాలు అందుతాయంది. ఆవులకు ప్రాచీన కాలం నుంచి ఆధ్యాత్మిక, శాస్త్రీయ, సామాజిక‌-ఆర్థిక అంశాల్లో ప్రాముఖ్యత ఉందని పేర్కొంది. దేశీ అవులు తగ్గిపోతుండడంపై ఆందోళన వ్యక్తం చేసింది.

News September 30, 2024

BREAKING: హర్షసాయికి మరో షాక్

image

TG: యూట్యూబర్ హర్షసాయికి మరో షాక్ తగిలింది. అతడి ఫౌండేషన్‌పై రాచకొండ సైబర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సహాయం పేరుతో రూ.5.4 లక్షలు వసూలు చేసి మోసం చేశారని బాధితుడు ఫిర్యాదు చేశాడు. దీంతో 406, 419, 420 IPC,66-C,66-D సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ యువతి ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు ఇప్పటికే అతడిపై అత్యాచారం కేసు నమోదు చేశారు. వారం రోజులుగా అతడి కోసం గాలిస్తున్నారు.

News September 30, 2024

తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

image

TG: బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైడ్రాపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందంటూ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్‌ వద్దకు చేరుకున్నాయి. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి పరస్పరం దాడి చేసుకున్నాయి. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెస్తున్నారు.

News September 30, 2024

VIRAL: 1985 నాటి రెస్టారెంట్ బిల్

image

ఫ్యామిలీ అంతా కలిసి రెస్టారెంట్‌ డిన్నర్‌కి వెళ్తే రూ.వేలల్లో ఖర్చవడం పక్కా. కానీ, రూ.26తో ముగ్గురు పుష్టిగా తినొచ్చు. ఏంటీ షాక్ అయ్యారా? 40 ఏళ్ల క్రితం ఇది సాధ్యమే మరి. 1985 నాటి రెస్టారెంట్ బిల్లు ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. షాహీ పనీర్ రూ.8, దాల్ మఖానీ రూ.5కే సర్వ్ చేశారు. పాత రోజులే బెటర్ అని, సరసమైన ధరలకే మంచి ఆహారం లభించేదని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు.

News September 30, 2024

‘ఎమ‌ర్జెన్సీ’ సెన్సార్ క‌ట్‌కు అంగీక‌రించిన కంగ‌న‌

image

నటి, బీజేపీ ఎంపీ కంగ‌నా ర‌నౌత్ న‌టించిన ఎమ‌ర్జెన్సీ చిత్రం విడుద‌ల‌కు అడ్డంకులు తొల‌గ‌నున్నాయి. ఈ చిత్రం విడుద‌ల‌కు సంబంధించి తాము సూచించిన మార్పులు చేయ‌డానికి కంగ‌న అంగీక‌రించిన‌ట్టు బాంబే హైకోర్టుకు సెన్సార్ బోర్డు తెలిపింది. బోర్డు సూచించిన మార్పుల‌ను చిత్రంలో స‌ర్దుబాటు చేసే విష‌య‌మై చిత్రం కో-ప్రొడ్యూస‌ర్ జీ స్టూడియోస్ కొంత స‌మ‌యం కోర‌డంతో కోర్టు గురువారానికి కేసు వాయిదా వేసింది.