India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాజమౌళితో సినిమా తీసిన తర్వాత హీరోల నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్‌ను ఎన్టీఆర్ బ్రేక్ చేశారని జక్కన్న కుమారుడు SS కార్తికేయ పేర్కొన్నారు. ‘23 ఏళ్ల క్రితం ఎవరితో అయితే మొదలైందో ఆయనతోనే ఆ సెంటిమెంట్ బ్రేక్ అయింది. NTRను దగ్గరి నుంచి చూస్తూ పెరగడం, ఇప్పుడు ఆయన అద్భుతాలకు సాక్షులు కావడం ఎంతో ప్రత్యేకం. దేవర మాస్ అదిరిపోయింది. అభిమానులకు ఎన్టీఆర్ ఇచ్చిన బహుమతి ఇది’ అని తెలిపారు.

తనకు చాలాసార్లు పీఎం ఆఫర్లు వచ్చాయని BJP అగ్రనేత నితిన్ గడ్కరీ అన్నారు. ఆ పోస్టు తీసుకుంటానంటే ఓ అపోజిషన్ పార్టీ లీడర్ సపోర్టు చేస్తానన్న వార్తలపై ఇండియా టుడే కాంక్లేవ్‌లో అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ‘LS ఎలక్షన్లకు ముందు, తర్వాత చాలా ఆఫర్లు వచ్చాయి. నా ఐడియాలజీని వదిలేయలేను. అందుకే వాటిని అంగీకరించే ప్రశ్నే రాలేదు. పీఎం అవ్వడం నా లక్ష్యం కాదు. నా ఐడియాలజీపై నమ్మకంతో బతుకుతున్నా’ అని అన్నారు.

భయమెరుగని వారికి ‘దేవర’ భయాన్ని ఎలా పరిచయం చేశాడనేదే సినిమా. డబుల్ రోల్‌లో Jr.NTR ఇరగదీశారు. ఫైట్లు, ఆయుధపూజ సీన్స్, అనిరుధ్ BGM మూవీకే హైలైట్. విలన్‌గా సైఫ్ అద్భుతంగా నటించారు. క్లైమాక్స్ ట్విస్ట్ సెకండ్ పార్ట్‌పై అంచనాలు పెంచింది. అయితే ఫస్టాఫ్‌లోని హైప్‌ను సెకండాఫ్‌లో కొరటాల కొనసాగించలేకపోయారు. VFX, స్క్రీన్‌ప్లేపైనా మరింత దృష్టి పెట్టాల్సింది. జాన్వీకి పెద్దగా స్కోప్ లేదు.
రేటింగ్: 3/5

భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు జరగాల్సిన కాన్పూర్‌లో రాత్రి వర్షం కురిసింది. దీంతో మ్యాచ్ జరిగే గ్రీన్‌పార్క్ స్టేడియం పిచ్‌పై కవర్స్ కప్పారు. అయితే ప్రస్తుతం వర్షం లేకపోవడంతో వాటిని తొలగిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం 9.30గంటలకు మ్యాచ్ ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. తొలి టెస్టులో గెలిచిన భారత్ ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది.

AP: నూతన మద్యం విధానానికి సంబంధించి ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. మొత్తం 3,736 వైన్ షాపులు ఏర్పాటు చేస్తారు. వీటిలో 340 దుకాణాలను గీత కార్మికులకు కేటాయిస్తారు. ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. 10 వేలలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.50 లక్షలు, 50 వేలలోపు ఉంటే రూ.55 లక్షలు, 5 లక్షలలోపు ఉంటే రూ.65 లక్షలు, 5 లక్షల పైన ఉంటే రూ.85 లక్షల లైసెన్స్ ఫీజు చెల్లించాలి.

TG: రాష్ట్రంలో తొలి దశలో భాగంగా 10 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేస్తుందని సమాచారం. పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ టీచర్, ఆశా కార్యకర్త, రెవెన్యూ సిబ్బందితో కలిపి గ్రామ కమిటీ వేయనుంది. మొదటి దశలో సొంత స్థలం ఉన్నవారికి, రెండో దశలో స్థలం లేనివారికి ఇవ్వనుంది.

TG: రాష్ట్రంలో MBBS ప్రవేశాల కోసం వెబ్‌ఆప్షన్ ప్రక్రియ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది. ఈ రోజు ఉ.6గంటల నుంచి ఈ నెల 29వ తేదీ సా.6గంటలకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుంది. కన్వీనర్ కోటా కింద దివ్యాంగులు, EWS, PMC, సైనిక ఉద్యోగుల పిల్లలు దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్ల కోసం tspvtmedadm.tsche.inను సందర్శించాలి.

ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ గురువారం సెబీ వద్ద IPO పేపర్లను సబ్మిట్ చేసింది. ₹10వేల కోట్ల విలువతో వస్తోంది. పేటీఎం (₹18,300 కోట్లు) తర్వాత భారత్‌లో అత్యంత విలువైన స్టార్టప్ IPO ఇదే. వచ్చే వారం షేర్‌హోల్డర్ల మీటింగ్ తర్వాత ఈ విలువను ₹11,700 కోట్లకు పెంచుతారని అంచనా. ఫ్రెష్ ఇష్యూ ద్వారా ₹3750 కోట్లు, OFS ద్వారా మిగిలిన డబ్బును సమీకరిస్తారు. స్విగ్గీ రైవల్ జొమాటో ₹9,375 కోట్లతో IPOకు వచ్చింది.

TG: విదేశాల్లో పనిచేసే కార్మికుల సమస్యలను వారి కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకునేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా HYDలోని ప్రజాభవన్‌లో ‘ప్రవాసీ ప్రజావాణి’ కోసం ప్రత్యేక కౌంటర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు ప్రారంభించనున్నారు. ఇది ప్రవాసీ కార్మికులకు, కేంద్ర ప్రభుత్వానికి, భారత రాయబార కార్యాలయాలకు మధ్య ఒక వారధిలా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా థియేటర్లలో రిలీజైంది. అభిమానులు ప్రీమియర్ షోల్లో సందడి చేస్తున్నారు. హిందీలో కూడా ఇంతే క్రేజ్‌తో భారీ ఎత్తున రిలీజవుతోంది. అయితే 2.50 గంటల రన్‌టైమ్ ఉన్న ఈ మూవీని హిందీ ప్రేక్షకుల కోసం 7 నిమిషాలు ట్రిమ్ చేసినట్లు తెలుస్తోంది. తెలుగు నటీనటులకు సంబంధించిన కొన్ని సోలో సన్నివేశాలను కత్తిరించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
Sorry, no posts matched your criteria.