News September 21, 2024

జగన్‌కు శ్రీవారి పాపం తగులుతుంది: మంత్రి సవిత

image

AP: తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన మాజీ సీఎం జగన్‌కు వేంకటేశ్వరస్వామి పాపం తగులుతుందని మంత్రి సవిత అన్నారు. తిరుమల లడ్డూ వివాదంపై ఆమె స్పందించారు. ‘లడ్డూ వ్యవహారంపై చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇందుకు బాధ్యులైన వారికి తప్పకుండా శిక్ష పడుతుంది. కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కొవ్వు పట్టిన వ్యక్తులే లడ్డూలో జంతువుల కొవ్వు కలిపి తయారు చేయించారు’ అని ఆమె మండిపడ్డారు.

News September 21, 2024

పవన్‌ను కలిసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కిలారి

image

AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిశారు. రేపు జనసేనలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. రోశయ్యతోపాటు ఆయన వియ్యంకుడు రవిశంకర్ కూడా ఆ పార్టీలో చేరుతున్నారు. కాగా రోశయ్య ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. 2019లో పొన్నూరు నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2024 ఎన్నికల్లో గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేతిలో ఓటమిపాలయ్యారు.

News September 21, 2024

జానీ మాస్టర్ భార్య అరెస్ట్‌కు రంగం సిద్ధం?

image

TG: అత్యాచార ఆరోపణలతో అరెస్టై చంచల్‌గూడ జైల్లో ఉన్న జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదే కేసులో ఆయన భార్య ఆయేషాను పోలీసులు అరెస్ట్ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెపై దాడి చేసేందుకు యత్నించారన్న ఆరోపణలతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ యువతిని ఆయేషా బెదిరించినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.

News September 21, 2024

దేశాన్ని విడ‌దీయ‌డానికి రాహుల్ వెనుకాడ‌రు: క‌ంగ‌న‌

image

రాహుల్ గాంధీ అధికారం కోసం దేశాన్ని విడ‌దీయ‌డానికి వెనుకాడ‌బోర‌ని BJP MP కంగ‌నా ర‌నౌత్ విమ‌ర్శించారు. రాహుల్ విదేశాల్లో భార‌త్ గురించి ఎలాంటి విష‌యాలు మాట్లాడుతార‌న్న‌ది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే అన్నారు. ‘కొంత మంది ప్రజల్ని వాడుకుంటున్నారు. కొన్ని వ‌ర్గాల్ని రెచ్చ‌గొడుతున్నారు. దేశంపై రాహుల్‌కు ఉన్న భావ‌న‌లు తెలిసిందే. అధికారం కోసం ఆయ‌న దేశాన్ని విడ‌దీయ‌డానికి వెనుకాడ‌రు’ అని కంగన విమ‌ర్శించారు.

News September 21, 2024

దేవుడికీ కల్తీ బాధ తప్పలేదు!

image

కల్తీ.. కల్తీ.. కల్తీ.. ఎక్కడ చూసినా, ఏది తిన్నా కల్తీనే. ముఖ్యంగా వంటనూనెల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. జంతువుల ఎముకలను బాగా వేడి చేసి అందులో నుంచి నూనె తీసి అమ్ముతున్నారు. రేటు తక్కువ అని కొంటే ఆస్పత్రి పాలవ్వడం ఖాయం. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి కూడా ఈ కల్తీ బాధ తప్పలేదు. డబ్బు ఆశ, పెరుగుతున్న జనాభాకు సరిపడా వనరులు లేకపోవడమూ కల్తీకి ఓ కారణమని నిపుణుల అభిప్రాయం. దీనిపై మీ కామెంట్.

News September 21, 2024

నెయ్యి కల్తీ అయిందా? ఇంట్లోనే ఇలా తెలుసుకోండి..

image

☛ స్వచ్ఛమైన నెయ్యి గోల్డ్ కలర్‌లో, మృదువుగా, సువాసనతో, రుచికరంగా ఉంటుంది.
☛ గ్లాస్ వేడి నీటిలో కొద్దిగా నెయ్యి వేయండి. పూర్తిగా కరిగిపోతే అది ప్యూర్ అని, వాటర్‌లో ఏమైనా అవశేషాలు కనిపిస్తే అది కల్తీ అని అర్థం.
☛ ప్యూర్ నెయ్యి వేడి చేస్తే వెంటనే కరిగిపోతుంది. పొగ, కాలిన వాసన ఎక్కువగా రాదు.
☛ ఫ్రిడ్జ్‌లో కొన్ని గంటలపాటు ఉంచితే నెయ్యంతా ఒక్కటిగా గడ్డకడుతుంది. అలా జరగలేదంటే అది ప్యూర్ కాదు.

News September 21, 2024

విష్ణు ట్వీట్‌కు స్పందించిన ప్రకాశ్ రాజ్

image

మంచు విష్ణు తనకిచ్చిన కౌంటర్‌పై ప్రకాశ్ రాజ్ స్పందించారు. విష్ణు కన్నప్ప సినిమా టీజర్‌లోని ఆఖరి డైలాగ్‌ను హేళన చేస్తూ ట్వీట్ చేశారు. ‘ఓకే శివయ్యా.. నాకు నా దృక్కోణం ఉంటే మీకు మీ ఆలోచన ఉంటుంది. నోటెడ్’ అని ట్వీట్ చేశారు. దానికి జస్ట్ ఆస్కింగ్ అని హాష్ ట్యాగ్ ఇచ్చారు. విష్ణు, ప్రకాశ్ ఇద్దరూ మా అధ్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడిన సంగతి తెలిసిందే.

News September 21, 2024

ఇంటెల్ కంపెనీని కొంటున్న క్వాల్‌కామ్!

image

ఇంటెల్‌ను టేకోవర్ చేయాలని క్వాల్‌కామ్ భావిస్తోందని తెలిసింది. ఇప్పటికే దాన్ని సంప్రదించినట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. నియంత్రణ సంస్థల ఆమోదం లభించి ఈ డీల్ పూర్తవ్వడానికి చాలా కాలమే పట్టొచ్చని అంచనా. ఆండ్రాయిడ్ ఫోన్లలో వాడే స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్లను ఉత్పత్తి చేసే క్వాల్‌కామ్ ఈ మధ్యే పీసీ ప్రాసెసర్ల రంగంలోకి ఎంటరైంది. ఇక $1.6 బిలియన్ల లాస్‌లో ఉన్న ఇంటెల్ షేర్లు 2024లో 60% క్రాష్ అయ్యాయి.

News September 21, 2024

ఈ 7 అలవాట్లతో పిల్లల ఆరోగ్యానికి ముప్పు

image

కొన్ని అలవాట్లు పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అవి 1.గోర్లు కొరకడం. దీని వల్ల బ్యాక్టీరియా కడుపులోకి వెళుతుంది. 2.తినేటప్పుడు TV/ఫోన్ చూడటం. 3.ఎక్కువగా హెడ్‌ఫోన్స్ వాడటం. 4.నిద్రపోయే ముందు ఫోన్ చూడటం. 5.బెడ్‌పై పడుకొని తినడం. ఇలా తింటే జీర్ణక్రియ సరిగా జరగదు. 6.పళ్లు కొరకడం. దీని వల్ల సెన్సిటివిటీ, దవడ నొప్పి వస్తుంది. 7.పికీ ఈటింగ్‌. దీని వల్ల పోషకాలున్న ఆహారాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.

News September 21, 2024

ప్రకాశ్ రాజ్‌కు మంచు విష్ణు కౌంటర్!

image

లడ్డూ విషయంలో ఏపీ డిప్యూటీ <<14151603>>సీఎం పవన్ కళ్యాణ్‌‌పై ప్రకాశ్ రాజ్ విమర్శలు <<>>చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కౌంటర్ ఇచ్చారు. ‘ప్రకాశ్ రాజ్ గారూ. తిరుమల లడ్డూ అంటే కేవలం ప్రసాదం కాదు. నాలాంటి కోట్లాదిమంది హిందువులకు ఓ నమ్మకం. దర్యాప్తు జరగాలంటూ పవన్ కళ్యాణ్‌ కరెక్ట్‌గా మాట్లాడారు. మతకల్లోలాల రంగు ఎవరు ఎక్కడ పులుముతున్నారో మీరు ఒకసారి ఆలోచించుకుంటే మంచిదేమో’ అని సూచించారు.