News September 24, 2024

దేవర: టికెట్లు బుక్ అవట్లే…!

image

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘దేవర’. ఈ నెల 27న థియేటర్లలో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆన్‌లైన్‌లో బుకింగ్ అందుబాటులోకి తీసుకొచ్చారు. నిమిషాల వ్యవధిలోనే కొన్ని థియేటర్లలో టికెట్లు అయిపోగా పలు చోట్ల టికెట్లు ఉన్నా బుక్ అవట్లేదని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో సినిమాను మొదటి రోజే చూడాలని వెయిట్ చేస్తున్నామని అంటున్నారు.

News September 24, 2024

వరి ధాన్యం కనీస మద్దతు ధర రూ.2,300

image

AP: ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. కామన్ వెరైటీ ధాన్యానికి రూ.2,300, గ్రేడ్ ఏ రకానికి రూ.2,320 కనీస మద్దతు ధర చెల్లించాలని పేర్కొంది. రైతు సేవా, ధాన్యం సేకరణ కేంద్రాలు, ఈకేవైసీ వంటి వాటి ద్వారా కొనుగోళ్లు చేయాలని ఆదేశించింది. ఈ సీజన్‌లో 37 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది.

News September 24, 2024

‘పళని’ ప్రసాదంపై ఆరోపణలు.. తమిళ డైరెక్టర్ అరెస్ట్!

image

‘పళని’ క్షేత్రంలో ఇచ్చే పంచామృతం ప్రసాదంపై ఆరోపణలు చేసిన తమిళ డైరెక్టర్ మోహన్‌ను తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. పురుషుల్లో వంధ్యత్వాన్ని పెంచే ఔషధాల్ని ప్రసాదంలో కలుపుతున్నారని ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆరోపించారు. హిందువులపై దాడి జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయన్ను ఈరోజు అరెస్ట్ చేశారు. ద్రౌపది, రుద్రతాండవం, బగాసురన్ వంటి సినిమాల్ని మోహన్ తీశారు. ఆయన అరెస్టును BJP ఖండించింది.

News September 24, 2024

‘NBK 109’ రిలీజ్ డేట్ ఫిక్స్?

image

నందమూరి బాలకృష్ణ హీరోగా ‘NBK 109’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా రానున్నట్లు సమాచారం. కొల్లి బాబీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్, ఊర్వశీ రౌతేలా, చాందినీ చౌదరి కీలక పాత్ర పోషిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

News September 24, 2024

ఆరోపణలు ఎదుర్కోవాల్సింది చంద్రబాబే: వైసీపీ

image

AP: లడ్డూ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కోవాల్సింది చంద్రబాబేనని YCP ట్వీట్ చేసింది. ‘TTDలో 6 నెలలకోసారి నెయ్యి సరఫరా కోసం టెండర్లు పిలుస్తారు. మార్చి 12, 2024న టెండర్లు పిలిచారు. మే 8న ఫైనలయ్యాయి. అప్పుడు ఎన్నికల కోడ్‌ నడుస్తోంది. టెండర్‌ దక్కించుకున్న AR డెయిరీ జూన్‌ 12 నుంచి సప్లై చేస్తోంది. జులై 6, 7 తేదీల్లో ట్యాంకర్లను అనలైజ్‌ చేసి ల్యాబ్‌కు పంపారు. ఇదంతా CBN హయాంలోనే జరిగింది’ అని పేర్కొంది.

News September 24, 2024

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు కొత్తేమీ కాదు: స్పీకర్

image

TG: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందించారు. ‘పార్టీ ఫిరాయింపులు 15 ఏళ్లుగా జరుగుతున్నవే. ఇందులో కొత్త విషయమేమీ లేదు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. ప్రస్తుతానికి దీనిపై ఇంతకు మించి ఇంకేం మాట్లాడలేను’ అని మీడియాతో వ్యాఖ్యానించారు.

News September 24, 2024

‘దేవర’ తొలి రోజే రూ.100 కోట్లు!

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే హౌస్ ఫుల్ అవుతున్నాయి. రోజుకు 6 షోలు ఉండటంతో భారీగా కలెక్షన్స్ వస్తాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. రిలీజైన తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.100+ కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నాయి. ఇక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ‘దేవర’ను ఎవరూ ఆపలేరంటున్నాయి. రేపు ‘ఆయుధ పూజ’ సాంగ్ రిలీజయ్యే అవకాశం ఉంది.

News September 24, 2024

నాకు యూట్యూబ్ ఛానల్ లేదు: రోజా

image

AP: తాను సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉండటానికి ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్, థ్రెడ్స్ మాత్రమే వాడుతున్నానని మాజీ మంత్రి రోజా చెప్పారు. తనకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదని స్పష్టం చేశారు. తన పేరుతో ఉన్న ఫేక్ ఛానళ్లను డిలీట్ చేయాలని హెచ్చరించారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. తన పేరుతో బ్లూటిక్ ఉన్న అకౌంట్లను మాత్రమే ఫాలో కావాలని సూచించారు.

News September 24, 2024

ఆహార కల్తీ కట్టడికి యూపీ సీఎం అదేశాలు

image

UPలోని అన్ని భోజ‌న త‌యారీ హోట‌ళ్లు, రెస్టారెంట్ల‌లో చెఫ్‌లు, వెయిట‌ర్లు త‌ప్ప‌క మాస్కులు, గ్లౌజులు ధ‌రించాల‌ని CM యోగి ఆదేశించారు. అలాగే CCTV కెమెరాలు ఏర్పాటు చేయాల‌ని, నిర్వాహ‌కులు-య‌జ‌మానుల పేర్లు ప్ర‌ద‌ర్శించాల‌ని అదేశించారు. ఆహార కల్తీ ఘటనల నేప‌థ్యంలో నిర్వాహ‌కుల్లో జ‌వాబుదారీత‌నం పెంపున‌కు తాజా ఆదేశాలు ఇచ్చారు. ఆహార కల్తీని అడ్డుకోవడమే ఈ నిబంధనల లక్ష్యమని యోగి పేర్కొన్నారు.

News September 24, 2024

అమృత్ టెండర్లతో రేవంత్‌కు సంబంధం లేదు: BRS మాజీ ఎమ్మెల్యే

image

TG: అమృత్ టెండర్లపై అనవసరంగా వివాదం చేస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు. ‘సీఎం రేవంత్ రెడ్డికి టెండర్లకు ఎలాంటి లింక్ లేదు. నా అల్లుడు సృజన్ రెడ్డి రేవంత్‌కు సొంత బావమరిది కాదు. సృజన్‌కు రాజకీయాలతో సంబంధం లేదు. కేటీఆర్‌కు ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. త్వరలో ఆయన్ను కలిసి దీనిపై మాట్లాడతా. నేను బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతా’ అని తెలిపారు.