India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: YCP మాజీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరినా చర్యలు తప్పవని TDP MLA దామచర్ల జనార్ధన్ హెచ్చరించారు. ఆయనతోపాటు కొడుకు ప్రణీత్‌పై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘ఎన్నికల ముందు నాపైన, TDP శ్రేణులపైనా బాలినేని అక్రమ కేసులు పెట్టించారు. బాలినేనిని.. పవన్ కళ్యాణ్ ఎందుకు పార్టీలో చేర్చుకుంటున్నారు? పవన్ కూడా బాలినేనిని కాపాడలేరు. ఈ విషయంలో ఎంతదూరమైనా వెళ్తాను’ అని మండిపడ్డారు.

తన లక్ష్య సాధనలో ఎన్ని సమస్యలు వచ్చినా పోరాడిన తీరును ఒలింపిక్ మెడలిస్ట్ మనూ భాకర్ గుర్తుచేసుకున్నారు. ‘నాకు 14 ఏళ్లు ఉన్నపుడు షూటింగ్ ప్రయాణం ప్రారంభించా. మీరు ఏదైనా ప్రారంభించిన తర్వాత మీ కలలు ఎంత పెద్దవైనా వాటిని పూర్తిచేసేందుకు సాధ్యమైనవన్నీ చేయండి. లక్ష్య సాధనకు కట్టుబడి, ఏకాగ్రతతో మీ ప్రయాణం కొనసాగించండి. ఒలింపిక్‌లో స్వర్ణం సాధించే నా కల కోసం కష్టపడుతూనే ఉంటా’ అని ట్వీట్ చేశారు.

ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ వరుస ట్వీట్లతో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఆయన చేసిన మరో ట్వీట్ వైరలవుతోంది. ‘గెలిచేముందు ఒక అవతారం. గెలిచిన తర్వాత ఇంకో అవతారం. ఏంటీ అవాంతరం. ఎందుకు మనకీ అయోమయం. ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్?’ అని ప్రశ్నించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ను ఉద్దేశించి ఆయన ఈ ట్వీట్ చేశారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

టీమ్ ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో (6, 17 రన్స్) విఫలమయ్యారు. కాగా రెండో టెస్టులో ఫామ్ అందుకుంటారని అంతా భావిస్తున్న నేపథ్యంలో మళ్లీ ఆందోళన మొదలైంది. నెట్ ప్రాక్టీస్‌లో కోహ్లీని 15బంతుల్లో 4సార్లు బుమ్రా ఔట్ చేశారు. దీంతో కోహ్లీ పక్కనే నెట్స్‌లోకి వెళ్లి అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ప్రాక్టీస్ చేశారు. అయితే అక్కడా కోహ్లీ కాస్త తడబడ్డట్లు తెలుస్తోంది.

AP: తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో మాజీ సీఎం జగన్ రేపు తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. ఎల్లుండి శ్రీవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. కాగా జగన్ పర్యటన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలిపిరిలోనే జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే కొండ కిందనే ఆయనను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

శివసేన నేత సంజయ్ రౌత్‌కు ముంబై మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ 25వ కోర్టు 15 రోజుల జైలు శిక్ష విధించింది. BJP నేత కిరీట్ సోమయ్య సతీమణి మేధా వేసిన పరువు నష్టం దావా విచారణ అనంతరం కోర్టు ఈ తీర్పిచ్చింది. జైలుతో పాటు రూ.25వేల జరిమానా కూడా విధించింది. పబ్లిక్ టాయిలెట్స్‌కు సంబంధించిన రూ.100కోట్ల ప్రాజెక్టులో తాను, తన భర్త అవినీతికి పాల్పడ్డట్లు సంజయ్ నిరాధార ఆరోపణలు చేశారంటూ మేధా కోర్టును ఆశ్రయించారు.

ప్రస్తుతం కొందరు ఏ చిన్న నొప్పి కలిగినా వెంటనే పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారు. కానీ వీటిని వేసుకోవడం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. పెయిన్ కిల్లర్స్ అతిగా తీసుకుంటే తల నొప్పి, కడుపులో మంట, అల్సర్లు, రక్త ప్రసరణ సమస్యలు, కిడ్నీలు దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతాయి. శరీరంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. సహజ మార్గాల్లోనే నొప్పి తగ్గించుకుంటే మంచిది. తొందరపడి వీటిని వాడవద్దు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ‘దేవర’ సినిమా రిలీజ్‌కు ముందే కలెక్షన్లలో సంచలనం సృష్టిస్తోంది. రేపు మూవీ రిలీజ్ కానుండగా నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ $2.5 మిలియన్ల మార్క్‌ను దాటేశాయి. ఓవర్సీస్‌లో తారక్ సునామీ సృష్టిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. వరల్డ్ వైడ్‌గా ప్రీసేల్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.75+ కోట్ల కలెక్షన్స్ దాటేసినట్లు అంచనా వేస్తున్నాయి.

AP: వసతి గృహాలు, గురుకులాల్లో చదువుకునే దివ్యాంగ విద్యార్థులు ప్రతి నెలా పింఛను కోసం ఇళ్లకు వెళ్లడం దూరాభారమై ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వారి బ్యాంకు ఖాతాల్లోనే పింఛను నగదు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నవంబరు 1 నుంచి వీరికి అకౌంట్లలోనే డబ్బులు వేయనున్నారు. మొత్తంగా APలో 8.50 లక్షల మంది ఈ కోటాలో పింఛను పొందుతున్నారు. ఇందులో 10 వేల మంది విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు.

UN సెక్యూరిటీ కౌన్సిల్లో సంస్కరణలు అవసరమని G4 ఫారిన్ మినిస్టర్స్ స్పష్టంచేశారు. జియో పాలిటిక్స్, ప్రజెంట్, ఫ్యూచర్‌ను ప్రతిబింబించేలా మార్పులు ఉండాలన్నారు. కౌన్సిల్‌ను విస్తరించాలని, డెవలపింగ్ కంట్రీస్‌కు ప్రాధాన్యం దక్కాల్సిందేనని నొక్కిచెప్పారు. ఆఫ్రికా, ఏషియా పసిఫిక్, లాటిన్ అమెరికా, కరీబియన్ ప్రాంతాలకు శాశ్వత, తాత్కాలిక సభ్యత్వాలు ఉండాలన్నారు. G4 అంటే భారత్, బ్రెజిల్, జపాన్, జర్మనీ కూటమి.
Sorry, no posts matched your criteria.