News September 30, 2024

ఇదేమీ కాఫీ షాప్ కాదు.. లాయర్‌పై CJI ఆగ్రహం

image

ఓ కేసు విచారణ సందర్భంగా లాయర్ ‘యా.. యా’ అంటూ మాట్లాడటంపై CJI చంద్రచూడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఇదేమీ కాఫీ షాప్ కాదు. ఈ యా యా ఏంటి? ఇలాంటి పదాలంటే నాకు చిరాకు. వీటిని ఇక్కడ అనుమతించను’ అని హెచ్చరించారు. 2018లో అప్పటి సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్‌ పిటిషన్‌ను డిస్మిస్ చేయడాన్నిసవాల్ చేస్తూ ఈ కేసులో ఆయననే ప్రతివాదిగా చేర్చాలంటూ పిల్ దాఖలు చేశారు. గొగోయ్ పేరును తొలగించాలని CJI స్పష్టం చేశారు.

News September 30, 2024

10 కోట్ల కార్ల తయారీ.. హ్యుందాయ్ ఘనత

image

సౌత్ కొరియా కంపెనీ హ్యుందాయ్ మోటార్స్ అరుదైన ఘనత సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల కార్లను తయారుచేసిన సంస్థగా నిలిచింది. ద.కొరియాలోని ఉల్సాన్ ప్లాంట్‌లో రికార్డు బ్రేకింగ్ కారును కస్టమర్‌కు అప్పగించింది. 1968లో కార్యకలాపాలను ప్రారంభించిన ఈ సంస్థ 57 ఏళ్లలో భారత్ సహా 10 దేశాల్లో 12 ప్లాంట్‌లను ఏర్పాటుచేసింది. సవాళ్లను ఎదుర్కొని నూతన ఆవిష్కరణలు చేయడంతోనే వృద్ధి సాధ్యమైందని CEO జేహూన్ తెలిపారు.

News September 30, 2024

Income Tax ఆడిట్ రిపోర్ట్స్ ఫైలింగ్ గడువు పొడిగింపు

image

2023-24 అసెస్‌మెంట్ ఏడాదికి వివిధ ఆడిట్ నివేదికలను సమర్పించడానికి Sep 30తో (సోమవారం) ముగియ‌నున్న‌ గడువును ఆదాయపు పన్ను శాఖ అక్టోబర్ 7 వరకు పొడిగించింది. వ్యాపార సంస్థ‌లు, ఆడిట్‌లు చేయించుకోవాల్సిన వ్యక్తులు పన్ను నిబంధనలకు అనుగుణంగా ఈ నివేదికలను స‌మ‌ర్పించాలి. అక్టోబ‌ర్ 31లోపు ప‌న్ను చెల్లించాల్సిన వారంద‌రికీ ఈ గ‌డువు పొడిగింపు వ‌ర్తిస్తుంది. ఈ మేరకు Central Board of Direct Taxes ప్రకటించింది.

News September 30, 2024

DSC ఫలితాలు.. ఇక్కడ క్లిక్ చేయండి

image

TG: సీఎం రేవంత్ రెడ్డి డీఎస్సీ-2024 ఫలితాలను కాసేపటి క్రితం విడుదల చేశారు. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అందుబాటులోకి వచ్చింది. రిజల్ట్స్ చెక్ చేసుకునేందుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి. https://tgdsc.aptonline.in/tgdsc/ ఇందులో 6508 ఎస్జీటీ, 2629 స్కూల్ అసిస్టెంట్, 796 ఎస్జీటీ (స్పెషల్ ఎడ్యుకేటర్స్), 727 లాంగ్వేజ్ పండిట్, 220 స్కూల్ అసిస్టెంట్ (స్పెషల్ ఎడ్యుకేటర్), 182 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు ఉన్నాయి.

News September 30, 2024

GET READY: ‘రా మచ్చా మచ్చా’ వచ్చేది అప్పుడే!

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ నుంచి ఈరోజు సెకండ్ సింగిల్ రిలీజ్ కానుంది. ‘రా మచ్చా మచ్చా’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రకటించారు. ఇప్పటికే రిలీజైన ప్రోమో సంగీత ప్రియులకు నచ్చేసింది.

News September 30, 2024

గ్రేట్.. కొండపై ఔషద మొక్కలు పెంచుతున్నాడు!

image

ఒడిశాకు చెందిన ప్రకృతి ప్రేమికుడు పుపున్ సాహూను అభినందిస్తూ ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త ఎరిక్ సోల్హెమ్ ట్వీట్ చేశారు. ‘సోషల్ మీడియాకు దూరంగా ఉండే ఈ యువ వడ్రంగి ప్రకృతి పరిరక్షణకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నయాగఢ్‌లోని కుసుమి నది నుంచి నీటిని తీసుకొచ్చి ఎంతో క్లిష్టతరమైన కొండ ప్రాంతంలో 800కు పైగా ఔషధ, వివిధ రకాల చెట్లను పెంచుతున్నారు. ఈయన రియల్ లోకల్ ఛాంపియన్’ అని ఆయన కొనియాడారు.

News September 30, 2024

‘హైడ్రా’ కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు చురకలు

image

TG: హైడ్రా ఏర్పాటు అభినందనీయమేనని.. పనితీరే అభ్యంతరకరంగా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. అమీన్‌పూర్ ఎమ్మార్వో, హైడ్రా కమిషనర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సెలవుల్లో నోటీసులు ఇచ్చి అత్యవసరంగా ఎందుకు కూలుస్తున్నారని ప్రశ్నించింది. హైడ్రాకు కూల్చివేతలు తప్ప మరో పాలసీ లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము అడిగిన ప్రశ్నకే సమాధానం ఇవ్వాలని, దాట వేయొద్దని కమిషనర్ రంగనాథ్‌కు కోర్టు చురకలు అంటించింది.

News September 30, 2024

హైడ్రా ఇదే విధంగా ముందుకు వెళ్తే స్టే ఇవ్వాల్సి వస్తుంది: హైకోర్టు

image

TG: ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో అమాయకులను ఇబ్బందులకు గురిచేస్తారా? అని హైకోర్టు ‘హైడ్రా’పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అమీన్‌పూర్ తహశీల్దార్ కోరడంతో యంత్రాలు, సిబ్బంది సమకూర్చామని రంగనాథ్ కోర్టుకు తెలిపారు. చార్మినార్ కూల్చివేతకు తహశీల్దార్ యంత్రాలు, సిబ్బంది అడిగితే ఇస్తారా? అని ప్రశ్నించింది. హైడ్రా ఇదే విధంగా ముందుకు వెళ్తే స్టే ఇవ్వాల్సి వస్తుందని కోర్టు హెచ్చరించింది.

News September 30, 2024

ఖ‌ర్గే వ్యాఖ్య‌ల‌పై అమిత్ షా కౌంట‌ర్‌

image

PM మోదీని గ‌ద్దెదించే వ‌ర‌కు తాను చావ‌బోనంటూ కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఖ‌ర్గే చేసిన వ్యాఖ్య‌ల‌కు కేంద్ర మంత్రి అమిత్ షా కౌంట‌ర్ ఇచ్చారు. ఖర్గే వ్యాఖ్యలు ప్రధాని పట్ల కాంగ్రెస్, ఆ పార్టీ నేతలకు ఉన్న ద్వేషం, భయాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. ఖ‌ర్గే అన‌వ‌స‌రంగా మోదీని ఆయన వ్య‌క్తిగ‌త, ఆరోగ్య విష‌యాల్లోకి లాగార‌ని పేర్కొన్నారు. ఈ తరహా వ్యాఖ్యల విషయంలో కాంగ్రెస్‌లో ఖర్గే అందర్నీ మించిపోయారన్నారు.

News September 30, 2024

చరిత్రాత్మక విజయం వెనుక అన్నదమ్ములు!

image

అంతర్జాతీయ టీ20ల్లో సౌతాఫ్రికాను ఓడించి ఐర్లాండ్ చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, SAను ఐర్లాండ్ మట్టికరిపించడంలో ఇద్దరు అన్నదమ్ములు కీలక పాత్ర పోషించారు. వారే అడైర్ బ్రదర్స్ మార్క్ & రోస్‌. ఒకరు బంతి, మరొకరు బ్యాట్‌తో SA ప్లేయర్లకు చుక్కలు చూపించారు. తొలుత రోస్ అడైర్ సెంచరీతో చెలరేగితే, మార్క్ 4 వికెట్లు పడగొట్టి సత్తా చాటారు. IR అభిమానులు వీరిని అభినందిస్తున్నారు.