News September 24, 2024

ఓవర్సీస్‌లో ‘దేవర’ సంచలనం సృష్టించనుందా?

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా ఓవర్సీస్‌లో సంచలనం సృష్టించేలా కనిపిస్తోందని సినీవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రీమియర్స్‌తో పాటు ఫస్డ్ డే కలెక్షన్లు కలిపి $5 మిలియన్లు క్రాస్ చేస్తుందని చెబుతున్నాయి. ప్రీమియర్స్ తర్వాత పాజిటివ్ టాక్ వస్తే ఇక $6M వరకు రావొచ్చని పేర్కొన్నాయి. ఏది ఏమైనా వీకెండ్ పూర్తయ్యేలోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని అంచనా వేశాయి. ‘దేవర’ చూసేందుకు మీరూ వెళ్తున్నారా?

News September 24, 2024

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలవా చంద్రబాబు: YCP

image

AP:తిరుమల లడ్డూ విషయంలో TTD EO, CM మాటలకు పదేపదే తేడాలేంటని YCP ప్రశ్నించింది. ‘వెజిటబుల్ ఫ్యాట్స్ గుర్తించామని జులై 23న EO చెబితే, యానిమల్ ఫ్యాట్స్ అని CM అన్నారు. ఆ తర్వాత EO యానిమల్ ఫ్యాట్స్ అన్నారు. నాణ్యత లేదని 4 ట్యాంకర్ల నెయ్యి వాడలేదని EO చెప్పారు. CM 2-3 ట్యాంకర్లు ఆలయంలోకి వెళ్లాయన్నారు. లోకేశ్ నిన్న 4 ట్యాంకర్లు వెనక్కి పంపామన్నారు. దేవుడి విషయంలో ఎందుకిన్ని డ్రామాలు?’ అని నిలదీసింది.

News September 24, 2024

ఘోరం.. నర్సింగ్ స్టూడెంట్‌పై గ్యాంగ్ రేప్

image

కోల్‌కతా లేడీ డాక్టర్‌పై హత్యాచార ఘటన మరవకముందే తమిళనాడులో మరో ఘోరం జరిగింది. దిండిగల్ జిల్లాలో స్వస్థలం తెని నుంచి బయలుదేరిన ఓ నర్సింగ్ స్టూడెంట్‌ను కొందరు దుండగులు అపహరించి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలిని దిండిగల్ రైల్వే స్టేషన్ సమీపంలో వదిలి వెళ్లారు. పోలీసులు ఆమెను గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.

News September 24, 2024

తారక్‌కి బెస్ట్ విషెస్: మంత్రి కోమటిరెడ్డి

image

‘దేవర’ టికెట్ ధరలు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం జీవో రిలీజ్ చేయడంపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన <<14179153>>ట్వీట్‌కు<<>> మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రిప్లై ఇచ్చారు. ‘దేవర రిలీజ్ సందర్భంగా తారక్‌కి శుభాకాంక్షలు. రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ తెలుగు చిత్ర పరిశ్రమకు అండగా నిలుస్తూనే ఉంటుంది’ అని తెలిపారు. ఈనెల 27న ‘దేవర’ విడుదలవనుంది.

News September 24, 2024

KTR కనిపించడం లేదని ఫిర్యాదు

image

TG: తమ ఎమ్మెల్యే కేటీఆర్ కనిపించడం లేదని సిరిసిల్ల నియోజకవర్గంలోని గంభీరావుపేట బీజేపీ నేత కోడె రమేశ్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘నియోజకవర్గంలోని పలు గ్రామాలు సమస్యలతో సతమతమవుతున్నాయి. కానీ పట్టించుకునే తీరిక ఆయనకు లేకుండా పోయింది. ప్రచార ఆర్భాటాలు తప్ప పనులు పూర్తి చేయడంలో కేటీఆర్‌కు ఆసక్తి లేదు. తమ MLA ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి’ అని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

News September 24, 2024

వైసీపీ నేతలకు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్

image

AP: YCP నేతలు తనపై చేస్తున్న విమర్శలకు ఇప్పటికీ సహిస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ సనాతన ధర్మంపై అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ‘తిరుమలను ఆధ్యాత్మిక కేంద్రం నుంచి పర్యాటక కేంద్రంగా మార్చారు. తిరుమల అపవిత్రతకు మాజీ ఈఓ ధర్మారెడ్డే ప్రధాన కారణం. ఇంత జరుగుతున్నా ఆయన ఎక్కడా కనిపించడం లేదు. YCP నేతలు పిచ్చి పట్టినట్లుగా మాట్లాడొద్దు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News September 24, 2024

స్కూల్‌కి రూ.125 కోట్ల విరాళం.. నెట్టింట భిన్నాభిప్రాయాలు!

image

ఫేస్‌బుక్ కోఫౌండర్ ఎడ్వర్డో సావెరిన్ గొప్ప మనసు చాటుకున్నారు. సింగపూర్ అమెరికన్ స్కూల్‌‌కు $15.5M (₹125 కోట్లు) విరాళమిచ్చారు. స్కూల్ ఈ మొత్తాన్ని ల్యాబ్స్, ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణానికి ఖర్చు చేయనుంది. అయితే ఇదొక ప్రైవేట్ స్కూల్. ఏడాదికి ఒక్కో విద్యార్థి నుంచి $47,000 ఫీజు వసూలు చేస్తుంది. ఇలాంటి ప్రైవేట్ స్కూల్‌కి కాకుండా చారిటీ స్కూల్స్‌కి డొనేట్ చేయాల్సిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

News September 24, 2024

అంబానీ కుమారుడికి సెబీ ఫైన్

image

అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అంబానీకి సెబీ షాకిచ్చింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌లో అవకతవకల కేసులో రూ.కోటి ఫైన్ వేసింది. కంపెనీ జనరల్ పర్పస్ వర్కింగ్ క్యాపిటల్ లోన్ రూల్స్‌ను ఆయన పాటించలేదని చెప్పింది. వీసా క్యాపిటల్ పార్ట్‌నర్స్, అక్యూరా ప్రొడక్షన్ కంపెనీలకు రూ.20 కోట్ల చొప్పున అన్ సెక్యూర్డ్ లోన్లకు అనుమతించారని వెల్లడించింది. తాము పంపిన ఈ‌మెయిల్స్‌కు ‘ఓకే’ అని బదులివ్వడమే దీనికి నిదర్శనమంది.

News September 24, 2024

HYDRAది ద్వంద్వ వైఖరి: BRS

image

TG: హైడ్రా ద్వంద్వ వైఖరి మరోమారు బట్టబయలైందని BRS ఆరోపించింది. ‘దుర్గం చెరువు ఆక్రమణలకు నోటీసులు ఇచ్చి, అందులో రేవంత్ సోదరుడు ఉండటంతో మీనమేషాలు లెక్కిస్తోంది. బడాబాబుల వైపు కన్నెత్తి చూడటం లేదు. పేదోడి ఇంటిపైకి శరవేగంగా హైడ్రా బుల్డోజర్లు దూసుకొస్తున్నాయి. పేదోళ్ల ఇళ్లను కూలుస్తూ బడాబాబులకు మాత్రం నోటీసుల పేరుతో సమయం ఇస్తోంది’ అని ట్వీట్ చేసింది.

News September 24, 2024

అక్టోబర్ 15 నుంచి ‘ఇందిరమ్మ’ అర్హుల ఎంపిక: మంత్రి

image

TG: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హుల ఎంపిక ప్రక్రియను అక్టోబర్ 15 నుంచి ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. భద్రాద్రి జిల్లా ఇల్లందులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి విధివిధానాలను వారం రోజుల్లో రూపొందిస్తామన్నారు. నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్లను అర్హులకు అందించే విషయంపైనా త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.