India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తాను గతంలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేయొద్దని యాంకర్ రష్మీ గౌతమ్ కోరారు. అది 2020 కంటే ముందు ఇంటర్వ్యూ అని తెలిపారు. ఇప్పుడు ఆ వీడియోను వైరల్ చేసి పాఠకులను తప్పుదోవ పట్టించొద్దని ఆమె ట్వీట్ చేశారు. కాగా జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు నమోదైన వేళ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

AP: తిరుమల లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీపై తిరుపతి ఈస్ట్ పీఎస్‌లో టీటీడీ ప్రొక్యూర్‌మెంట్ జీఎం మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు. నెయ్యి సరఫరాలో నిబంధనలు పాటించలేదని, ఏఆర్ డెయిరీ ఫుడ్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ గురించి DOP రత్నవేలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. ‘పార్ట్-1లో దాదాపు 3వేల సీజీ షాట్స్ ఉన్నాయి. సెట్స్‌ను రూపొందించడానికి చాలా కష్టపడ్డారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఛాలెంజింగ్‌గా ఉండేది. అండర్ వాటర్ & ఓవర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్‌లలో వర్క్ చేయడం ఎగ్జైటింగ్ అనిపించింది. 30 నిమిషాల అండర్ వాటర్ సీన్ ఫుటేజీ ఉంది. మొదట 2 పార్టులు ఉంటుందని అనుకోలేదు’ అని తెలిపారు.

ప్రపంచ సుందరి టైటిల్‌ను భారత్ చివరగా 2017లో గెలుపొందింది. ప్రపంచ దేశాల్లో భారత్& వెనిజులా వద్దే అత్యధికంగా 6 చొప్పున టైటిల్స్ ఉన్నాయి. 1951లో UKలో ఎరిక్ మోర్లీ ప్రపంచ అందాల పోటీని మొదలుపెట్టారు. కాగా 1966లో భారత్ తరఫున రీటా ఫారియా తొలి టైటిల్‌ను గెలుచుకున్నారు. తర్వాత 1994లో ఐశ్వర్యా రాయ్, 1997లో డయానా హేడెన్, 1999లో యుక్తా ముఖే, 2000లో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లర్ విజేతలుగా నిలిచారు.

AP: విశాఖలో అంతర్జాతీయ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. సీఐఐ సదస్సులో ఆయన మాట్లాడారు. ‘విశాఖను ప్రపంచంలోనే నెం.1 ఐటీ హబ్‌గా మారుస్తాం. భోగాపురం ఎయిర్‌పోర్టు వస్తే ఉత్తరాంధ్ర విప్లవాత్మకంగా అభివృద్ధి చెందుతుంది. విశాఖలో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ రాబోతోంది. ప్రస్తుతం దేశంలో 9వ అతిపెద్ద ఎకనమిక్ సిటీగా ఉన్న వైజాగ్‌ను 5వ ప్లేస్‌కు తీసుకొస్తాం’ అని మంత్రి చెప్పారు.

హర్షసాయిపై అత్యాచారం కేసులో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. ఆయన హీరోగా నటిస్తున్న ‘మెగా’ సినిమా కాపీ రైట్స్ కోసం హర్ష పట్టుబడుతున్నాడని సినిమాకు నిర్మాతగానూ వ్యవహరించిన బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. మత్తుమందు ఇచ్చి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేశాడని ఆరోపించింది. కాపీరైట్స్ ఇవ్వకపోతే వీడియోలు వైరల్ చేస్తానని బెదిరించాడని ఆమె ఫిర్యాదు చేసింది.

ఏపీలో దేవర టీంకు చుక్కెదురైంది. 14 రోజుల పాటు సినిమా టికెట్ల ధరలు పెంచుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవధిని 10 రోజులకే పరిమితం చేయాలని ప్రభుత్వానికి సూచించింది. కాగా మల్టీప్లెక్స్‌లో ఒక్కో టికెట్‌పై రూ.135 వరకూ, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ ఒక్కో టికెట్‌పై రూ.110, లోయర్ క్లాస్ ఒక్కో టికెట్‌పై రూ.60 వరకూ పెంచారు.

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్ రీఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైట్ బాల్ క్రికెట్‌లో దేశం తరఫున ఆడాలని సెలక్టర్లు, కోచ్ కోరితే తప్పకుండా ఆడతానని ఆయన తెలిపారు. కాగా 2022లో స్టోక్స్ వన్డేలకు గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత 2023WCలో రీఎంట్రీ ఇచ్చి మళ్లీ వీడ్కోలు పలికారు. ఇప్పుడు మరోసారి పునరాగమనం చేయాలని భావిస్తున్నారు.

ఏ వర్గం పైనా క్యాజువల్ కామెంట్స్ చేయొద్దని జడ్జిలను సుప్రీంకోర్టు అప్రమత్తం చేసింది. దేశంలోని ఏ ప్రాంతాన్నీ పాకిస్థాన్‌గా పిలవొద్దని ఆదేశించింది. అది భారత ప్రాంతీయ సార్వభౌమత్వానికి వ్యతిరేకమేనని తెలిపింది. KA హైకోర్టు జడ్జి, జస్టిస్ వీ శ్రీశానందన్ ఓ కేసులో బెంగళూరులోని ముస్లిం ఆధిపత్య ప్రాంతాన్ని పాకిస్థాన్ అనడం, మహిళా లాయర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైరల్ వీడియోల కేసును సుమోటోగా విచారించింది.

AP: వరద బాధితుల అకౌంట్లలో ప్రభుత్వం ఆర్థిక సాయం జమ చేసింది. NTR జిల్లా కలెక్టరేట్‌లో పలువురు బాధితులకు CM చంద్రబాబు చెక్కులను అందించారు. మిగిలిన సుమారు 4 లక్షల మందికి ఖాతాల్లో జమ చేశారు. ఇళ్లు పూర్తిగా మునిగిన వారికి రూ.25 వేలు, మొదటి, ఆపై అంతస్తుల్లో ఉండేవారికి రూ.10వేలు, దుకాణాలు, తోపుడు బళ్లు, వాహనాలు, పశువులు, పంటలు నష్టపోయిన వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది.
Sorry, no posts matched your criteria.