News September 25, 2024

అమరావతిలో MSME శిక్షణ కేంద్రం

image

AP: అమరావతిలో MSME 2వ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 20 ఎకరాలను కేటాయించింది. దీనిలో టెస్టింగ్ ఫెసిలిటీ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. రూ.250 కోట్ల ఖర్చుతో దీన్ని ప్రతిపాదించగా, 20 ఎకరాల భూములను కేంద్ర MSME డెవలప్‌మెంట్ కమిషనర్ పేరిట ఉచితంగా బదిలీ చేయనుంది. విశాఖలో ఉన్న మొదటి టెక్నాలజీ సెంటర్‌లో డిప్లొమా, పోస్ట్ డిప్లొమా, PG డిప్లొమా సహా పలు MSME కోర్సులు అందిస్తోంది.

News September 25, 2024

విశాఖ పర్యటనకు నారా లోకేశ్

image

AP: మంత్రి నారా లోకేశ్ ఇవాళ, రేపు విశాఖలో పర్యటించనున్నారు. ఇవాళ సీఐఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో పాల్గొన్న అనంతరం ఆయన పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా పార్టీ కార్యకర్తలు, ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులను లోకేశ్ కలవనున్నారు.

News September 25, 2024

BREAKING: మాజీ MLA మృతి

image

AP: మాగుంట కుటుంబంలో విషాదం నెలకొంది. మాజీ MP, MLA మాగుంట పార్వతమ్మ(77) అనారోగ్యంతో చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దివంగత MP సుబ్బరామిరెడ్డికి సతీమణి అయిన ఆమె.. 1996లో INC తరఫున ఒంగోలు MP, 2004లో కావలి MLAగా గెలిచారు. ప్రస్తుత MP మాగుంట శ్రీనివాసులురెడ్డికి పార్వతమ్మ వదిన. ఆమె మృతి తమ కుటుంబంలో విషాదం నింపిందని, రేపు నెల్లూరులో అంత్యక్రియలు నిర్వహిస్తామని MP వెల్లడించారు.

News September 25, 2024

ఈ ఆరుగురు క్రికెటర్లు 8 వరల్డ్ కప్స్ ఆడారు!

image

ఇప్పటి వరకు మహిళల టీ20 ప్రపంచ కప్ టోర్నీలు 8సార్లు జరగగా ఆరుగురు క్రికెటర్లు వాటన్నింటిలోనూ ఆడారు. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీ, న్యూజిలాండ్‌కు చెందిన బ్యాటర్ సుజీ బేట్స్, ఆల్‌రౌండర్ సోఫీ డివైన్, శ్రీలంక కెప్టెన్ చామరి ఆటపట్టు, వెస్టిండీస్ మాజీ కెప్టెన్ స్టెఫానీ టేలర్ ఆ జాబితాలో ఉన్నారు. కాగా వచ్చే నెల 3 నుంచి టీ20 వరల్డ్ కప్ 9వ ఎడిషన్ UAEలో మొదలుకానుంది.

News September 25, 2024

కారుకు గీతలు గీశారని చిన్నారులపై కేసు

image

TG: కారుకు గీతలు గీశారని 8 మంది పిల్లలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ చిన్నారులంతా 2 నుంచి 9 ఏళ్ల లోపువారే కావడం గమనార్హం. హనుమకొండలోని ఓ ఫ్లాట్‌లో నివసించే CID కానిస్టేబుల్ కారుపై చిన్నారులు ఆడుకుంటూ గీతలు గీశారు. కారు మరమ్మతులకు డబ్బులు ఇస్తామని పిల్లల తల్లిదండ్రులు చెప్పినా వినకుండా ఆయన సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిల్లలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

News September 25, 2024

హైదరాబాద్-అయోధ్య విమాన సర్వీసులు

image

శంషాబాద్ నుంచి రాముడి జన్మస్థానమైన అయోధ్యకు ఈ నెల 27 నుంచి ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. వారంలో నాలుగు రోజులు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అలాగే ఈ నెల 28 నుంచి ప్రయాగ్ రాజ్, ఆగ్రాకు కూడా రెండు సర్వీసులను ఇండిగో ప్రారంభించనుంది. వారంలో 3 రోజులు ఈ విమానాలు తిరుగుతాయి. అటు ప్రతి సోమ, మంగళవారాల్లో అగర్తల, జమ్మూలకు విమాన సర్వీసులు ఉంటాయని ఇండిగో ప్రకటించింది.

News September 25, 2024

కొత్త కోర్సు.. నేడు ప్రారంభించనున్న సీఎం

image

TG: BFSI(బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్) మినీ డిగ్రీ కోర్సును CM రేవంత్ ఇవాళ ప్రారంభించనున్నారు. అత్యధిక జాబ్ డిమాండ్ ఉన్న ఈ కోర్సును డిగ్రీ, ఇంజినీరింగ్‌లో చేరిన విద్యార్థులకు అందిస్తారు. పట్టా పొందినవారి వివరాలతో హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రత్యేక పోర్టల్‌ రూపొందించనుంది. BFSI రంగంలో పేరొందిన కంపెనీలు తమకు అవసరమైన వారిని జాబ్స్‌కు ఎంపిక చేసుకునేందుకు ఈ పోర్టల్ వారధిగా పనిచేయనుంది.

News September 25, 2024

భారీ వర్షాలు.. తీవ్ర విషాదం

image

TG: భారీ వర్షాలు రాష్ట్రంలో తీవ్ర విషాదం నింపాయి. పిడుగుపాటుకు వివిధ ప్రాంతాల్లో ఐదుగురు మృతి చెందారు. భద్రాద్రి(D) దమ్మపేట(మ) జగ్గారంలో వర్షం పడుతోందని ఓ చెట్టు కిందకు వెళ్లడంతో సమీపంలో పిడుగుపడి నాగశ్రీ(22), అనూష(23) చనిపోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మహబూబ్‌నగర్, కరీంనగర్, NZB జిల్లాల్లో ఇద్దరు వృద్ధులు, మరో వ్యక్తి(29) తుదిశ్వాస విడిచారు.

News September 25, 2024

30 నుంచి ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం

image

TG: రాష్ట్రంలో ఖాళీ అవనున్న 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఓటరు నమోదు ప్రక్రియ సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభం కానున్నట్లు CEO సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. వచ్చే మార్చి 29తో కరీంనగర్, NZB, మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీలు, వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ కానున్నాయి. ఓటరు నమోదుకు నవంబర్ 6 చివరి తేదీ కాగా డిసెంబర్ 30న తుది జాబితా విడుదల చేస్తారు.

News September 25, 2024

ప్రజలను పవన్ రెచ్చగొడుతున్నారు: హర్షకుమార్

image

AP: తిరుమల లడ్డూ విషయంలో హిందువులంతా రోడ్లపైకి రావాలన్న పవన్ కళ్యాణ్‌ వ్యాఖ్యలు సరికాదని మాజీ MP హర్షకుమార్ మండిపడ్డారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ప్రజలను రెచ్చగొడుతున్న ఆయనను వెంటనే డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. కుట్రతోనే CM చంద్రబాబు లడ్డూ ఆరోపణలు చేస్తున్నారని, కల్తీపై ఆయన వద్ద ఆధారాలు లేవని స్పష్టం చేశారు. సిట్‌తో ఎలాంటి ఉపయోగం లేదని, సీబీఐతో విచారణ చేయించాలని హర్షకుమార్ అన్నారు.