India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఎక్కడికెళ్లినా ఒలింపిక్ మెడల్స్ తీసుకెళ్తున్నారని భారత షూటర్ మనూ భాకర్‌పై నెట్టింట ట్రోల్స్ జరుగుతున్నాయి. వీటికి తాజాగా ఆమె కౌంటర్ ఇచ్చారు. ‘పారిస్ 2024 ఒలింపిక్స్‌లో నేను సాధించిన రెండు కాంస్య పతకాలు భారత్‌కే చెందుతాయి. ఏదైనా ఈవెంట్‌కు నన్ను పిలిచి, ఈ పతకాలను చూపించమని అడిగితే నేను గర్వంగా చూపిస్తుంటాను. నిర్వాహకులు కూడా మెడల్స్ తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తుంటారు’ అని ట్వీట్ చేశారు.

AP: రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 28న ఆలయాల్లో పూజలు చేయాలని వైసీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత YS జగన్ పిలుపునిచ్చారు. ‘తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను, వెంకటేశ్వరస్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, లడ్డూ పవిత్రతను, రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడి సీఎం చంద్రబాబు అపవిత్రం చేశారు. ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు పూజలు చేయాలి’ అని ట్వీట్ చేశారు.

కర్ణాటక CM సిద్దరామయ్యకు మరో షాక్. ఆయన భార్య పార్వతికి ముడా అక్రమంగా 14 సైట్లు కేటాయించిందన్న ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని లోకాయుక్త పోలీసులను స్పెషల్ కోర్టు ఆదేశించింది. ఈ స్కామ్‌లో దర్యాప్తునకు గవర్నర్ థావర్‌చంద్ అనుమతివ్వడాన్ని వ్యతిరేకిస్తూ సిద్దూ వేసిన పిటిషన్ను హైకోర్టు మంగళవారం కొట్టేసింది. ఆ తర్వాతి రోజే స్పెషల్ కోర్టు జడ్జి సంతోష్ గజానన్ భట్ లోకాయుక్తను ఇలా ఆదేశించడం గమనార్హం.

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రెండో ర్యాంకుకు దూసుకెళ్లారు. జడేజా 7 నుంచి ఆరో స్థానానికి చేరుకోగా, రవిచంద్రన్ అశ్విన్ అగ్ర స్థానంలోనే కొనసాగుతున్నారు. అలాగే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో యశస్వీ జైస్వాల్ 5, రిషభ్ పంత్ 6, రోహిత్ శర్మ 10, విరాట్ కోహ్లీ 12, శుభ్‌మన్ గిల్ 14వ ప్లేస్‌లో నిలిచారు. ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా, అశ్విన్ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

BJP గతంలో RSS సహకారం తీసుకుందని, అయితే ఇప్పుడు సొంతంగా తన వ్యవహారాలను చూసుకోగలదన్న పార్టీ అధ్యక్షుడు JP నడ్డా వ్యాఖ్యలను ‘కుటుంబ వ్యవహారంగా’ RSS అభివర్ణించింది. ఈ వ్యాఖ్యలతో రెండింటి మధ్య దూరం పెరిగిందన్న వార్తలపై RSS అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ స్పందించారు. ‘ఇది కుటుంబ వ్యవహారం. అలాగే పరిష్కరించుకుంటాం. దీనిపై బహిరంగ వేదికలపై చర్చించం’ అని పేర్కొన్నారు.

మాస్ మహారాజా రవితేజ కుమారుడు మహాధన్ అసిస్టెంట్ డైరెక్టర్ అవతారమెత్తనున్నట్లు తెలుస్తోంది. రవితేజ కూడా అసిస్టెంట్ డైరెక్టర్‌గానే ఇండస్ట్రీలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ మూవీ కోసం మహాధన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. కూతురు మోక్షద కూడా నిర్మాతగా మారేందుకు సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు టాక్.

TG: డ్రగ్స్, గంజాయికి అలవాటు పడుతూ యువత నిర్వీర్యం అవుతోందని CM రేవంత్ అన్నారు. ‘ఇంజినీరింగ్ విద్యార్థులు డ్రగ్ పెడ్లర్లుగా మారుతున్నారు. ఇది తెలంగాణకు అత్యంత ప్రమాదకరం. యువత అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా చూస్తాం. నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్ ఉంటేనే యువతకు జాబ్స్ వస్తాయి. చదువులో నాణ్యత విషయంలోనూ కాలేజీలు దృష్టి పెట్టాలి. లేదంటే వాటి అనుమతి రద్దు చేస్తాం’ అని సీఎం హెచ్చరించారు.

TG: 633 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 5 నుంచి 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 23, 24 తేదీల్లో దరఖాస్తుల్లో మార్పులకు అవకాశం ఉంటుంది. నవంబర్ 30న CBT విధానంలో పరీక్ష జరుగుతుంది. డి.ఫార్మసీ, బి.ఫార్మసీ పూర్తైన 18- 46 ఏళ్లలోపు వారు దరఖాస్తులకు అర్హులు. ఈ పోస్టులకు పేస్కేలు రూ.31,040 నుంచి రూ.92,050 మధ్య ఉంటుంది. పూర్తి వివరాలకు ఇక్కడ <

FY24లో జెరోదా 62% వృద్ధితో రూ.4700 కోట్ల ప్రాఫిట్ ఆర్జించినట్టు ఫౌండర్ నితిన్ కామత్ తెలిపారు. రెవెన్యూ 21% వృద్ధితో రూ.8320 కోట్లుగా ఉందన్నారు. ‘జెరోదా ట్రేడర్లు ప్రస్తుతం రూ.లక్ష కోట్ల అన్‌రియలైజ్డ్ ప్రాఫిట్‌తో ఉన్నారు. మా కస్టడీలోని అసెట్స్ విలువ రూ.5.66 లక్షల కోట్లు. ఇండెక్స్ డెరివేటివ్స్ ద్వారా మాకు ఎక్కువ రెవెన్యూ వస్తోంది. రూల్స్‌లో మార్పు జరిగితే అందులో 30-50% కోత పడొచ్చు’ అని చెప్పారు.

TG: రాష్ట్రంలో 30 లక్షలకుపైగా నిరుద్యోగులు ఉన్నారని CM రేవంత్ అన్నారు. ‘ఉద్యోగాల భర్తీని బాధ్యతగా ఆచరణలో పెడుతున్నాం. 35వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చాం. 2-3 నెలల్లో మరో 35 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక ప్రైవేటు సెక్టార్‌లో ఇండస్ట్రీ పెద్దలను పిలిచి వారి అవసరాలు తెలుసుకున్నాం. అందుకు అనుగుణంగా అభ్యర్థులకు శిక్షణ ఇస్తాం’ అని BFSI కోర్సు ప్రారంభం సందర్భంగా వ్యాఖ్యానించారు.
Sorry, no posts matched your criteria.