News October 11, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 11, 2024

శుభ ముహూర్తం

image

తేది: అక్టోబర్ 11, శుక్రవారం
అష్టమి: మధ్యాహ్నం 12.06 గంటలకు
ఉత్తరాషాఢ: తెల్లవారుజామున 5.25 గంటలకు
వర్జ్యం: మధ్యాహ్నం 1.35-3.10 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉదయం 8.22-9.08 గంటల వరకు తిరిగి
మధ్యాహ్నం 12.17-1.04 గంటల వరకు

News October 11, 2024

TODAY HEADLINES

image

✒ రతన్ టాటా అంత్యక్రియలు పూర్తి
✒ హరియాణా ఫలితాలపై ECకి కాంగ్రెస్ ఫిర్యాదు
✒ నన్ను చంపాలనుకున్నారనే ప్రచారం జరిగింది: CBN
✒ పవన్ కళ్యాణ్‌కు మళ్లీ అస్వస్థత
✒ CBN మాదిరి అబద్ధాలు చెప్పి ఉంటే CMగా ఉండేవాడినేమో: జగన్
✒ దేవాలయాలకు స్వయంప్రతిపత్తి.. AP ప్రభుత్వం ఉత్తర్వులు
✒ TGవ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
✒ APకి వెళ్లాల్సిందే.. TGలోని 11 మంది IASలకు కేంద్రం ఆదేశం
✒ కొండా సురేఖకు హైకోర్టు నోటీసులు

News October 11, 2024

సారీ.. పోటీలో వెనుకబడ్డాం: శామ్‌సంగ్

image

పోటీలో వెనుకబడినందుకు తమను క్షమించాలని శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ సంస్థ వినియోగదారుల్ని కోరింది. ఈ ఏడాది మూడో త్రైమాసిక ఆదాయ వివరాల సందర్భంగా ఆ లేఖను విడుదల చేసిందని ‘ది వెర్జ్’ మ్యాగజైన్ తెలిపింది. స్మార్ట్‌ఫోన్, సెమీకండక్టర్ విభాగాల్లో కొత్త ఆవిష్కరణలుండటం లేదన్న విమర్శల్ని శామ్‌సంగ్ ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే సంస్థ కొత్త ఉపాధ్యక్షుడు జియోన్ యంగ్-హ్యూన్ ఈ లేఖ రాశారని ‘ది వెర్జ్’ పేర్కొంది.

News October 11, 2024

ఎన్నికల వేళ ‘మహాయుతి’ కీలక నిర్ణయం

image

అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ నాన్ క్రీమిలేయ‌ర్ ప‌రిమితిని పెంచాల‌ని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్రాన్ని కోరింది. ప్ర‌స్తుతం ఉన్న₹8 ల‌క్ష‌ల ప‌రిమితిని ₹15 ల‌క్ష‌ల‌కు పెంచాల‌ని క్యాబినెట్ ప్ర‌తిపాదించింది. హ‌రియాణా ఎన్నిక‌ల‌కు ముందు కూడా BJP క్రీమిలేయ‌ర్‌ను ₹6 ల‌క్ష‌ల నుంచి ₹8 ల‌క్ష‌ల‌కు పెంచింది. ఇది బీజేపీకి ఎన్నిక‌ల్లో లాభం చేయడంతో మ‌హారాష్ట్ర‌లో కూడా అదే ఎత్తుగ‌డ వేసిన‌ట్టు తెలుస్తోంది.

News October 11, 2024

నమ్కిన్ ప్యాకెట్ల మాటున రూ.2 వేల కోట్ల విలువైన డ్రగ్స్ సరఫరా

image

ఢిల్లీలో మరోసారి ₹వేల కోట్లు విలువ చేసే డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయింది. తాజాగా నమ్కిన్ ప్యాకెట్ల మాటున సరఫరా చేస్తున్న ₹2 వేల కోట్లు విలువచేసే 200 కేజీల కొకైన్‌ను పోలీసులు ప‌ట్టుకున్నారు. ఇటీవ‌ల ఢిల్లీలో ప‌ట్టుబ‌డిన‌ ₹5,620 కోట్ల విలువైన డ్ర‌గ్స్ సరఫరా ముఠాకు తాజాగా ఘటనతో సంబంధాలున్న‌ట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. న‌లుగురిని అరెస్టు చేశారు. ప్ర‌ధాన నిందితుడు లండ‌న్ ప‌రారైన‌ట్టు తెలుస్తోంది.

News October 11, 2024

CARTOON: స్వర్గంలో టాటాకు జంషెట్జీ స్వాగతం

image

రతన్ టాటాకు స్వర్గంలో తన ముత్తాత జంషెట్జీ, భారతరత్న జేఆర్డీ టాటా స్వాగతం పలుకుతారేమో. తాము నాటిన మొక్కను దశదిశలా వ్యాపింపజేసినందుకు ఆయన్ను అభినందిస్తారేమో. ‘నేను గర్వపడేలా చేశావు’ అని జంషెట్జీ చెబుతుండగా, జేఆర్డీ మురిసిపోతున్నట్లుగా ఉన్న ఓ కార్టూన్‌ అభిమానుల మనసుల్ని తాకుతోంది. టాటా గ్రూప్‌నకు జంషెట్జీ వ్యవస్థాపకుడు కాగా సంస్థను జేఆర్డీ కొత్త పుంతలు తొక్కించారు.

News October 11, 2024

ఆమె ఖాతాలో రూ.999 కోట్లు జమ.. చివరికి ఏమైందంటే?

image

బెంగళూరులో ఓ కాఫీ షాప్ ఓనర్ ప్రభాకర్ భార్య సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలోకి ఏకంగా రూ.999 కోట్లు జమ అయ్యాయి. దీంతో వారు ఆశ్చర్యంలో పడిపోయారు. అయితే 48 గంటల్లోనే అకౌంట్ అంతా ఖాళీ అవడమే కాకుండా ఫ్రీజ్ అయ్యింది. ఈ క్రమంలో అతను సాధారణ లావాదేవీలు చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నా స్పందించడం లేదని వాపోయాడు.

News October 10, 2024

రోహిత్ శర్మ అభిమానులకు బ్యాడ్ న్యూస్!

image

ఆస్ట్రేలియాతో నవంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే సిరీస్‌లో ఓ టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాల వల్ల తొలి 2 మ్యాచుల్లో ఒకటి ఆడకపోవచ్చని రోహిత్ ఇప్పటికే బీసీసీఐకి సమాచారం ఇచ్చినట్లు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పేర్కొంది. సిరీస్ ప్రారంభానికి ముందే తన పనులు పూర్తయితే అన్ని టెస్టులు ఆడే అవకాశం ఉంది. రోహిత్ దూరమైతే అభిమన్యు ఈశ్వరన్ ఆడే అవకాశం ఉందని సమాచారం.

News October 10, 2024

భారీగా ‘సిప్’ చేస్తున్నారు.. సెప్టెంబర్‌లో రికార్డు

image

దేశంలో మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డులు పెరుగుతున్నాయి. మొద‌టిసారిగా ఒక నెల‌లో ₹ 24,508.73 కోట్లకు పెట్టుబ‌డులు చేరుకున్న‌ట్టు AMFI వెల్ల‌డించింది. ఆగ‌స్టు నెల‌లో న‌మోదైన ₹23,547.34 కోట్లతో పోలిస్తే ఇది 4% అధికం. సెప్టెంబ‌ర్‌లో 66,38,857 కొత్త సిప్‌లు న‌మోద‌య్యాయి. AUMలు గరిష్ఠ స్థాయి ₹13.81 లక్షల కోట్లకు చేరుకున్నాయి. మొత్తం SIP ఖాతాల సంఖ్య ఆగస్టులో 9.61 కోట్ల నుంచి 9.8 కోట్ల‌కు చేరుకుంది.