India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భారత టెస్టు జట్టులో రవిచంద్రన్ అశ్విన్ వారసుడిగా వాషింగ్టన్ సుందర్‌ను అప్పుడే భావించకూడదని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. ‘న్యూజిలాండ్ టెస్టులో సుందర్ 10 వికెట్లు తీశారు. కానీ ఇది కేవలం ఒక మ్యాచ్ మాత్రమే. అశ్విన్‌కు తనే వారసుడినని నిరూపించుకోవడానికి అతడు మరెన్నో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేయాల్సి ఉంటుంది. అశ్విన్‌ను భర్తీ చేయడం అంత సులువు కాదు’ అని స్పష్టం చేశారు.

మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఫొటోను ట్విటర్‌లో అప్‌లోడ్ చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. యూపీలోని నోయిడాలో ఈ ఘటన జరిగింది. సెక్టార్-9కి చెందిన రిహాన్ అనే వ్యక్తి ఇబ్రహీం ఫొటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకున్నాడని ఫేజ్-1 పోలీసులు తెలిపారు. అతడిపై 196(1)(B) సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేశామని వెల్లడించారు. భారత్‌లో బాంబు దాడుల ద్వారా ఎంతోమంది అమాయకులు చనిపోవడం వెనుక దావూద్ సూత్రధారి.

AP: హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫైర్ అయ్యారు. దేవాలయాలు జోలికి వస్తే ఊరుకోమని హెచ్చరించారు. విజయవాడలో గోశాలను కూల్చివేయడం హిందూ ధర్మానికి వ్యతిరేకం అని మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని రక్షిస్తామనే వారు దీనికి సమాధానం చెప్పాలన్నారు. గతంలో పుష్కరాల సమయంలోనూ చంద్రబాబు అనేక దేవాలయాలను కూల్చివేయించారని దుయ్యబట్టారు.

TG: నవంబర్ చివరి నాటికి క్రీడా వర్సిటీ బిల్లును రూపొందించాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పది రోజుల్లో గవర్నింగ్ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలకు క్యాలెండర్ ఉండాలని చెప్పారు. వివిధ దేశాల క్రీడా విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు.

వెయ్యి అని చెప్పడానికి బదులు K అన్న అక్షరం వాడటం నేడు సర్వ సాధారణంగా మారింది. ఉదాహరణకు 5వేలకు 5K అని అంటుంటాం. ఇది గ్రీకు పదం ‘Chilioi’ నుంచి వచ్చింది. చదివేందుకు ‘చిలివోయ్’లా కనిపిస్తున్నా దాన్ని కిలివోయ్‌గా పిలుస్తారు. ఆ కిలివోయ్ నుంచే కిలో అన్న పదం పుట్టింది. కిలోగ్రామ్ అంటే వెయ్యి గ్రాములు, కిలోమీటర్ అంటే వెయ్యి మీటర్లు అన్నట్లుగా వెయ్యి అంకెకు ‘K’ని షార్ట్‌కట్‌లా వ్యవహరించడం మొదలైంది.

Oxford Universityలో ఇంగ్లిష్‌లో PhD చేస్తున్న TNకు చెందిన లక్ష్మీ బాలకృష్ణన్‌కు నిరాశే మిగిలిందే. PhD కోసం ₹కోటి వరకు ఫీజు చెల్లించిన యువతి నాలుగో ఏడాదిలో షేక్‌స్పియర్‌పై చేసిన రీసెర్చ్ PhDకి తగ్గ స్థాయిలో లేదని చెప్పి వర్సటీ ఆమెను బలవంతంగా మాస్టర్స్‌కు బదిలీ చేసింది. రీసెర్చ్ ఆశించిన స్థాయిలో ఉండాలని, అందరూ దాన్ని సాధించలేరని వర్సిటీ పేర్కొంది. మోసపోయానని లక్ష్మీ ఆవేదన చెందింది.

1965: సింగర్ నాగుర్ బాబు(మనో) జననం
1974: నటి రవీనా టాండన్ జననం
1985: హీరోయిన్ ఆసిన్ జననం
1991: హీరోయిన్ అమలాపాల్ జననం
1986: డైరెక్టర్ శైలేష్ కొలను జననం
1955: హిందుస్తానీ సంగీత విద్వాంసుడు డి.వి.పలుస్కర్ మరణం
✱గృహ హింస చట్టం అమల్లోకి వచ్చిన రోజు

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో పాకిస్థాన్ క్రికెటర్ సాజిద్ ఖాన్ పోరాటం అందరినీ ఆకట్టుకుంది. జట్టు 177/7తో కష్టాల్లో ఉన్నప్పుడు బంతి తగిలి రక్తం కారుతున్నా వన్డే తరహాలో బ్యాటింగ్ చేశారు. 48 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేశారు. అటు బౌలింగ్‌లోనూ తొలి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో ఓ వికెట్ పడగొట్టారు. పాక్ అభిమానులు సాజిద్‌ను పోరాట యోధుడు అంటూ కొనియాడుతున్నారు.

తేది: అక్టోబర్ 26, శనివారం
ఫజర్: తెల్లవారుజామున 4:59 గంటలకు సూర్యోదయం: ఉదయం 6:12 గంటలకు జొహర్: మధ్యాహ్నం 12:00 గంటలకు అసర్: సాయంత్రం 4:11 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5:47 గంటలకు
ఇష: రాత్రి 7.01 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

ఓ అరటి పండును ప్లాస్టర్‌తో గోడమీద అంటించారు. దాని విలువ రూ.10 కోట్లకు పైమాటే. ఇటలీ ఆర్టిస్ట్ మౌరీజియో కాట్టెలన్ 2019లో ఈ ‘కళాఖండాన్ని’ రూపొందించారు. సోత్‌బై వేలం సంస్థ వచ్చే నెల 20న న్యూయార్క్‌లో దీన్ని వేలం వేయనుంది. రూ.10 కోట్లకు పైగానే అమ్ముడవుతుందని ఆ సంస్థ అంచనా వేస్తోంది. గెలుచుకున్న వారికి ఒక అరటిపండు, ఒక ప్లాస్టర్, సర్టిఫికెట్ ఇస్తారు. ఇదో రకం కళాపోషణ కాబోలు!
Sorry, no posts matched your criteria.