India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కలగంటున్న ఇద్దరు వ్యక్తులకు సమాచారాన్ని పంపడంలో కాలిఫోర్నియా సైంటిస్టులు విజయం సాధించారు. ‘డెయిలీ మెయిల్’ కథనం ప్రకారం.. నిద్రపోవడానికి ముందు ఇద్దరు అభ్యర్థులకు బ్రెయిన్‌ను పర్యవేక్షించే పరికరాల్ని పరిశోధకులు అమర్చారు. యంత్రం ద్వారా ఓ పదాన్ని వారికి పంపించగా, నిద్రలోనే పైకి పలికారని వివరించారు. ఇది మానసిక అనారోగ్యాల చికిత్సలో మున్ముందు కీలకంగా మారొచ్చని సైంటిస్టులు పేర్కొన్నారు.

శబరిమల వెళ్లే భక్తులకు కేరళ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోని భక్తులు కూడా అయ్యప్పను దర్శనం చేసుకోవచ్చని పినరయి విజయన్ సర్కార్ ప్రకటించింది. వర్చువల్ బుకింగ్‌పై విపక్షాలు, భక్తుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో విజయన్ దీనిపై అసెంబ్లీలో ప్రకటన చేశారు. రిజిస్ట్రేషన్ లేకుండా నేరుగా వచ్చిన వారికి కూడా దర్శన సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్‌ను ఆ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోదని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా జోస్యం చెప్పారు. అతడిపై రూ.18 కోట్లు వెచ్చించేందుకు ఆ జట్టు సిద్ధంగా లేదని చెప్పారు. ‘కమిన్స్‌తోపాటు మార్క్‌రమ్, ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్‌ను కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డిని మాత్రం కచ్చితంగా రిటైన్ చేసుకుంటుంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

నందమూరి బాలకృష్ణ, తమిళ నటుడు సూర్య కలిసి ఒకే వేదికపైకి వచ్చే అవకాశం ఉంది. సూర్య నటించిన కంగువ మూవీ రిలీజ్‌కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దాని ప్రమోషన్ల కోసం బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ షోకి సూర్య రానున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చేవారం దీనికి సంబంధించిన ఎపిసోడ్స్ చిత్రీకరిస్తారని సమాచారం. కంగువ వచ్చే నెల 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

AP: అమెరికాలోని రాండాల్ఫ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ముగ్గురు కారులో వెళ్తుండగా సౌత్ బాన్‌హాన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వీరితోపాటు మరో ఇద్దరు భారతీయులు కూడా మరణించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇరాన్ అణు, చమురు క్షేత్రాలపై దాడి చేయబోమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హామీ ఇచ్చారని అమెరికా తెలిపింది. అలాగే గాజాలో పౌరులకు మానవతా సాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు యూఎస్ తెలిపింది. లేదంటే సైనిక సహాయంలో కోత తప్పదని హెచ్చరించింది. ఇందుకు నెల గడువు ఇస్తున్నట్లు తెలిపింది. సాయంలో పురోగతి కనిపించకుంటే సైనిక సాయంలో కోత తప్పదని స్పష్టం చేసింది.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. నవంబర్ 20న బుధవారం పోలింగ్ జరగనుంది. కాగా బుధవారమే పోలింగ్ జరపడం వెనుక పెద్ద కారణమే ఉందని సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ‘పోలింగ్ కోసం మేం కావాలనే ఆ రోజును ఎంచుకున్నాం. వారం మధ్యలో బుధవారం పోలింగ్ పెడితే పట్టణ ఓటర్లు అధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకుంటారు. అదే వీకెండ్‌లో పెడితే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు’ అని ఆయన చెప్పారు.

RCB టీమ్‌ను, అభిమానుల్ని భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసించారు. ఆ జట్టు అభిమానులు అత్యంత విశ్వాసం కలిగినవాళ్లని పేర్కొన్నారు. ‘ఆర్సీబీ ఫ్యాన్స్‌కు విరాట్ అంటే ప్రాణం. సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతున్నప్పుడు వాళ్లు నిరాశకు లోనవుతుంటారు. అయినా మద్దతును మాత్రం ఆపరు. RCBకి వారి ఫ్యాన్స్ దేవుడిచ్చిన వరం. గడచిన పదేళ్లలో అత్యంత స్థిరంగా ఆడుతున్న జట్టు ఆర్సీబీయే’ అని కొనియాడారు.

1916: నటుడు, క్రీడాకారుడు దండమూడి రాజగోపాలరావు జననం
1948: నటి, రాజకీయ నాయకురాలు హేమా మాలిని జననం
1958: రచయిత తెన్నేటి సూరి మరణం
1975: సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాక్వెస్ కల్లిస్ జననం
1985: భారతదేశంలో జాతీయ భద్రతా దళం (NSG) ఏర్పాటు
1990: నెల్సన్ మండేలాకు భారతరత్న పురస్కారం
1990: మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ జననం
ప్రపంచ ఆహార దినోత్సవం

టాటా మోటార్స్ మరో ఘనత సాధించింది. ఆ సంస్థ లేటెస్ట్ కార్ ‘కర్వ్’కు BNCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ దక్కింది. భద్రత విషయంలో కార్లలో ఈ రేటింగ్‌నే అత్యుత్తమంగా చెబుతారు. పెద్దల రక్షణలో 29.50/32, పిల్లల రక్షణలో 43.66/49 స్కోర్లు సాధించింది. కర్వ్‌లో బేసిక్ వేరియెంట్ నుంచీ 6 ఎయిర్‌బ్యాగ్స్ ఇస్తుండటం విశేషం. ప్రయాణికుల భద్రత విషయంలో టాటా కార్లకు మంచి పేరున్న సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.