India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జియో భారత్ 4G ఫోన్ ధర రూ.999 నుంచి రూ.699కి తగ్గింది. ఈ ధర దీపావళి సందర్భంగా మాత్రమే అందుబాటులో ఉంటుందని జియో తెలిపింది. ఇక ఈ ఫోన్‌లో వాడే నెలవారీ రీఛార్జ్ ప్లాన్ ఇతర సంస్థల బేసిక్ ప్లాన్ కంటే రూ.76 తక్కువ ధరతో రూ.123 మాత్రమే అని వెల్లడించింది. ఈ రకంగా వినియోగదారులు 9 నెలల్లో ఫోన్ కోసం చెల్లించిన ధరను తిరిగి పొందవచవ్చని పేర్కొంది. ఇందులో అన్ని డిజిటల్ సేవలను జియో అందిస్తోంది.

ఖలిస్థానీ వేర్పాటువాది నిజ్జర్ డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలన్న NIA విజ్ఞప్తిపై కెనడా కాలయాపన చేస్తోంది! కెనడా పౌరుడి డెత్ సర్టిఫికెట్ మీకెందుకు అంటూ కౌంటర్ ప్రశ్నలు వేస్తోంది. నిజ్జర్‌పై 9 కేసుల్లో NIA దర్యాప్తు చేస్తోంది. న్యాయపరమైన అవసరాల నిమిత్తం నిజ్జర్ మృతిపై కోర్టులకు సమాచారం ఇవ్వాల్సి ఉందని ఎన్ఐఏ బదులిచ్చినట్టు తెలుస్తోంది. నిజ్జర్ హత్య కేసులో దౌత్య వివాదం ఇంకా కొనసాగుతోంది.

TG: హైడ్రా కూల్చిన తర్వాత భవన వ్యర్థాలను తొలగించే బాధ్యత సంబంధిత బిల్డర్లదేనని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు. వాటిని తొలగించని వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ‘ప్రభుత్వ అనుమతులు ఉన్న భవనాలను ఎట్టి పరిస్థితుల్లో కూల్చం. సర్వే నంబర్లు మార్చి, తప్పుడు సమాచారంతో అనుమతులు పొంది చెరువులు, నాలాల్లో చేపట్టిన నిర్మాణాలనే కూల్చుతాం. దీనిపై ఎవరూ ఆందోళన చెందొద్దు’ అని ఆయన పేర్కొన్నారు.

TG: హైదరాబాద్‌లో మెట్రో రైల్ మార్గం విస్తరణకు రాష్ట్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాగోల్ నుంచి ఎల్బీ నగర్, LB నగర్ నుంచి హయత్ నగర్, ఎల్బీ నగర్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు విస్తరించేందుకు ఆమోదం తెలిపింది.

AP: PCC చీఫ్ షర్మిల దిగజారి ప్రవర్తిస్తున్నారని YCP నేత గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఆమె చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘మేం నిజాలను బయటపెడుతుంటే షర్మిల ఉలిక్కిపడుతున్నారు. సొంత అన్న గురించి ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. సైకో, శాడిస్ట్ అంటూ జగన్ పతనాన్ని కోరుకుంటున్నారు. ఆయనపై ఇలానే మాట్లాడితే వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎవరూ ఊరుకోరు’ అని ఆయన హెచ్చరించారు.

వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ జడేజా, రుతురాజ్, పతిరణ, ధోనీని రిటెయిన్ చేసుకోవచ్చని క్రిక్‌బజ్ వెబ్‌సైట్ తెలిపింది. వీరిలో జడేజా తొలి రిటెన్షన్‌గా, రుతురాజ్ రెండు, పతిరణ మూడో రిటెన్షన్లుగా ఉంటారని అంచనా వేసింది. ధోనీని అన్‌క్యాప్డ్ ఆటగాడిగా తీసుకోనుందని క్రిక్‌బజ్ స్పష్టం చేసింది. రుతురాజ్‌నే కెప్టెన్‌గా కొనసాగించే అవకాశముందని చెప్పింది.

తూర్పు లద్దాక్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ ఉపసంహరణ విషయంలో చైనా, భారత్ మధ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. రెండు అంశాలు ఆ ఒప్పందం కుదరడంలో కీలక పాత్ర పోషించాయని ఆయన తెలిపారు. ‘మన సైన్యం అత్యంత కష్టమైన పరిస్థితుల్లోనూ పట్టుదలతో నిలబడింది. ఒప్పందం వెనుక భారత సైన్యమే తొలి కారణం. ఇక సరిహద్దు వెంబడి దశాబ్దకాలంగా మనం అభివృద్ధి చేసుకున్న మౌలిక వసతులు రెండో కారణం’ అని వివరించారు.

మహారాష్ట్రలోని కొంకణ్ తీర ప్రాంతంలో 75 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఒక్కో దశలో ఒక్కో పార్టీ తన ప్రాభవాన్ని చాటిన ఈ ప్రాంతంలో ఇప్పుడు 2 కూటములు, 6 పార్టీలు ఉనికి కోసం పోటీ పడుతున్నాయి. ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోట ఇప్పుడు పార్టీల చీలికలతో బీజేపీ, శివసేన, NCPల గుప్పెట్లో ఉంది. అయితే, కాంగ్రెస్‌తో కలసి గత వైభవాన్ని చాటేందుకు ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

TG: ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర తేదీలు ఖరారయ్యాయి. 2025 ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు 4 రోజుల పాటు ఈ వేడుక జరగనుంది. మినీ మేడారం జాతరకు సైతం భక్తులు భారీగా తరలివస్తారు. గద్దెల వద్ద పొర్లుదండాలు పెడతారు. సారె చీరలు, బంగారం (బెల్లం) సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. అయితే పెద్ద జాతరలా అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురారు.

మూగ జీవాల రక్షణ కోసం సొంత ఎన్జీవోను రిజిస్టర్ చేయించినట్లు రేణూదేశాయ్ తెలిపారు. ఆర్థిక సాయం చేయాలనుకునే వారు ముందుకు రావాలని వీడియోలో వెల్లడించారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాలో తన ఫాలోవర్స్‌తో పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. చిన్నతనం నుంచి మూగజీవాల సంరక్షణ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. ఈ క్రమంలో వాటి కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఎన్జీవోను ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.