India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అయ్యప్ప మాలధారణలో ‘నేను’ అనే భావం ఉండదు. పేర్లు, వస్త్రాలు, దినచర్య.. వీటన్నింటినీ వదిలి దైవారాధనలో భాగమవుతారు. దీక్ష స్వీకరించాక తన వ్యక్తిత్వాన్ని విడిచి, అంతర్లీనంగా దైవ స్వరూపంగా మారతారు. జీవులందరిలోనూ దేవుడు ఉన్నాడనే భావనతో.. ఆ వ్యక్తిని ప్రత్యేకించి కాక, పరమాత్మ అంశగా చూస్తారు. అందుకే అయ్యప్ప ప్రతిరూపంగా వారిని ‘స్వామి’ అని పిలుస్తారు. ఇది ప్రతి భక్తుడిని భగవంతునిగా గౌరవించే గొప్ప ఆచారం.

రాజస్థాన్ పిలానీలోని CSIR-సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (<

నవంబర్ వచ్చిందంటే చాలు.. పలువురు యువకులు గడ్డం తీసేయడానికి ఒప్పుకోరు. గడ్డం ఎందుకు పెంచుకుంటున్నావ్ అని అడిగితే.. ‘నో షేవ్ నవంబర్’ అనేస్తారు. ఈ నెలలో షేవింగ్ చేయకుండా గడ్డం పెంచి, దానికయ్యే ఖర్చును క్యాన్సర్ బాధితుల చికిత్స కోసం విరాళంగా ఇస్తారు. క్యాన్సర్‌పై అవగాహన పెంచడం, బాధితుల కోసం నిధులు సేకరించడమే ఈ ఉద్యమం ముఖ్య ఉద్దేశం. 2009 నుంచి ‘నో షేవ్ నవంబర్’ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది.

భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై IPL ఛైర్మన్ అరుణ్ ధుమాల్ ప్రశంసలు కురిపించారు. వాళ్లిద్దరూ గొప్ప ఆటగాళ్లని అన్నారు. ‘రోహిత్, కోహ్లీ వెళ్లిపోతారని అందరూ అనుకుంటున్నారు. కానీ ఎక్కడికీ వెళ్లరు. 50ఓవర్ల ఫార్మాట్ ఆడతారు’ అని అన్నారు. క్రికెట్ కోసం వారు జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. వైభవ్ సూర్యవంశీ వంటి వారితో టీమ్ ఇండియా బెంచ్ బలంగా ఉందన్నారు.

నేడు కార్తీక శుక్ల ఏకాదశి. దీనినే ఉత్థాన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజునే శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల యోగ నిద్ర నుంచి మేల్కొంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో చాతుర్మాసం ముగిసి నేటి నుంచి పెళ్లిళ్లు సహా అన్ని రకాల శుభకార్యాలు తిరిగి ప్రారంభమవుతాయి. భక్తులు ఉపవాస దీక్షతో విష్ణుమూర్తిని పూజిస్తూ, సాయంత్రం తులసి వివాహం నిర్వహిస్తారు. ఈ ఏకాదశి సర్వపాపాలను తొలగిస్తుందని నమ్మకం.

బిహార్ ఎన్నికల్లో తాము 10 కన్నా తక్కువ లేదా 150 కన్నా ఎక్కువ సీట్లు సాధిస్తామని జన్ సురాజ్ పార్టీ ఫౌండర్ ప్రశాంత్ కిశోర్ అన్నారు. ‘రాష్ట్ర ప్రజలు మా పార్టీని ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. ఎన్డీయేకు, ప్రతిపక్ష కూటమికి ఓటు వేయాలని వారు అనుకోవట్లేదు. 160-170 సీట్లలో ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఎన్నికలకు ముందు, తర్వాత ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని స్పష్టంచేశారు.

* జిడ్డు పట్టిన గ్యాస్ లైటర్‌కు నిమ్మకాయ ముక్కను, బేకింగ్ సోడాలో అద్ది లైటర్‌పై రాసి మళ్ళీ క్లాత్‌తో తుడిస్తే గ్యాస్ లైటర్ మెరిసిపోతుంది.
* నెయిల్ పాలిష్ క్లీనర్‌తో తుడిస్తే ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డులపై మరకలు పోతాయి.
* ఒక కప్పు వేడి నీటిలో 2 చెంచాల వెనిగర్ వేసి బాగా కలిపి, వాషింగ్ మెషీన్ మరకలపై స్ప్రే చేసి కాసేపు అలాగే ఉంచాలి. తర్వాత క్లీనింగ్ బ్రష్‌తో శుభ్రం చేస్తే మరకలు ఈజీగా తొలగిపోతాయి.

AP: విశాఖలో డిగ్రీ స్టూడెంట్ సాయితేజ్(21) <<18165774>>ఆత్మహత్య<<>> కేసులో వాట్సాప్ చాట్ బయటికొచ్చింది. మహిళా లెక్చరర్ పదేపదే అతడికి మెసేజ్‌లు చేస్తూ రిప్లై ఇవ్వడం లేదెందుకని నిలదీసింది. ‘నా మీద జాలి వేయదారా? శైలు చనిపోయినప్పుడు వెళ్లావ్ కదా.. నేను చనిపోతే వస్తావా?’ అంటూ బెదిరింపులకు దిగింది. ‘నువ్వు పిరికి’ అంటూ హేళన చేసింది. ఈ వేధింపులతోనే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని పేరెంట్స్ ఆరోపించారు.

సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి హైదరాబాద్ శంషాబాద్‌కు రావాల్సిన ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఫ్లైట్‌ను వెంటనే ముంబై ఎయిర్‌పోర్టుకు మళ్లించారు.

TG: ఆరు రాష్ట్రాల్లో వేర్వేరుగా అమలవుతున్న టెన్త్, ఇంటర్ బోర్డులను విలీనం చేయాలని కేంద్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ కోరారు. HYDలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. AP, TG, కేరళ, WB, ఒడిశా, మణిపుర్లో పది, ఇంటర్లకు వేర్వేరు బోర్డులున్నాయని, వీటితో గందరగోళం ఏర్పడుతోందన్నారు. CBSE, ICSE బోర్డుల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు జాతీయ పరీక్షల్లో అర్హత సాధిస్తున్నారని గుర్తు చేశారు.
Sorry, no posts matched your criteria.