India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ ఢిల్లీని వీడేందుకు బలమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. కోచ్‌గా పాంటింగ్, డైరెక్టర్‌గా గంగూలీని తప్పించడంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అలాగే హేమాంగ్ బదానీని హెడ్ కోచ్‌గా, వేణుగోపాల్ రావును డైరెక్టర్‌గా నియమించడమూ ఇష్టం లేదట. అలాగే GMR ఆధ్వర్యంలో ఆయన ఆడేందుకు సిద్ధంగా లేడని తెలుస్తోంది. JSW ఆధ్వర్యంలోనే ఆయన ఆడాలని అనుకున్నట్లు వార్తలు వచ్చాయి.

✒ తేది: నవంబర్ 3, ఆదివారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5:02 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6:15 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12:00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4:08 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5:44 గంటలకు
✒ ఇష: రాత్రి 6.58 గంటలకు
✒ నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

✒ తేది: నవంబర్ 3, ఆదివారం
✒ శు.విదియ: రాత్రి 10.25 గంటలకు
✒ అనురాధ పూర్తి
✒ వర్జ్యం: ఉదయం 10.19- మధ్యాహ్నం 12.03 గంటల వరకు
✒ దుర్ముహూర్తం: సాయంత్ర 4.03-4.49 గంటల వరకు

☞ రిషికొండలోకి అందరినీ అనుమతిస్తాం: CM చంద్రబాబు
☞ 10 పాలసీలతో రాష్ట్ర భవిష్యత్తు మార్చేలా ప్రణాళికలు: సీఎం CBN
☞ మీ పాలనలో ఇంకెంత మంది బాలికలు బలవ్వాలి పవన్ కళ్యాణ్: YCP
☞ మా పాలనలో తెలంగాణ సూర్యుడిలా ఉదయిస్తోంది: రేవంత్
☞ సంక్రాంతిలోపు సర్పంచ్ ఎన్నికలు: పొంగులేటి
☞ HYDలో రెండో దశ మెట్రో నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
☞ INDvsNZ: 143 రన్స్ లీడ్‌లో NZ

వెస్పా జాతి కందిరీగలకు ఉన్న ఇథనాల్(ఆల్కహాల్ కాంపోనెంట్) డిటాక్సిఫికేషన్ పవర్ ప్రపంచంలో మరే జంతువులకీ లేదని సైంటిస్టులు తెలిపారు. ఇథనాల్ అధికంగా ఉన్న తాటి పువ్వుల నుంచి ఇవి మకరందాన్ని సేవిస్తాయి. అయినప్పటికీ వాటి జీవితకాలం, జీవక్రియలపై ఇథనాల్ ఎలాంటి ప్రభావం చూపడం లేదని గుర్తించారు. ఈ కందిరీగల్లో ఇథనాల్‌ను అత్యంత వేగంగా మెటబాలిజింగ్ చేసే శక్తి ఉండటంతో వాటికి డిటాక్సిఫికేషన్ పవర్ అందుతోందన్నారు.

వినియోగించడానికి సౌకర్యంగా ఉన్నా వంట కోసం నాన్-స్టిక్ పాత్రలు వాడొద్దని నిపుణులు చెబుతున్నారు. వీటి వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. నాన్-స్టిక్ పాత్రల్లోని ఆహారం తినడం వల్ల శరీరంలో టెప్లాన్ పరిమాణం పెరిగి వంద్యత్వం, గుండె జబ్బులు వస్తాయి. ఈ పాత్రల్లోని ఫుడ్ తింటే ఐరన్ లోపంతోపాటు శ్వాసకోస సమస్యలు, థైరాయిడ్ వంటి రోగాలు వస్తాయి. మట్టి కుండల్లో ఆహారం వండుకుని తినడం మంచిది.

TG: ఈనెల 5 నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 15 రోజుల్లో గ్రామ కమిటీల ద్వారా ఎంపిక పూర్తి చేస్తామన్నారు. ఇళ్ల నిర్మాణంలో ఎటువంటి డిజైన్లు ఉండవని, లబ్ధిదారుల ఇష్టం మేరకు నిర్మించుకోవచ్చన్నారు. కనీసం 400 చ.అడుగులకు తగ్గకుండా ఇల్లు నిర్మించుకోవాలని, తప్పనిసరిగా కిచెన్, బాత్రూం ఉండాలని మీడియా చిట్ చాట్‌లో పేర్కొన్నారు.

టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సూపర్ రికార్డు నెలకొల్పారు. ప్రస్తుత WTCలో 50 వికెట్లు పూర్తి చేసుకున్న రెండో భారత బౌలర్‌గా రికార్డులకెక్కారు. రవిచంద్రన్ అశ్విన్ తర్వాత ఈ ఫీట్ సాధించిన ప్లేయర్‌గా ఘనత వహించారు. అశ్విన్ ఈ WTCలో 62 వికెట్లు పడగొట్టారు. కాగా జడేజా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే.

AP: విశాఖ నగర అభివృద్ధిపై కలెక్టరేట్‌లో CM చంద్రబాబు రివ్యూ చేశారు. నగరంలో పర్యాటక అభివృద్ధికి పెద్దపీట వేయాలని అధికారులను ఆదేశించారు. విజయనగరం, నెల్లిమర్ల, భోగాపురం, అనకాపల్లి ప్రాంతాలను విశాఖకు అనుసంధానం చేస్తూ ORR నిర్మించేలా ప్లాన్ చేయాలని సూచించారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు అనుసంధానించేలా రోడ్ల నిర్మాణం ఉండాలని వెల్లడించారు. 2047 విజన్ డాక్యుమెంట్ ప్రకారం 15% వృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు.
Sorry, no posts matched your criteria.