India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

MH ఎన్నికల వేళ CM పదవిపై Dy cm దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహాయుతి కూటమి గెలిస్తే ‘మ్యూజికల్ ఛైర్’ లాంటిది ఉండదన్నారు. మిత్రపక్షాలన్నీ కలిసి CMను నిర్ణయిస్తాయని స్పష్టం చేశారు. ఏక్‌నాథ్ షిండే సహా కూటమిలోని ఏ నాయకుడూ ఆ పదవిని డిమాండ్ చేయలేడని, నిర్ణయం న్యాయంగా ఉంటుందని అంతా విశ్వసిస్తున్నట్లు చెప్పారు. కాగా మహాయుతి మరోసారి అధికారంలోకి వస్తే ఫడ్నవీసే CM అవుతారని ప్రచారం జరుగుతోంది.

ఆడవాళ్లతో కలిసి గంటల తరబడి షాపింగ్ అంటే మగవాళ్లు ఓ అడుగు వెనకే ఉంటారు. UKకు చెందిన క్విడ్‌కో అధ్యయనం ప్రకారం మగవాళ్లు 26 నిమిషాల్లో షాపింగ్‌పై ఆసక్తి కోల్పోతారు. నలుగురిలో ఒకరు తమ భాగస్వాములను మధ్యలోనే వదిలేస్తారు. బిజీ స్టోర్‌లు, ఆకలి, స్పోర్ట్స్ మిస్ అవడం వల్ల పురుషులు షాపింగ్ టైమ్‌లో అసహనానికి గురవుతారు. దీంతో సగం మంది పార్ట్‌నర్‌తో వాగ్వాదానికి దిగినట్లు అంగీకరించారు. మరి దీనిపై మీరేమంటారు?

అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లున్నాయి. అందులో 270 ఓట్లు సాధించినవారు అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తారు. ‘విన్నర్ టేక్స్ ఆల్’ విధానం ప్రకారం ఒక రాష్ట్రంలోని మెజార్టీ ఓట్లు సాధించిన అభ్యర్థి పార్టీకే అక్కడి మొత్తం ఓట్లు లభిస్తాయి. దీంతో పలు రాష్ట్రాల్లో ట్రంప్, కమల మెజార్టీ దక్కించుకోవడం ఖాయంగా మారింది. అయితే స్వింగ్ స్టేట్స్(అటూ, ఇటుగా ఉండే)గా పిలవబడే రాష్ట్రాలే అధ్యక్షుడిని డిసైడ్ చేయనున్నాయి.

సైలెంట్‌గా వచ్చి యూత్‌ని బాగా ఎంటర్‌టైన్ చేసిన ‘ఈ నగరానికి ఏమైంది’కి సీక్వెల్ రాబోతోంది. త్వరలోనే ‘ఈ నగరానికి ఏమైంది2’ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను కూడా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తెరకెక్కించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

పార్టీ చేసుకున్నాక ఖర్చు షేర్ చేసుకోవడం కామన్. ఆ లెక్కల్లో తేడాలు వస్తే పెద్ద దుమారమే రేగుతుంది. MPలోని జబల్‌పూర్‌లో అదే జరిగింది. మనోజ్(26) తన మేనల్లుడు ధరమ్ ఠాకూర్(19) డియోరీ తపారియా అనే గ్రామంలో మందు, చికెన్‌తో పార్టీ చేసుకున్నారు. మందుకు ₹340, చికెన్‌కు ₹60 అయ్యింది. పార్టీ అయ్యాక ‘నువ్వు తక్కువ డబ్బు ఇచ్చావు’ అని మనోజ్ అనడంతో గొడవ మొదలైంది. కోపంతో ధరమ్ మేనమామ మనోజ్‌ను కర్రతో కొట్టి చంపాడు.

* 1877: సంస్కృతాంధ్ర పండితులు పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి జననం
* 1920: ఇండియన్ ‘రెడ్‌క్రాస్’ ఏర్పడింది
* 1925: కవి, రచయిత ఆలూరి బైరాగి జననం
* 1987: మహాకవి దాశరథి కృష్ణమాచార్య మరణం
* 1988: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పుట్టినరోజు(ఫొటోలో)
* 2019: నటుడు, దర్శకుడు కర్నాటి లక్ష్మీనరసయ్య మరణం

US అధ్యక్ష ఎన్నికలు ఇవాళ జరగనున్నాయి. భారత సంతతికి చెందిన కమలా హారిస్ డెమోక్రాటిక్ అభ్యర్థిగా బరిలో నిలిచిన విషయం తెలిసిందే. దీంతో ఆమె పూర్వీకుల గ్రామమైన TNలోని తులసేంద్రపురం ఆలయంలో స్థానికులు ప్రత్యేక పూజలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఆలయం వద్ద ‘ది డాటర్ ఆఫ్ ది ల్యాండ్’ అంటూ బ్యానర్ ఏర్పాటు చేశారు. కమలా హారిస్ తాత పీవీ గోపాలన్ ఇదే గ్రామంలో జన్మించారు.

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

* సోషల్ మీడియాలో సోదరితో ఫొటోను అప్‌లోడ్ చేస్తే ఆమె మీ సోదరి అని క్యాప్షన్‌లో రాయాలి.
* ఇంటిముందు చెప్పులు తలకిందులుగా ఉంటే మనం ఎంత బిజీగా ఉన్నా వాటిని సరిచేయాలి.
* నాన్న గదిలోకి రాగానే ఫోన్‌ను దాచిపెట్టి, ఫోన్ వాడనట్లు నటించాలి.
* మీరు ఎవరితో చాటింగ్ చేస్తున్నా నవ్వు ఆపుకోవాలి.
* మెట్రో, రైల్వే స్టేషన్ నుంచి బయటకు రాగానే ఆటో రిక్షాలను చూడనట్లు నటించాలి.

✒ తేది: నవంబర్ 5, మంగళవారం ✒ ఫజర్: తెల్లవారుజామున 5:02 గంటలకు ✒ సూర్యోదయం: ఉదయం 6:16 గంటలకు ✒ దుహర్: మధ్యాహ్నం 12:00 గంటలకు ✒ అసర్: సాయంత్రం 4:07 గంటలకు ✒ మఘ్రిబ్: సాయంత్రం 5:43 గంటలకు ✒ ఇష: రాత్రి 6.57 గంటలకు ✒ నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Sorry, no posts matched your criteria.