News November 9, 2024

APAAR ఎందుకు కీలకం?

image

కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థుల అకడమిక్ సమాచారాన్ని నిక్షిప్తం చేసేందుకు కేంద్రం APAARను తీసుకొచ్చింది. ఈ కార్డులో విద్యార్థి పేరు, బర్త్‌డే, ఫొటో, క్యూఆర్ కోడ్, 12 అంకెలతో గుర్తింపు నంబర్ ఉంటుంది. స్టూడెంట్ హిస్టరీ మొత్తం ఇందులో ఉండటం వల్ల దేశంలో ఎక్కడ చదవడానికైనా ఇబ్బంది ఉండదు. ఆధార్ తరహాలో ఈ కార్డు శాశ్వతంగా ఉంటుంది. అందుకే పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని కేంద్రం ఆదేశించింది.

News November 9, 2024

నాటోను బలపరిచాం, భారత్‌కు దగ్గరయ్యాం: US డిఫెన్స్ సెక్రటరీ

image

జోబైడెన్‌ పాలనలో భారత్‌తో అమెరికా బంధం మరింత విస్తరించిందని US డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ అన్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టామని తెలిపారు. జపాన్‌కు తలుపు తట్టామని, డిఫెన్స్ రంగంలో వారి పెట్టుబడులు రెట్టింపయ్యాయని పేర్కొన్నారు. నాటోను మరింత బలపరిచామని, ఉక్రెయిన్, ఇజ్రాయెల్‌కు సపోర్ట్ చేస్తూనే 50 దేశాల భద్రతపై ఫోకస్ చేశామని వెల్లడించారు. AUKUSకు చాలా సామర్థ్యం ఉందన్నారు.

News November 9, 2024

మళ్లీ ఆపద్భాందవుడిలా మారిన ధ్రువ్ జురెల్

image

ఆస్ట్రేలియా ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో ఇండియా ఏ ఆటగాడు ధ్రువ్ జురెల్ ఆపద్భాందవుడిగా మారారు. రెండో ఇన్నింగ్స్‌లో 44/4తో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన జురెల్ (68) అర్ధ సెంచరీతో రాణించారు. దీంతో భారత్ 206/7తో పటిష్ఠ స్థితిలో నిలిచింది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో కూడా జట్టు 11/4తో కష్టాల్లో ఉన్నప్పుడు జురెల్ (80) ఆదుకున్నారు. ఆయన రాణించడంతో భారత్ 161 పరుగులైనా చేయగలిగింది.

News November 9, 2024

జ్ఞాపకశక్తి తగ్గిపోతోందా? ఇలా చేయండి

image

సాధారణంగా కొందరు ఒత్తిడి, డిప్రెషన్, వ్యక్తిగత కారణాల వల్ల జ్ఞాపకశక్తి కోల్పోతుంటారు. జ్ఞాపకశక్తి బాగుండాలంటే మెదడుకు వ్యాయామం తప్పనిసరి. ఆసక్తిని పెంచే పుస్తకాలు చదవాలి. పజిల్స్ నింపడం, రోజూ ప్రశాంత వాతావరణంలో ధ్యానం చేయడం, భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాలి. శారీరక వ్యాయామాలు కూడా చేయాలి. సామాజిక కార్యకలాపాల్లోనూ పాల్గొనాలి. అందుకే బ్రెయిన్‌కి ఎప్పుడూ పదును పెడుతూ ఉండాలని నిపుణులు అంటున్నారు.

News November 9, 2024

సీ ప్లేన్ ప్రత్యేకతలు ఇవే?

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ సీ ప్లేన్‌లో విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్తారు. విజయవాడ నుంచి శ్రీశైలం వరకు 150 కి.మీ ప్రయాణాన్ని 45 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఇది 20 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించగలిగినా పర్యాటకులకు ప్రకృతి అందాలు చూపేందుకు 1,500 అడుగుల ఎత్తులో వెళ్తుంది. టేకాఫ్, ల్యాండింగ్ రెండూ నీటిపైనే జరుగుతాయి. ఇందులో 14 మంది ప్రయాణించవచ్చు. దీని టికెట్ ధర దాదాపు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఉండొచ్చు.

News November 9, 2024

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ వాయిదా

image

TG: BRSలో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన MLAలపై అనర్హత అంశంపై హైకోర్టులో వాదనలు జరిగాయి. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఫిర్యాదు చేసిన 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని BRS వాదనలు వినిపించింది. దీనిపై విచారణను ధర్మాసనం ఎల్లుండికి వాయిదా వేసింది. కాగా ఫిరాయింపు MLAపై 4 వారాల్లోగా చర్యలు తీసుకోవాలన్న సింగిల్ జడ్జి గతంలో ఇచ్చిన తీర్పును అసెంబ్లీ కార్యదర్శి న్యాయస్థానంలో అప్పీల్ చేశారు.

News November 9, 2024

అమరావతిలో ESI ఆస్పత్రికి కేంద్రం ఓకే!

image

AP: అమరావతిలో 500 పడకలతో ESI ఆస్పత్రి, 150 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు కేంద్రం సూత్రప్రాయంగా ఓకే చెప్పింది. రాష్ట్ర విభజన తర్వాత HYDలోని ఈఎస్ఐ ఆస్పత్రిని తెలంగాణకు కేటాయించడంతో AP కోసం ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. నిబంధనల మేరకు 10 ఎకరాలు కేటాయించాల్సి ఉంటుంది. ఆస్పత్రి నిర్మాణం, నిర్వహణ ESI కార్పొరేషన్‌కు అప్పగిస్తే రాష్ట్రంపై భారం ఉండదు. తప్పదనుకుంటే ఒప్పంద వ్యయంలో 1/8 వంతు భరించాలి.

News November 9, 2024

ఇవాళ సెలవు లేదు

image

TG: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాన్నీ రెండో శనివారమైనా ఇవాళ పనిచేయనున్నాయి. సెప్టెంబర్ 17న గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈ 3 జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వం సెలవు ఇచ్చింది. బదులుగా నవంబర్ 9న రెండో శనివారం సెలవు రద్దు చేసింది. దీంతో ఇవాళ ఈ 3 జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ యథావిధిగా పనిచేస్తాయి.

News November 9, 2024

కళ్లెదుటే నది.. కానీ నీళ్లు తాగలేరు

image

TG: ఇది మూసీ పరీవాహక ప్రాంత ప్రజల దుస్థితి. కళ్లెదుటే నది వెళ్తున్నా దాహం తీర్చుకోలేని దౌర్భాగ్య పరిస్థితి. నిన్న యాదాద్రి(D) వలిగొండ(మ) సంగెంలో మూసీ నీటిని CM రేవంత్ బాటిల్‌లో తీసుకుని, మంచినీటితో పోల్చారు. మూసీ నీరు చాలా మురికిగా ఉంది. అటు ఇక్కడి కల్లు అడిగేవారే కరువయ్యారని, మూసీ మట్టితో చేసే మట్టికుండలు ఎవరూ కొనడం లేదని, నదిని ప్రక్షాళన చేయాలని పలువురు సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించుకున్నారు.

News November 9, 2024

అర్ధరాత్రి వరకు హోటల్స్‌ను అనుమతించాలని విజ్ఞప్తి

image

AP: రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లను అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచేందుకు అనుమతించాలని ఏపీ హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణలో ఇందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందని పేర్కొన్నారు. ఈ మేరకు DGP ద్వారకా తిరుమలరావును కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు గతంలో సానుకూలంగా స్పందించారని తెలిపారు. పోలీసులకు కూడా ఆదేశాలివ్వాలని కోరారు.