India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: నిన్న CM రేవంత్ పుట్టినరోజున శుభాకాంక్షలు తెలిపిన సినీ ప్రముఖులకు బండ్ల గణేశ్ ధన్యవాదాలు తెలిపారు. విషెస్ చెప్పడానికి సమయం లేనివారికి ‘పెద్ద నమస్కారం’ అంటూ Xలో సెటైర్లు వేశారు. టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే CM కావలెను అంటూ రాసుకొచ్చారు. INC అగ్రనేతలు రాహుల్, ఖర్గే, ప్రియాంక ఎందుకు శుభాకాంక్షలు తెలపలేదని కొందరు, విషెస్ అడుక్కోవడం ఏందన్నా అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

HYDలోని సచివాలయంలో 20 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. సచివాలయానికి వచ్చే ప్రతి ఒక్కరికి కనిపించేలా, ఎత్తైన పీఠం, దానిపై 20 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించనుంది. విగ్రహం ముందు గ్రీనరీ, భారీ ఫౌంటేన్, ఆకట్టుకునేలా లైటింగ్ వంటి సుందరీకరణ పనులు చేస్తున్నారు. డిసెంబర్ 9న విగ్రహావిష్కరణ చేయనుండటంతో చకచకా పనులు జరుగుతున్నాయి. సచివాలయ ప్రధాన ద్వారం ముందే విగ్రహాం ఏర్పాటవుతోంది.

కార్తీకమాసంలో ఏ వారమైతే శ్రవణ నక్షత్రంతో వస్తుందో దాన్ని కోటి సోమవారంగా పేర్కొంటారని పండితులు చెబుతున్నారు. అదే ఈరోజు. శ్రవణ నక్షత్రం వేంకటేశ్వరస్వామి జన్మనక్షత్రం. ఇలాంటి రోజు చాలా అరుదుగా వస్తుంటుంది. ఈరోజు ఉదయాన్నే దీపారాధాన చేస్తే తెలిసీతెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి. కోటి శివలింగాలను పూజించిన ఫలితం దక్కుతుంది. ఈరోజు చేసే దానం, ఉపవాసాలకు కోటి రెట్ల అధిక ఫలం ఉంటుందని శాస్త్రవచనం.

AP: తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణల్లో నిజాలు తేల్చేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ ఏర్పాటైంది. CBI తరఫున HYD జోన్ JD వీరేశ్ ప్రభు, విశాఖ SP మురళి రాంబా పేర్లను సంస్థ ప్రకటించింది. FSSAI నుంచి డా.సత్యేన్ కుమార్, రాష్ట్రం తరఫున గుంటూరు రేంజి IG సర్వశ్రేష్ఠ త్రిపాఠి, విశాఖ రేంజి DIG గోపీనాథ్ జెట్టీలు సిట్‌లో ఉంటారు. త్వరలోనే పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభమవుతుంది.

కొత్త CJI సంజీవ్ ఖన్నాకు బాధ్యతలు చేపట్టడానికి ముందు ఓ చిన్ని కష్టం ఎదురైంది! ప్రైవసీ లేకపోవడంతో ఆయన మార్నింగ్ వాక్‌ను వదిలేశారు. తన ఇంటి సమీపంలోని లోధి గార్డెన్ ఏరియాలో కొంత దూరం వాకింగ్ చేయడం ఆయనకు అలవాటు. జస్టిస్ డీవై చంద్రచూడ్ కొత్త CJIగా ఆయన్ను నామినేట్ చేయగానే మీడియా ఫోకస్, పబ్లిక్ అటెన్షన్ పెరిగింది. దాంతో సెక్యూరిటీతో వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది. దీన్ని ఇష్టపడని ఆయన వాకింగ్ మానేశారు.

AP: ‘వన్ నేషన్-వన్ స్టూడెంట్ కార్డ్’లో భాగంగా కేంద్రం తీసుకొచ్చిన APAAR(ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) నమోదులో ఇబ్బందులొస్తున్నాయి. ఆధార్, DOB, స్కూల్ రికార్డుల్లో విద్యార్థుల వివరాలు వేర్వేరుగా ఉండటంతో టీచర్లు తలపట్టుకుంటున్నారు. దీంతో పాఠశాల రికార్డుల్లోనే మార్పులు చేసే అధికారాన్ని HMలు, MEOలకు కల్పిస్తూ విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. ఇందుకు మార్చి 31 వరకు అవకాశం కల్పించింది.

కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థుల అకడమిక్ సమాచారాన్ని నిక్షిప్తం చేసేందుకు కేంద్రం APAARను తీసుకొచ్చింది. ఈ కార్డులో విద్యార్థి పేరు, బర్త్‌డే, ఫొటో, క్యూఆర్ కోడ్, 12 అంకెలతో గుర్తింపు నంబర్ ఉంటుంది. స్టూడెంట్ హిస్టరీ మొత్తం ఇందులో ఉండటం వల్ల దేశంలో ఎక్కడ చదవడానికైనా ఇబ్బంది ఉండదు. ఆధార్ తరహాలో ఈ కార్డు శాశ్వతంగా ఉంటుంది. అందుకే పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని కేంద్రం ఆదేశించింది.

జోబైడెన్ పాలనలో భారత్‌తో అమెరికా బంధం మరింత విస్తరించిందని US డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ అన్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టామని తెలిపారు. జపాన్‌కు తలుపు తట్టామని, డిఫెన్స్ రంగంలో వారి పెట్టుబడులు రెట్టింపయ్యాయని పేర్కొన్నారు. నాటోను మరింత బలపరిచామని, ఉక్రెయిన్, ఇజ్రాయెల్‌కు సపోర్ట్ చేస్తూనే 50 దేశాల భద్రతపై ఫోకస్ చేశామని వెల్లడించారు. AUKUSకు చాలా సామర్థ్యం ఉందన్నారు.

ఆస్ట్రేలియా ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో ఇండియా ఏ ఆటగాడు ధ్రువ్ జురెల్ ఆపద్భాందవుడిగా మారారు. రెండో ఇన్నింగ్స్‌లో 44/4తో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన జురెల్ (68) అర్ధ సెంచరీతో రాణించారు. దీంతో భారత్ 206/7తో పటిష్ఠ స్థితిలో నిలిచింది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో కూడా జట్టు 11/4తో కష్టాల్లో ఉన్నప్పుడు జురెల్ (80) ఆదుకున్నారు. ఆయన రాణించడంతో భారత్ 161 పరుగులైనా చేయగలిగింది.

సాధారణంగా కొందరు ఒత్తిడి, డిప్రెషన్, వ్యక్తిగత కారణాల వల్ల జ్ఞాపకశక్తి కోల్పోతుంటారు. జ్ఞాపకశక్తి బాగుండాలంటే మెదడుకు వ్యాయామం తప్పనిసరి. ఆసక్తిని పెంచే పుస్తకాలు చదవాలి. పజిల్స్ నింపడం, రోజూ ప్రశాంత వాతావరణంలో ధ్యానం చేయడం, భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాలి. శారీరక వ్యాయామాలు కూడా చేయాలి. సామాజిక కార్యకలాపాల్లోనూ పాల్గొనాలి. అందుకే బ్రెయిన్‌కి ఎప్పుడూ పదును పెడుతూ ఉండాలని నిపుణులు అంటున్నారు.
Sorry, no posts matched your criteria.