India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: అదానీపై అమెరికా మోపిన అభియోగాల్లో గత ప్రభుత్వం పేరు కూడా ఉంది. ఆనాటి ఏపీ ప్రభుత్వానికి రూ.1,750 కోట్ల లంచం ఇచ్చి సౌర విద్యుత్ ఒప్పందం కుదుర్చుకున్నారని అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. 2021లో అదానీ అప్పటి సీఎం జగన్‌ను కలిసిన తర్వాత ‘సెకీ’ ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. అదానీ పవర్ నుంచి కొన్న విద్యుత్ ఏపీకి ఇవ్వాలని ‘సెకీ’ నిర్ణయించినట్లు వివరించారు.
శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన ‘అమరన్’ మేకర్స్‌కు ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్ లీగల్ నోటీసులు పంపించారు. తన అనుమతి లేకుండా సినిమాలో తన ఫోన్ నంబర్ చూపించారని, దీంతో తనకు గుర్తు తెలియని వారి నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని నోటీసులో పేర్కొన్నారు. తనకు నష్టపరిహారంగా రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
AP: రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(PAC) ఛైర్మన్‌గా జనసేన ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులుకు అవకాశం దక్కింది. వైసీపీకి తగినంత బలం లేకపోవడంతో ఆయనను పదవి వరించింది. కాసేపట్లో అసెంబ్లీ కార్యదర్శి అధికారికంగా ప్రకటించనున్నారు. అసెంబ్లీ సంప్రదాయం ప్రకారం విపక్షానికి ఆ పదవి ఇవ్వాల్సి ఉంది. వైసీపీ నామినేషన్ దాఖలు చేసినప్పటికీ బలం లేనందున ఇవ్వకూడదని కూటమి నేతలు నిర్ణయం తీసుకున్నారు.
అదానీ చేశారన్న రూ.2000 కోట్ల స్కామ్ కాంగ్రెస్ సహా పలు ప్రాంతీయ పార్టీల మెడకే చుట్టుకొనేలా ఉంది. తమ నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలని అదానీ+అజూర్ పవర్ కంపెనీలు 2021-22 మధ్య 4 రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందాలు చేసుకున్నాయి. అందుకే $256M లంచాలుగా ఇచ్చారని NYC కోర్టు ఆరోపిస్తోంది. అప్పుడు ఛత్తీస్‌గఢ్ (INC), తమిళనాడు (DMK), ఏపీ (YCP), ఒడిశా (BJD) BJP పాలిత రాష్ట్రాలు కావు. ఇప్పుడిదే కీలకంగా మారింది.
AP: మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా వారికి మాజీ సీఎం జగన్ శుభాకాంక్షలు చెప్పారు. గంగపుత్రుల సంక్షేమం కోసం తాము అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ‘మత్స్యకారుల స్థితిగతులను మెరుగుపరచడానికి ₹3,767crతో 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. వేట నిషేధ సమయంలో 1.23 లక్షల కుటుంబాలకు ₹10k చొప్పున సాయం చేశాం. సబ్సిడీపై డీజిల్ అందించాం’ అని ట్వీట్ చేశారు.
AP: వైసీపీ హయాంలో ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో ఆర్కే రోజా రూ.వేల కోట్ల ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారని శాప్ ఛైర్మన్ రవినాయుడు ఆరోపించారు. ఓట్ల కోసం 17 ఏళ్లు పైబడిన వారికే క్రీడల్లో అవకాశం కల్పించారని విమర్శించారు. ఆమె పెద్ద అవినీతి తిమింగలమన్నారు. తిరుమల దర్శనాల విషయంలోనూ దోపిడీకి పాల్పడ్డారని చెప్పారు. ఈ రెండు అంశాలపై సీఐడీ విచారణ చేయిస్తామని, కచ్చితంగా ఆమెను జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు.
AP: వైసీపీ హయాంలో మద్యంపై కూటమి నేతలు చేసిన అసత్య ఆరోపణలు నమ్మి మందుబాబులు వారికి ఓట్లు వేశారని వైసీపీ అధికారప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చెప్పారు. వైసీపీ, తన ఓటమికి వారూ ఓ కారణమన్నారు. అప్పటి మద్యమే నేడు ప్రైవేటు వ్యాపారులు అమ్ముతున్నారని తెలిపారు. నాడు విషమైన మద్యం నేడు అమృతంగా మారిందా? అని ప్రశ్నించారు. లిక్కర్ రేట్లు తగ్గించకుండా ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు.
ప్రసార భారతి తన కొత్త OTT స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ‘WAVES’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, లైవ్ ఈవెంట్స్, గేమ్స్, ఎడ్యుకేషన్ మెటీరియల్‌తో సహా వినోదం అందించే కార్యక్రమాలు నిర్వహించనుంది. ONDC పర్యవేక్షణలో ఉన్న ఈ యాప్‌లో 12 కంటే ఎక్కువ భాషలు అందుబాటులో ఉంటాయి. BSNLతో పాటు DDని కేంద్రం అభివృద్ధి చేస్తుండటంపై నెట్టింట ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రేపటి నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 7.20 గంటలకు టాస్ వేస్తారు. 7.50 గంటల నుంచి 9.50 గంటల వరకు తొలి సెషన్, 10.30 గంటల నుంచి 12.30 వరకు రెండో సెషన్, 12.50 గంటల నుంచి 2.50 గంటల వరకు చివరి సెషన్ కొనసాగనుంది. లంచ్ బ్రేక్‌కు 40 నిమిషాల సమయం కేటాయించారు.
మార్కులంటూ విద్యార్థులు, టార్గెట్స్ అంటూ ఉద్యోగులూ నిత్యం ఒత్తిడికి లోనవుతూనే ఉంటారు. అయితే, అలాంటి సమయంలో తల్లితో మాట్లాడితే ఒత్తిడి మాయమైపోతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అమ్మకు దూరంగా ఉంటే ఫోన్ చేసి ఆమె వాయిస్ వినడం వల్ల స్ట్రెస్ తగ్గుతుందని తెలిపాయి. తల్లి స్వరం నుంచి కూడా ఆక్సిటోసిన్ విడుదలవుతుందని, దీనికి కౌగిలింత అవసరం లేదని పేర్కొన్నాయి. అందుకే ఒత్తిడిలో ఉన్నప్పుడు అమ్మతో మాట్లాడండి.
Sorry, no posts matched your criteria.