News November 1, 2025

ఏకాదశి వ్రతం ఎలా పాటించాలి?

image

ఏకాదశి వ్రతం పాటించే భక్తులు ఆ రోజున ఉపవాసం ఉండాలి. విష్ణువును తులసి మాలలతో పూజించాలి. రాత్రంతా పురాణ శ్రవణం చేస్తూ, జాగరణ చేయాలి. మరుసటి రోజు ద్వాదశి ఘడియల్లో మళ్లీ విష్ణు పూజ చేసి, భోజనం స్వీకరించాలి. అలా వ్రతం ముగుస్తుంది. ఈ వ్రతాన్ని ఆచరిస్తే నారద పురాణం ప్రకారం.. ధాన్యం, సంపద, ఉన్నత స్థానం లభిస్తాయని నమ్మకం. యజ్ఞయాగాలు, పుణ్యక్షేత్ర దర్శనాల ఫలం కన్నా ఎన్నో రెట్ల అధిక పుణ్యం వస్తుందట.

News November 1, 2025

పొడిబారిన జుట్టుకు పంప్కిన్ మాస్క్

image

తేమ కోల్పోయి నిర్జీవమైన జుట్టును తిరిగి పూర్వపు స్థితికి తీసుకురావాలంటే గుమ్మడికాయ హెయిర్ ప్యాక్ పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఎర్ర గుమ్మడి కాయ ముక్కల్లో కాస్త తేనె వేసి పేస్ట్ చేసుకోవాలి. దీన్ని కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. 3 గంటల తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా తరచూ చేయడం వల్ల జుట్టు పట్టులా మృదువుగా మారుతుంది.

News November 1, 2025

ఇండస్ నీరు ఏమాత్రం ఆగినా పాక్‌లో వినాశనమే: IEP

image

పాకిస్థాన్‌లో 80% వ్యవసాయం ‘ఇండస్’ నీటిపైనే ఆధారపడింది. ఈ బేసిన్ అత్యధిక భాగం ఉన్న ఇండియా కనుక నీటి ప్రవాహాన్ని ఏమాత్రం ఆపినా పాక్ తీవ్రమైన నీటి ఎద్దడితో అల్లాడుతుందని సిడ్నీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ పేర్కొంది. పాక్‌లోని సింధునది ఆనకట్టల్లో 30రోజులకు మించి నీటి నిల్వలకు అవకాశం లేదని పేర్కొంది. దీనివల్ల దీర్ఘకాలంపాటు సాగు దెబ్బతిని ఆ దేశ వినాశనానికి దారితీస్తుందని హెచ్చరించింది.

News November 1, 2025

పోక్సో కేసులో దోషికి శిక్ష రద్దు

image

పోక్సో కేసులో దోషిగా తేలిన వ్యక్తిపై శిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. కృపాకరన్(TN) అనే వ్యక్తి 2017లో బాలికపై లైంగికదాడి చేశాడు. అతడికి కింది కోర్టు విధించిన పదేళ్ల జైలు శిక్షను మద్రాస్ HC సమర్థించింది. దీంతో సుప్రీంను ఆశ్రయించిన అతడు తాము పెళ్లి చేసుకుని బిడ్డతో సంతోషంగా ఉన్నామని తెలిపాడు. అది ప్రేమతో జరిగిన నేరమే తప్ప కామంతో కాదని వ్యాఖ్యానిస్తూ సుప్రీం అతడి శిక్షను రద్దు చేసింది.

News November 1, 2025

తొక్కిసలాటకు నిర్వాహకుల వైఫల్యమే కారణం: దేవాదాయ శాఖ

image

AP: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో <<18167780>>తొక్కిసలాట <<>>ఘటనపై దేవాదాయ శాఖ స్పందించింది. అది పూర్తిగా ప్రైవేటు గుడి అని, ప్రభుత్వ అధీనంలో లేదని తెలిపింది. నిర్వాహకుల వైఫల్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని చెప్పింది. ప్రభుత్వానికి వారు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని వెల్లడించింది. కాగా ఈ ఆలయాన్ని ఇటీవలే ప్రారంభించారని అధికారులు చెబుతున్నారు.

News November 1, 2025

కన్నడను కాదనే వారందరూ మన వ్యతిరేకులే: సిద్దరామయ్య

image

హిందీ, సంస్కృతాల ప్రోత్సాహానికి అధిక నిధులు కేటాయిస్తూ ఇతర భాషలను కేంద్రంలోని బీజేపీ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని కర్ణాటక CM సిద్దరామయ్య విమర్శించారు. ‘రాష్ట్రం నుంచి ₹4.5 లక్షల కోట్లు కేంద్రానికి వెళ్తుండగా మనకు సరైన వాటా మేరకు నిధులు అందడం లేదు. అరకొరగా విదిలిస్తున్నారు’ అని మండిపడ్డారు. కన్నడను వ్యతిరేకించే వారందరినీ మనమూ వ్యతిరేకించాల్సిందేనని రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో ఆయన పిలుపునిచ్చారు.

News November 1, 2025

కాశీబుగ్గ ఘటనపై విచారణకు ఆదేశం

image

AP: కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయం వద్ద తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ ఘటనలో 9 మంది చనిపోవడం, పలువురు గాయపడటంతో ప్రభుత్వం తక్షణ సహాయక చర్యలకు దిగింది. స్థానిక, జిల్లా యంత్రాంగం కూడా అక్కడికి తరలింది. ప్రైవేటు ఆలయమైన ఇక్కడ యాజమాన్యం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలా జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి.

News November 1, 2025

హోమ్ మేడ్ క్యారెట్ సీరం

image

ఈ మధ్యకాలంలో ఫేస్‌గ్లో పెంచుకోవడం కోసం సీరంను ఎక్కువగా వాడుతున్నారు. అయితే మార్కెట్లో దొరికే సీరంలు కొందరికి సరిపడవు. కాబట్టి సహజంగా ఇంట్లోనే క్యారెట్ సీరం ఎలా చేసుకోవాలో చూద్దాం. 2 తాజాక్యారెట్‌లు తురుముకోవాలి. ఒక పాత్రలో కొబ్బరి, ఆలివ్/ బాదంనూనె వేడి చేసి క్యారెట్ తురుము వేసి 10నిమిషాలు మరిగించాలి. తర్వాత దీన్ని వడకట్టి పొడి సీసాలో భద్రపరచాలి. దీన్ని రోజూ చర్మానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

News November 1, 2025

ఏపీలో ఎక్కువ సాగవుతున్న ఆయిల్ పామ్ రకాలు

image

☛ కోస్టారికా: ఏపీలో ఎక్కువగా సాగవుతున్న ఆయిల్ పామ్ రకం ఇది. ఈ చెట్లు చాలా పొడవుగా పెరుగుతాయి. గెలల పరిమాణం పెద్దగా వస్తాయి. ఎక్కువ బరువు ఉంటాయి. ☛ సిరాడ్ షార్ట్: ఈ రకం మొక్క మట్టలు తక్కువ సైజులో వస్తాయి. ఈ మొక్కలు ఎక్కువ ఎత్తు పెరగవు. గెలల సంఖ్య ఎక్కువ. గెలల బరువు తక్కువ బరువు ఉన్నా.. ఎక్కువ సంఖ్యలో రావడం వల్ల రైతులు ఈ రకం సాగుకు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.

News November 1, 2025

పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సింగర్ రోహిత్

image

నేషనల్ అవార్డు గ్రహీత, ప్రముఖ టాలీవుడ్ సింగర్ పీవీఎన్‌ఎస్ రోహిత్ తన ప్రియురాలు డాక్టర్ శ్రేయను వివాహం చేసుకున్నారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు వీరి వివాహ వేడుకకు హాజరయ్యారు. ‘బేబీ’ చిత్రంలోని ‘ప్రేమిస్తున్నా’ పాటకు గానూ ఆయన జాతీయ ఉత్తమ గాయకుడి అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. రోహిత్‌కు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.