News January 18, 2026

టాపార్డర్ ఫెయిల్.. భారత్ గెలుస్తుందా?

image

న్యూజిలాండ్‌తో 338 పరుగుల భారీ లక్ష్యఛేదనలో భారత్ తడబడుతోంది. 71 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయింది. రోహిత్ (11), గిల్ (23), శ్రేయస్ అయ్యర్ (3), కేఎల్ రాహుల్ (1) నిరాశపరిచారు. ప్రస్తుతం విరాట్ (31*), నితీశ్ కుమార్ రెడ్డి (0*) క్రీజులో ఉన్నారు. భారత్ స్కోర్ 13 ఓవర్లలో 71/4గా ఉంది. టీమ్ ఇండియా విజయానికి 222 బంతుల్లో 267 రన్స్ అవసరం. మరి ఈ మ్యాచులో ఏ టీమ్ గెలుస్తుందో కామెంట్ చేయండి.

News January 18, 2026

వెల్లుల్లితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా!

image

* BP, డయాబెటిస్‌ను కంట్రోల్ చేస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.
* వీటిలోని అల్లిసిన్, అజోయిన్ రక్తం గడ్డకట్టకుండా చేసి రక్తప్రసరణ సజావుగా జరిగేందుకు సహాయపడతాయి.
* కీళ్లనొప్పులు, దీర్ఘకాలంగా ఉన్న వాపులను తగ్గిస్తుంది.
* పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచి ప్రీ బయోటిక్‌గా పనిచేస్తుంది.
* పడుకునే ముందు తింటే మెరుగైన నిద్ర సొంతమవుతుంది.
* గొంతు, ఊపిరితిత్తుల సమస్యల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

News January 18, 2026

ట్రంప్ వద్దకు నోబెల్ శాంతి.. స్పందించిన కమిటీ

image

ట్రంప్‌నకు వెనిజులాకు చెందిన మచాడో తన <<18868941>>శాంతి<<>> బహుమతిని ఇవ్వడంపై భిన్నమైన స్పందన రాగా తాజాగా నోబెల్ కమిటీ స్పందించింది. మెడల్ ఎవరి వద్ద ఉన్నా తాము ప్రకటించిన విజేతలో మార్పు ఉండదని తెలిపింది. విజేతలు తీసుకునే నిర్ణయాలపై అవార్డు కమిటీ ఎలాంటి కామెంట్లు చేయబోదని పేర్కొంది. మెడల్‌ను అమ్మడం, దానం చేయడం వంటి వాటిపై పరిమితులు లేవని తెలిపింది. గతంలోనూ పలువురు మెడల్స్‌ను డొనేట్/అమ్మడం చేసినట్లు వెల్లడించింది.

News January 18, 2026

ప్చ్.. రో‘హిట్’ అవ్వలేదు

image

న్యూజిలాండ్‌తో సిరీస్‌లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ నిరాశపర్చారు. మూడో వన్డేలో 11 పరుగులే చేసి ఫౌల్క్స్ బౌలింగ్‌లో వెనుదిరిగారు. సిరీస్ మొత్తంగా 61 పరుగులే చేశారు. మరో ఆరు నెలల వరకు వన్డే మ్యాచ్‌లు లేవు. హిట్ మ్యాన్ నుంచి ఆశించిన స్థాయిలో ప్రదర్శన లేకపోవడం ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తోంది. మళ్లీ IPL-2026లోనే రోహిత్ ఆటను చూడవచ్చు. ప్రస్తుతం వన్డేల్లో రోహిత్ 3వ ర్యాంకులో కొనసాగుతున్నారు.

News January 18, 2026

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోలు మృతి

image

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది. నేషనల్ పార్కు ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిన్న నలుగురు, ఇవాళ ఇద్దరు మావోయిస్టులు మరణించారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. ఘటనాస్థలంలో AK-47 సహా 6 తుపాకులు, పేలుడు పదార్థాలను భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

News January 18, 2026

గర్భనిరోధక మాత్రలతో స్ట్రోక్ ముప్పు

image

అవాంఛిత గర్భాన్ని నిరోధించేందుకు మహిళలు గర్భనిరోధక మాత్రలు వాడుతుంటారు. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టోజెన్ హార్మోన్లు కలిసి ఉన్న మాత్రలు వినియోగించే మహిళలకు క్రిప్టోజెనిక్ స్ట్రోక్‌ ముప్పు ఎక్కువని పరిశోధకులు గుర్తించారు. మెదడుకు రక్త ప్రవాహం జరిగే మార్గంలో రక్తం గడ్డకట్టడం వల్ల క్రిప్టోజెనిక్ స్ట్రోక్‌ వస్తుంది. మహిళలకు వస్తున్న స్ట్రోక్‌లలో దాదాపు 40% క్రిప్టోజెనిక్ ఐషెమిక్ స్ట్రో‌క్‌లేనని తెలిపారు.

News January 18, 2026

ఇతిహాసాలు క్విజ్ – 127 సమాధానం

image

ఈరోజు ప్రశ్న: మహాభారత యుద్ధంలో కౌరవుల వైపు ఉండి కూడా, పాండవుల విజయాన్ని కోరుకున్నది ఎవరు?
సమాధానం: కురుక్షేత్రంలో కౌరవుల సైన్యాధిపతిగా ఉన్న భీష్ముడు పాండవుల విజయాన్ని కోరుకున్నారు. ధర్మం పాండవుల వైపే ఉందని ఆయనకు తెలుసు. అందుకే, తనను ఎలా ఓడించాలో స్వయంగా పాండవులకే రహస్యాన్ని చెప్పి, వారు విజయం సాధించేలా సహకరించారు. ఆయనతో పాటు విదురుడు కూడా పాండవ పక్షపాతిగా ఉండేవారు.
<<-se>>#Ithihasaluquiz<<>>

News January 18, 2026

రేవంత్ డీఎన్‌ఏలోనే ద్రోహ బుద్ధి ఉంది: హరీశ్‌రావు

image

TG: రేవంత్ డీఎన్‌ఏలోనే ద్రోహ బుద్ధి ఉందని మాజీమంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. అవినీతి, ప్రజాద్రోహం కలిస్తే రేవంత్ అని విమర్శించారు. ‘కాంగ్రెస్ CMగా ఉంటూ కేంద్రంలోని BJPతో చీకటి స్నేహం చేస్తున్నారు. ఆ పార్టీ శత్రువులైన BJP, TDP కూటమికి మేలు చేసేలా వ్యవహరిస్తున్నారు. ఆయన రాజకీయ యాత్ర CBN కనుసన్నల్లో సాగుతోంది. హింసను ప్రేరేపించేలా CM చేసిన కామెంట్లపై డీజీపీ ఏ చర్యలు తీసుకుంటారు’ అని పేర్కొన్నారు.

News January 18, 2026

25న తిరుమలలో ర‌థ‌స‌ప్త‌మి

image

సూర్య జయంతి సందర్భంగా ఈ నెల 25న తిరుమ‌లలో రథసప్తమి నిర్వహించనున్నట్లు TTD తెలిపింది. 7 వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించనున్నారని చెప్పింది. 5.30AM నుంచి 9PM వరకు వివిధ వాహనాల్లో భక్తులకు దర్శనమిస్తారని పేర్కొంది. పవిత్ర మాఘ మాసంలో శుక్ల పక్ష సప్తమి తిథిని రథసప్తమి/మాఘ సప్తమి అని పిలుస్తారు. ఈ రోజు సూర్యదేవుడు జ‌న్మించాడ‌ని, ప్రపంచానికి జ్ఞానం ప్ర‌సాదించాడ‌ని వేదాల ద్వారా తెలుస్తోంది.

News January 18, 2026

మూడో వన్డే.. న్యూజిలాండ్ భారీ స్కోరు

image

టీమ్ ఇండియాతో మూడో వన్డేలో న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది. మిచెల్(137), ఫిలిప్స్(106) సెంచరీల మోత మోగించడంతో 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. ఓ దశలో NZ 58 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోగా మిచెల్-ఫిలిప్స్ నాలుగో వికెట్‌కు 219 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. సిరాజ్ ఒక్కడే కాస్త పొదుపుగా బౌలింగ్ చేశారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్, హర్షిత్ తలో 3, సిరాజ్, కుల్దీప్ చెరో వికెట్ తీశారు.