News August 12, 2025

అలాంటి రోల్ చేయడం నచ్చలేదు: అనుపమ

image

‘టిల్లు స్క్వేర్’ మూవీలో నటిస్తున్న సమయంలో తాను కంఫర్ట్‌గా లేనని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అన్నారు. చాలా కాలం ఆలోచించాకే ఆ సినిమా ఒప్పుకొన్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ మూవీలో లిల్లీ పాత్ర చేయడం నచ్చలేదని, 100% కాన్ఫిడెన్స్‌గా కూడా చేయలేదని చెప్పుకొచ్చారు. మరోవైపు ఇండస్ట్రీలో నచ్చని విషయాలు చెబితే ‘యాటిట్యూడ్’ అంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా ఆమె నటించిన ‘పరదా’ ఈ నెల 22న విడుదల కానుంది.

News August 12, 2025

బండి సంజయ్‌కి కేటీఆర్ లీగల్ నోటీసు

image

TG: కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి BRS నేత KTR లీగల్ నోటీసు పంపారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై తన పరువుకు నష్టం కలిగించేలా అసత్య ప్రచారం చేశారని పేర్కొన్నారు. హైకోర్టు జడ్జిలు, ప్రస్తుత CM, మాజీ సీఎం KCR కూతురు, అల్లుడు సహా వేలాది మంది ఫోన్లను KTR ట్యాప్ చేయించారంటూ సంజయ్ ఆరోపించారని నోటీస్‌లో మెన్షన్ చేశారు. వారంలోగా క్షమాపణలు చెప్పకపోయినా, మళ్లీ ఆరోపణలు చేసినా లీగల్‌ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు.

News August 12, 2025

జమ్మలమడుగు ఓటర్లతో టీడీపీ రిగ్గింగ్: YCP

image

AP: పులివెందుల ZPTC ఉప ఎన్నికలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. జమ్మలమడుగు నుంచి వచ్చిన స్థానికేతర ఓటర్లు నల్లపురెడ్డి పల్లె గ్రామంలో రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించింది. జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ పొన్నతోట మల్లి ఓటేసేందుకు పోలింగ్ కేంద్రం వద్ద లైనులో నిలబడిన ఫొటోను వైసీపీ ట్వీట్ చేసింది.

News August 12, 2025

అకౌంట్లో డబ్బులు పడ్డాయా?

image

పంట బీమా(PMFBY) కోసం నిన్న కేంద్రం రైతుల ఖాతాలకు రూ.3900 కోట్లు బదిలీ చేసింది. రైతులు తమ ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యాయా? లేదా? అని తెలుసుకునేందుకు <>pmfby.gov.in<<>> వెబ్‌సైట్‌కి వెళ్లాలి. ఫార్మర్ కార్నర్ ఆప్షన్‌కు వెళ్లి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, క్యాప్చాను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఓటీపీని ఎంటర్ చేసి అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేయాలి. పాలసీ నంబర్, ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే స్టేటస్ తెలుస్తుంది.

News August 12, 2025

ZPTC ఉపఎన్నికలపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

image

AP: పులివెందుల, ఒంటిమిట్ట ZPTC స్థానాలకు జరుగుతున్న ఉపఎన్నికలపై ఎలక్షన్ కమిషన్‌కు వైసీపీ ఫిర్యాదు చేసింది. అమరావతిలోని ఈసీ కార్యాలయం ముందు మోకాళ్లపై కూర్చొని ఆ పార్టీ నేత అంబటి రాంబాబు నిరసన చేపట్టారు. బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని నినదించారు.

News August 12, 2025

ఇది కాంగ్రెస్ అరాచక పాలనకు నిదర్శనం: బండి సంజయ్

image

TG: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్టు కాంగ్రెస్ అరాచక పాలనకు నిదర్శనమని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైరయ్యారు. పెద్దమ్మ గుడిలో పూజలు చేస్తే తప్పేంటని, గుడిని కూల్చిన గూండాలను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓట్ల లబ్ధికి కాంగ్రెస్ ఇలా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు త్వరలో రానున్నాయన్నారు.

News August 12, 2025

పులివెందుల: పరువా? ప్రజాస్వామ్యమా?

image

పులివెందుల ZPTC ఉపఎన్నికల్లో ఓటేసేది 10,606 మంది. ఇదేం AP దశ, దిశను మార్చదు. కానీ నెల రోజులుగా అక్కడ నెలకొన్న హైడ్రామా పోలింగ్ రోజు పరాకాష్ఠకు చేరింది. ఇరుపార్టీల వారు దాడులు చేసుకునే స్థాయి దాటి ఇప్పుడు ఓటర్లు బయటకు రాకుండా కర్రలతో ఇళ్ల ముందు నిల్చోవడమనేది నిరంకుశత్వాన్ని తలపిస్తోంది. పోలీసులు బందోబస్తు కల్పిస్తున్నా ఆగని పంతాలు, పట్టింపులు పులివెందుల పోరులో ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నార్థకం చేశాయి.

News August 12, 2025

ఓటింగ్‌ను ప్రభావితం చేసే వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నాం: డీఐజీ

image

AP: పులివెందుల, ఒంటిమిట్టలో శాంతియుతంగా పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకున్నట్లు కడప డీఐజీ ప్రవీణ్ తెలిపారు. ఓటింగ్‌ను ప్రభావితం చేసే వ్యక్తులను ఉదయాన్నే అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఇరు చోట్ల భారీగా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఇవాళ ఉదయం వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

News August 12, 2025

పోలీసులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు: అంజాద్ బాషా

image

AP: పోలీసులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఆరోపించారు. ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్టు అక్రమమని ఫైరయ్యారు. ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోలేక పోతున్నారని అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు వైసీపీ నేతలపై కేసులు పెట్టి టీడీపీ ప్రభుత్వం దౌర్జన్యంగా వ్యవహరిస్తోందని ఆ పార్టీ నేత రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. దేశ చరిత్రలో ఇలాంటి ఎన్నికలు ఎక్కడా జరగలేదని దుయ్యబట్టారు.

News August 12, 2025

భారీగా తగ్గిన బంగారం ధరలు

image

వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గాయి. ఇవాళ HYDలో 24 క్యారెట్ల బంగారం 10గ్రాములపై రూ.880 తగ్గి రూ.1,01,400కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ.800 పతనమై రూ.92,950 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.2 వేలు తగ్గి రూ.1,25,000కు చేరింది. కాగా రెండు రోజుల్లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై రూ.1,640, 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ.1500 తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.