News November 1, 2025

ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా మార్చాలి: BJP MP

image

దేశ రాజధాని ఢిల్లీ పేరును ‘ఇంద్రప్రస్థ’గా మార్చాలన్న డిమాండ్లు క్రమేణా పెరుగుతున్నాయి. ఢిల్లీ BJP MP ప్రవీణ్ ఖండేల్వాల్ హోమ్ మంత్రి అమిత్ షాకు, ఢిల్లీ CM, మంత్రులకు లేఖ రాశారు. ఇంద్రప్రస్థగా పేరుమార్చి దేశ చారిత్రక, సాంస్కృతిక, నాగరికత మూలాలను ప్రతిబింబింప చేయాలని పేర్కొన్నారు. కాగా ఇంతకు ముందు VHP కూడా ఢిల్లీ పేరు మార్పుపై కేంద్రానికి లేఖ రాసింది. ఎంపీ లేఖతో ఈ డిమాండ్‌కు మరింత మద్దతు వస్తోంది.

News November 1, 2025

వర్షం పడదంటున్నా ₹34 కోట్లతో క్లౌడ్ సీడింగ్

image

ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన క్లౌడ్ సీడింగ్ విఫలమవడం తెలిసిందే. కాన్పూర్ IITతో కలిసి మేఘమథనం చేసినా వాన పడలేదు. అయితే ఢిల్లీ వాతావరణం క్లౌడ్ సీడింగ్‌కు అనుకూలమైనది కాదని CAQM, CPCB, IMD నిర్ధారించాయని 2024లోనే పర్యావరణ మంత్రిత్వ శాఖ పార్లమెంటులో ప్రకటించింది. అయినా ఢిల్లీ ప్రభుత్వం ₹34 కోట్లతో ప్రాజెక్టు చేపట్టి ఇప్పటికే ₹3కోట్ల వెచ్చించింది. ప్రజాధనాన్ని దుర్వినియోగంపై పలువురు మండిపడుతున్నారు.

News November 1, 2025

మీ కొడుకుని సూపర్ హీరోగా పెంచండి!

image

ప్రస్తుత టెక్‌యుగంలో పిల్లలు మంచి కన్నా చెడుకే ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. అందుకే వారికి చిన్నప్పటి నుంచే మంచి విషయాలపై అవగాహన కల్పించాలి. తోటివారిని గౌరవించడం, ఇతరుల వద్దకు వెళ్తే అనుమతి అడగడం, ఓర్పుతో ఉండటం, నిజాయతీగా మెలగడం వంటివి నేర్పాలని నిపుణులు చెబుతున్నారు. స్త్రీల పట్ల గౌరవం, సహానుభూతి చూపడం మంచి లక్షణాలని చెప్పండి. న్యాయం కోసం నిలబడే గుణాలను నేర్పిస్తే ఆదర్శవంతుడిగా ఎదుగుతాడు.

News November 1, 2025

కాశీబుగ్గ తొక్కిసలాట.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

image

AP: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో 10మంది భక్తులు మృతి చెందడంపై PM మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ఘటన తనను కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తొక్కిసలాటలో భక్తులు మరణించడం దురదృష్టకరమని Dy.CM పవన్ ట్వీట్ చేశారు.

News November 1, 2025

ఇంతమంది వస్తారని అనుకోలేదు: హరిముకుంద్

image

AP: శ్రీకాకుళం కాశీబుగ్గ వేంకటేశ్వరాలయంలో తొక్కిసలాటపై నిర్వాహకుడు 95 ఏళ్ల హరిముకుంద్ పండా స్పందించారు. ఇంతమంది భక్తులు వస్తారని ఊహించలేదని చెప్పారు. భక్తులు విపరీతంగా వచ్చారని, గతంలో ఎప్పుడూ ఇంతమంది రాలేదని తెలిపారు. కాగా గతంలో తిరుమలకు వెళ్లిన హరిముకుంద్‌కు సంతృప్తిగా స్వామివారి దర్శనం కలగలేదు. దీంతో తనకు గల 50 ఎకరాల్లో 10 ఎకరాల్లో ఆలయం నిర్మించారు.

News November 1, 2025

వేలానికి బంగారు టాయిలెట్.. ప్రారంభ ధర ₹83Cr!

image

బంగారంతో తయారుచేసిన టాయిలెట్ కమోడ్ వేలానికి సిద్ధమైంది. ఇటాలియన్ కళాకారుడు మౌరిజియో కాటెలాన్ ఈ విచిత్ర కళాఖండానికి ‘అమెరికా’ అని పేరు పెట్టారు. ధనవంతుల అహంకారం, వారి ఆర్భాటపు జీవితం ఎంత నిష్ఫలమో ఈ ‘గోల్డ్ టాయిలెట్’ ద్వారా సందేశం ఇస్తున్నట్లు సృష్టికర్త పేర్కొన్నారు. న్యూయార్క్‌లో నవంబర్ 18న వేలం జరగనుంది. ప్రారంభ ధర ₹83 కోట్లుగా నిర్ణయించారు.

News November 1, 2025

ఏకాదశి వ్రతం ఎలా పాటించాలి?

image

ఏకాదశి వ్రతం పాటించే భక్తులు ఆ రోజున ఉపవాసం ఉండాలి. విష్ణువును తులసి మాలలతో పూజించాలి. రాత్రంతా పురాణ శ్రవణం చేస్తూ, జాగరణ చేయాలి. మరుసటి రోజు ద్వాదశి ఘడియల్లో మళ్లీ విష్ణు పూజ చేసి, భోజనం స్వీకరించాలి. అలా వ్రతం ముగుస్తుంది. ఈ వ్రతాన్ని ఆచరిస్తే నారద పురాణం ప్రకారం.. ధాన్యం, సంపద, ఉన్నత స్థానం లభిస్తాయని నమ్మకం. యజ్ఞయాగాలు, పుణ్యక్షేత్ర దర్శనాల ఫలం కన్నా ఎన్నో రెట్ల అధిక పుణ్యం వస్తుందట.

News November 1, 2025

పొడిబారిన జుట్టుకు పంప్కిన్ మాస్క్

image

తేమ కోల్పోయి నిర్జీవమైన జుట్టును తిరిగి పూర్వపు స్థితికి తీసుకురావాలంటే గుమ్మడికాయ హెయిర్ ప్యాక్ పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఎర్ర గుమ్మడి కాయ ముక్కల్లో కాస్త తేనె వేసి పేస్ట్ చేసుకోవాలి. దీన్ని కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. 3 గంటల తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా తరచూ చేయడం వల్ల జుట్టు పట్టులా మృదువుగా మారుతుంది.

News November 1, 2025

ఇండస్ నీరు ఏమాత్రం ఆగినా పాక్‌లో వినాశనమే: IEP

image

పాకిస్థాన్‌లో 80% వ్యవసాయం ‘ఇండస్’ నీటిపైనే ఆధారపడింది. ఈ బేసిన్ అత్యధిక భాగం ఉన్న ఇండియా కనుక నీటి ప్రవాహాన్ని ఏమాత్రం ఆపినా పాక్ తీవ్రమైన నీటి ఎద్దడితో అల్లాడుతుందని సిడ్నీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ పేర్కొంది. పాక్‌లోని సింధునది ఆనకట్టల్లో 30రోజులకు మించి నీటి నిల్వలకు అవకాశం లేదని పేర్కొంది. దీనివల్ల దీర్ఘకాలంపాటు సాగు దెబ్బతిని ఆ దేశ వినాశనానికి దారితీస్తుందని హెచ్చరించింది.

News November 1, 2025

పోక్సో కేసులో దోషికి శిక్ష రద్దు

image

పోక్సో కేసులో దోషిగా తేలిన వ్యక్తిపై శిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. కృపాకరన్(TN) అనే వ్యక్తి 2017లో బాలికపై లైంగికదాడి చేశాడు. అతడికి కింది కోర్టు విధించిన పదేళ్ల జైలు శిక్షను మద్రాస్ HC సమర్థించింది. దీంతో సుప్రీంను ఆశ్రయించిన అతడు తాము పెళ్లి చేసుకుని బిడ్డతో సంతోషంగా ఉన్నామని తెలిపాడు. అది ప్రేమతో జరిగిన నేరమే తప్ప కామంతో కాదని వ్యాఖ్యానిస్తూ సుప్రీం అతడి శిక్షను రద్దు చేసింది.