News February 15, 2026

$6.7B తగ్గిన విదేశీ మారక నిల్వలు

image

ఈ నెల 6తో ముగిసిన వారానికి భారత విదేశీ మారక నిల్వలు $6.711 బిలియన్లు తగ్గి $717.064Bకి చేరినట్లు RBI వెల్లడించింది. బంగారం నిల్వలు $14.208B తగ్గి $123.476B చేరడమే ఇందుకు కారణం. అంతకుముందు వారం ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ రిజర్వ్స్ రికార్డు స్థాయిలో $723.774Bకి పెరిగాయి. ఇప్పుడు కాస్త తగ్గినా మొత్తంగా బలంగానే ఉన్నాయని RBI పేర్కొంది. అటు విదేశీ కరెన్సీ ఆస్తులు $570.053Bకి పెరిగాయని తెలిపింది.

News February 15, 2026

వృద్ధాప్యంలో ఒంటరితనం వేధిస్తోందా?

image

వృద్ధాప్యంలో ఒంటరితనం అతి పెద్ద సమస్య. పిల్లలు ఎక్కడో దూరంగా ఉండడం, ఏమైనా అయితే పిల్లలు రాగలరో లేరో అనీ కలవరపడతారని నిపుణులు చెబుతున్నారు. ఒంటరితనంతో గతం గురించి ఆలోచిస్తూ కుంగుబాటుకూ లోనవుతారు. రోజూ కాసేపు ధ్యానం చేయడం, స్నేహితులు, బంధువులో సమయం గడపడం వంటివి మేలు చేస్తాయంటున్నారు. మనసును ఉల్లాసంగా ఉంచుకుంటే ఒంటరిననే భావన తగ్గుతుందని చెబుతున్నారు.

News February 15, 2026

హీరో నిఖిల్ వివాదాస్పద పోస్ట్.. ఎవరి గురించి?

image

హీరో నిఖిల్ నటించిన ‘స్వయంభు’ సినిమా నుంచి ఇటీవల ఎపిక్ టీజర్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. టెక్నికల్ సమస్య వల్ల ఈ టీజర్‌ను యూట్యూబ్‌లో రీఅప్‌లోడ్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘యూట్యూబ్ భయ్యా ఎందుకిలా టెక్నికల్ గ్లిచ్ వచ్చేలా చేశావ్.. ఇటీవల రిలీజైన సినిమాల్లాగా మా మూవీలో AI యూజ్ చేయలేదు’ అని నిఖిల్ ట్వీట్ చేశారు. దీంతో ఆయన ఎవరిని, ఏ సినిమాను ఉద్దేశించి ఇలా కామెంట్ చేశారనే చర్చ మొదలైంది.

News February 15, 2026

ఎర్రకోట పేలుళ్లు.. వెలుగులోకి ‘అన్సార్ ఇంటెరిమ్’

image

ఢిల్లీ ఎర్రకోట <<19117415>>పేలుళ్ల కేసులో<<>> సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు అరెస్టయిన ఉగ్రడాక్టర్లంతా ‘అన్సార్ ఇంటెరిమ్’ పేరుతో టెర్రరిస్టు గ్రూపును ఏర్పాటు చేసినట్లు NIA వర్గాలు వెల్లడించాయి. ‘గన్నీ, ఉమర్, ఆదిల్, ముజుఫర్, ఆమిర్, తౌఫిల్ శ్రీనగర్‌లో సమావేశమై దాడులకు ప్లాన్ చేశారు. 2023లో పేలుళ్లకు అవసరమైన మెటీరియల్‌ను కొన్నారు. ఆన్‌లైన్‌లో IEDల తయారీ నేర్చుకున్నారు’ అని తేలింది.

News February 15, 2026

చెరకు పంట నరికేటప్పుడు ఇలా చేస్తే మేలు

image

చెరకు పంటను నరికేటప్పుడు గడలను భూమట్టానికే నరకాలి. కొన్ని ప్రాంతాల్లో భూమి పైన రెండు, మూడు అంగుళాలు వదిలేసి నరుకుతుంటారు. ఇలా చేయడం వల్ల రైతుకు నష్టం. మొదలు కణుపులలో పంచదార పాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇటు పంచదార అటు బెల్లం దిగుబడులు కూడా తగ్గుతాయి. చెరకును భూమట్టానికి నరికి ఖాళీ చేసిన తోటల్లో వేళ్లు లోతుగా చొచ్చుకెళ్లి తోట బలంగా పెరిగి వర్షాకాలంలో వచ్చే ఈదురు గాలులు, వర్షాలను కూడా తట్టుకుంటుంది.

News February 15, 2026

పరమ భక్తుడు ‘సిరియాళుడు’

image

సిరియాళుడు ప్రతిరోజు ఓ శివ భక్తుడికి భోజనం పెట్టిన తర్వాతే తను తినేవాడు. ఆయన భక్తిని పరీక్షించడానికి శివుడు ఓ వృద్ధుడి రూపంలో వచ్చి సిరియాళుడి ఏకైక కుమారుడిని వండి వడ్డించమని అడుగుతాడు. భక్తి కోసం సిరియాళుడు ఆ కఠినమైన పనికి అంగీకరిస్తాడు. ఆ దంపతుల నిశ్చల భక్తికి మెచ్చిన పరమశివుడు, వారి కుమారుడిని తిరిగి బ్రతికించి, ఆ కుటుంబం మొత్తానికి మోక్షాన్ని ప్రసాదించాడు. నిస్వార్థ భక్తికి ఆయన నిదర్శనం.

News February 15, 2026

నేషనల్ ఆయుష్ మిషన్‌లో ఉద్యోగాలు

image

నేషనల్ ఆయుష్ మిషన్(<>NAM)<<>> 20 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు ఫిబ్రవరి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి పీజీ డిప్లొమా పబ్లిక్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్/మేనేజ్‌మెంట్/MBA, BAMS/BUMS/BHMS/BSMS/BYNS, MCom, ICWA, CA, MCA, BCA అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 21 నుంచి 60ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్‌సైట్: https://ayush.gov.in

News February 15, 2026

తారిఖ్ ప్రమాణ స్వీకారానికి ఓంబిర్లా!

image

బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా ఎన్నికైన తారిఖ్ రెహ్మాన్ ప్రమాణ స్వీకారానికి భారత్ నుంచి లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా హాజరుకానున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్రీ సైతం హాజరుకానున్నట్లు చెప్పాయి. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తరఫున గెలిచిన తారిఖ్ ఢాకాలో FEB 17న ప్రమాణం చేయనున్న విషయం తెలిసిందే. ఈ వేడుకకు రావాలని PM మోదీకి ఆహ్వానం అందగా ఆయన స్థానంలో ఓంబిర్లా హాజరవుతున్నారు.

News February 15, 2026

బ్లాక్ సర్కిల్స్‌కి ఇంటి చిట్కాలు

image

కంప్యూటర్లపై ఎక్కువ పనిచేయడం, వేళకు నిద్రలేకపోవడం, ఫోన్ ఎక్కువగా చూడటం వల్ల కొందరికి కళ్ల కింద నల్లటి చారలు వచ్చేస్తాయి. వీటిని కొన్ని ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు. * బంగాళదుంపరసం తీసుకుని కళ్ల అడుగున రాసి 15ని తరువాత కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే ఫలితం ఉంటుంది. * బాదంనూనెలో ఉండే విటమిన్ K నల్లటి వలయాలను తగ్గిస్తుంది. నిద్రపోయే ముందు ఈ నూనెను కళ్ల చుట్టూ రాసుకుని మర్దన చేస్తే ఫలితం ఉంటుంది.

News February 15, 2026

రాష్ట్ర పురోగతికి రోడ్ మ్యాప్ అందించిన బడ్జెట్: మాధవ్

image

AP: ₹3.32L కోట్లతో బడ్జెట్‌ ప్రతిపాదన సాహసోపేతమని BJP రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కొనియాడారు. ఇదొక ప్రగతిశీల బడ్జెట్ అని పేర్కొన్నారు. ‘సంపద సృష్టి, అభివృద్ధి, సంక్షేమం ఆధారంగా రూపొందించిన బడ్జెట్ రాష్ట్ర పురోగతికి రోడ్ మ్యాప్ అందించింది. వికసిత్ ఏపీ ద్వారా వికసిత్ భారత్ నిర్మాణానికి ఈ బడ్జెట్ పునాది వేస్తోంది. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌ల ప్రయోజనాలను ప్రజలకు వివరించాలి’ అని కార్యకర్తలకు సూచించారు.