News October 3, 2024

హీరోయిన్‌తో జయం రవి పెళ్లి? నిజమిదే!

image

ఇటీవల భార్యకు విడాకులిచ్చి వార్తల్లో నిలిచిన నటుడు జయం రవి హీరోయిన్‌ ప్రియాంక మోహన్‌ను పెళ్లి చేసుకోనున్నారని ఓ ఫొటో వైరలవుతోంది. ఫొటోలో ప్రియాంక, జయం రవిలు పూల దండలు ధరించారు. దీంతో నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొందరేమో ఎడిట్ చేసిన ఫొటో అని చెప్తున్నారు. అయితే, ఇది వీరిద్దరి కాంబోలో రాబోతున్న ‘బ్రదర్’ మూవీలోనిదని సినీ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని సూచించాయి.

News October 3, 2024

తిరుమల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

image

AP: తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమాన్ని టీటీడీ అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాడ వీధుల్లో సేనాధిపతి విశ్వక్సేనుల వారి ఉత్సవం వైభవంగా జరిపించారు. రేపు సాయంత్రం 5.45 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ నెల 4 నుంచి 12వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 8వ తేదీ గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు.

News October 3, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: రాష్ట్రంలో రేపు ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడులో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

News October 3, 2024

11న మద్యం షాపుల కేటాయింపు: ఎక్సైజ్ శాఖ

image

AP: రాష్ట్రంలో లాబీయింగ్‌కు తావు లేకుండా మద్యం షాపులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిషాంత్ కుమార్ తెలిపారు. రూ.99కే క్వార్టర్ బాటిల్ అందించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ఈ నెల 11న లాటరీ ద్వారా షాపులు కేటాయిస్తామని, 12 నుంచి మద్యం దుకాణాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. బార్‌ల లైసెన్స్ 2025 ఆగస్టు వరకు ఉండటంతో వాటి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.

News October 3, 2024

నాలుగు భాషల్లో ప్రసంగించిన పవన్

image

AP: ‘వారాహి’ డిక్లరేషన్ కార్యక్రమంలో నాలుగు భాషల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగం సాగింది. జాతీయ మీడియాకు అర్థమవ్వాలంటూ ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఆయన ప్రసంగించారు. దీంతో పాటు తమిళంలోనూ ఆయన మాట్లాడారు. ఇక తెలుగులోనూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. దీంతో పవన్‌కు బహు భాషల్లో ప్రావీణ్యం ఉందని ఆయన ఫాలోవర్స్ పోస్టులు చేస్తున్నారు.

News October 3, 2024

PM- RKVY స్కీమ్‌కు రూ.లక్ష కోట్ల మంజూరు

image

కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతుల ఆదాయం పెంచే లక్ష్యంతో తీసుకొచ్చిన పీఎం రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకి రూ.లక్ష కోట్లను మంజూరు చేసింది. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్‌కు ఆమోదం తెలిపింది. రూ.10,103 కోట్లతో నూనెగింజల ఉత్పత్తికి నిర్ణయించింది. మరాఠీ, పాళీ, ప్రాకృత్, అస్సామీ, బెంగాలీ క్లాసికల్ లాంగ్వేజ్ హోదా కల్పించింది. చెన్నై మెట్రో ఫేజ్-2‌కు ఆమోదం తెలిపింది.

News October 3, 2024

‘వైవాహిక అత్యాచారం’ పిటిషన్లను వ్యతిరేకించిన కేంద్రం

image

వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలని కోరుతూ సుప్రీంలో దాఖలైన పిటిషన్లను కేంద్రం వ్యతిరేకించింది. భార్యాభర్తల మధ్య లైంగిక సంబంధాలకు ‘అత్యాచారాన్ని’ మినహాయించే ప్రస్తుత ఉన్న చట్టాలను సమర్థించింది. వివాహిత అత్యాచారం అనేది చట్టబద్ధమైన సమస్య కంటే సామాజిక ఆందోళన అని, ఈ విష‌యంలో నిర్ణయం తీసుకొనే ముందు విస్తృత చ‌ర్చ జ‌ర‌గాల్సి ఉంద‌ని పేర్కొంది. వివాహాన్ని సమాన బాధ్యతలు కలిగిన బంధంగా పరిగణిస్తారంది.

News October 3, 2024

రైల్వే ఉద్యోగుల‌కు కేంద్రం శుభ‌వార్త‌

image

రైల్వే ఉద్యోగుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. 78 రోజుల బోన‌స్ ప్ర‌తిపాద‌న‌ల‌కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్ర‌కారం రైల్వే శాఖ‌లో ప‌నిచేస్తున్న సుమారు 11.72 ల‌క్ష‌ల మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగుల‌కు ప‌నితీరు ఆధారిత (Productivity Linked Bonus) బోన‌స్‌ ల‌భించ‌నుంది. అర్హత ఉన్న ప్ర‌తి రైల్వే ఉద్యోగికి 78 రోజులకుగానూ గ‌రిష్ఠంగా రూ.17,951 చెల్లించ‌నున్నారు.

News October 3, 2024

ఆ విషయంలో గాంధీ తరువాత మోదీనే: అమిత్ షా

image

గుజరాత్‌కు చెందిన ఇద్దరు పుత్రులు మహాత్మా గాంధీ, ప్రధాని మోదీ మాత్రమే దేశ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చార‌ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్ల తర్వాత పౌరుల ఆరోగ్యం, ఆయుర్దాయం గురించి ఆందోళన చెందుతూ పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్మాణంపై ఎర్రకోట నుంచి మోదీ విజ్ఞ‌ప్తి చేశార‌న్నారు. గాంధీ తర్వాత పరిశుభ్రత ప్రాథమిక అవసరాన్ని వివరించిన 2వ జాతీయ నాయకుడు మోదీ అని పేర్కొన్నారు.

News October 3, 2024

పవన్‌ను చూస్తుంటే ‘కెవ్వు కేక’ సాంగ్ గుర్తొస్తుంది: భూమన

image

AP: వైసీపీ చీఫ్ జగన్ మీద ఇష్టం వచ్చినట్లుగా డిప్యూటీ సీఎం పవన్ రాజకీయ ప్రేలాపనలు చేస్తున్నారని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ దుయ్యబట్టారు. సనాతన ధర్మాన్ని ఆయన రక్షిస్తున్నట్లుగా పవన స్వాముల మాటలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. సనాతన ధర్మం గురించి మాట్లాడటం వెనుక వేరే అజెండా ఉందన్నారు. పవన్ స్వామిని చూస్తుంటే ‘కెవ్వు కేక’ సాంగ్ గుర్తొస్తుందన్నారు. ఆయన పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు.