News April 4, 2024

కవిత బెయిల్‌పై సోమవారం తీర్పు

image

ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్‌పై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. సోమవారం ఉ.10.30 గంటలకు తీర్పు వెల్లడిస్తామని రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. కుమారుడికి పరీక్షలు ఉన్నాయని కవిత బెయిల్ అడగడం మానవతా కోణంలోకి రాదని ఈడీ కోర్టులో వాదించింది. కుమారుడిని చూసుకునేందుకు చాలా మంది ఉన్నారని, ఇప్పటికే కొన్ని పరీక్షలు అయిపోయాయని పేర్కొంది. అటు సాధారణ బెయిల్ విచారణను ఏప్రిల్ 20న చేపడతామని కోర్టు తెలిపింది.

News April 4, 2024

మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది: రాహుల్

image

దేశాన్ని నిర్మించేదెవరో, నాశనం చేసేదెవరో ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ‘కాంగ్రెస్ అంటే యువతకు తొలి ఉద్యోగం, MSP గ్యారంటీ, పేద మహిళలను మిలియనీర్లుగా మార్చడం, కులగణన, కార్మికుల దినసరి కూలీ రూ.400, రాజ్యాంగ-పౌర హక్కుల పరిరక్షణ. BJP అంటే నిరుద్యోగం, రైతులకు రుణభారం, వివక్ష, నియంతృత్వం. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. సరైన నిర్ణయం తీసుకోండి’ అని పేర్కొన్నారు.

News April 4, 2024

స్కూళ్లకు వేసవి సెలవులు ఎప్పుడంటే?

image

TG: ఒకటి నుంచి 9వ తరగతి వరకు నిర్వహించే SA-2 పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. వీటిని ఏప్రిల్ 15 నుంచి 22 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది. 1-7 తరగతుల విద్యార్థులకు ఉ.9-11.30 గంటల వరకు, 8వ తరగతి వాళ్లకు ఉ.9-11.45 గంటల వరకు, 9వ తరగతి స్టూడెంట్స్‌కు ఉ.9-12 గంటల వరకు ఎగ్జామ్స్ ఉంటాయని పేర్కొంది. 23న ఫలితాలు, పేరెంట్స్ మీటింగ్ నిర్వహిస్తామంది. అనంతరం స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించనుంది.

News April 4, 2024

రైల్వేకోడూరు జనసేన అభ్యర్థి మార్పు

image

AP: రైల్వేకోడూరు జనసేన అభ్యర్థిని పవన్ కళ్యాణ్ మార్చారు. రైల్వేకోడూరు నుంచి అరవ శ్రీధర్ బరిలో ఉంటారని ప్రకటించారు. యనమల భాస్కర్ రావు స్థానంలో శ్రీధర్‌కు టికెట్ ఇచ్చారు. సర్వేల్లో భాస్కర్ రావుకు సానుకూల ఫలితాలు రానందుకే ఆయనను మార్చినట్లు తెలుస్తోంది. అరవ శ్రీధర్ ప్రస్తుతం ముక్కావారిపల్లె సర్పంచ్‌గా ఉన్నారు. మూడు రోజుల క్రితమే ఆయన జనసేనలో చేరారు.

News April 4, 2024

కవితకు బెయిల్ ఇవ్వొద్దు: ఈడీ

image

ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ తరఫు లాయర్ కోర్టును కోరారు. బెయిల్ ఇస్తే సాక్షాలను ప్రభావితం చేస్తారని వాదించారు. లిక్కర్ కేసును ప్లాన్ చేసింది కవితేనని, అప్రూవర్‌గా మారిన వ్యక్తిని బెదిరించారని తెలిపారు. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదని, ఫోన్లలో డేటా డిలీట్ చేసి ఇచ్చారని పేర్కొన్నారు. కాగా, మహిళగా, చట్టసభ సభ్యురాలిగా కవితకు బెయిల్ ఇవ్వొచ్చని ఆమె న్యాయవాది వాదించారు.

News April 4, 2024

వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్!

image

వాట్సాప్‌లో వీడియోల కోసం పిక్చర్ ఇన్ పిక్చర్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ వల్ల యాప్‌లో షేర్ చేసిన వీడియోలను పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్‌లో యాప్‌లోనే చూడవచ్చు. ఓవైపు వీడియోలు చూస్తూ, మరోవైపు చాట్ చేసుకోవచ్చు. వేరే యాప్‌కి మారినప్పుడు కూడా ఈ మోడ్‌లో వీడియోలను చూసే వీలుంటుంది. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని వాబీటా ఇన్ఫో తెలిపింది.

News April 4, 2024

అ-అప్పులు.. ఆ-ఆవారా ఖర్చులు: లోకేశ్

image

AP: ఎన్నికల ముంగిట సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. ‘అ.. అంటే అప్పులు. ఆ.. అంటే ఆవారా ఖర్చులు. నవ్యాంధ్ర నెత్తిన నిప్పులు పోసిన నియంత జగన్ మోహన్ రెడ్డి. ఇష్టారాజ్యంగా అప్పులు చేసి ఐదున్నర కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుని తాకట్టు పెట్టారు’ అంటూ లోకేశ్ ట్విటర్ వేదికగా ధ్వజమెత్తారు.

News April 4, 2024

‘బీజేపీలోకి ప్రకాశ్ రాజ్’.. స్పందించిన నటుడు

image

బీజేపీపై తరచూ తీవ్ర విమర్శలు గుప్పించే నటుడు ప్రకాశ్ రాజ్ అదే పార్టీలో చేరనున్నట్లు ట్విటర్‌లో ట్రెండ్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో ప్రకాశ్ రాజ్ ఈ వ్యవహారంపై తనదైన శైలిలో స్పందించారు. ‘వాళ్లు బాగా ట్రై చేసినట్టు ఉన్నారు. కానీ సిద్ధాంతాల పరంగా నన్ను కొనగలిగే స్తోమత వారికి లేదని గ్రహించి ఉంటారు. దీని గురించి మీరేమంటారు?’ అని పోస్ట్ చేశారు.

News April 4, 2024

AI సిటీకి 200 ఎకరాలు: మంత్రి శ్రీధర్‌బాబు

image

TG: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో విస్తృత పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తామని ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. సైబర్ టవర్స్‌లో టెక్ హబ్‌ను ప్రారంభించిన తర్వాత మాట్లాడుతూ.. ‘త్వరలో AI సిటీ కోసం 200 ఎకరాలు కేటాయిస్తాం. స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేసి ఐటీ ఇండస్ట్రీ అవసరాలు తీరుస్తాం. హైదరాబాద్‌ వేదికగా జులైలో AIపై సదస్సు నిర్వహిస్తాం’ అని తెలిపారు.

News April 4, 2024

స్టీఫెన్ రవీంద్రపై సీఎంకు ఫిర్యాదు

image

TG: సైబరాబాద్ మాజీ సీపీ, హోంగార్డ్స్ ఐజీ స్టీఫెన్ రవీంద్రపై సీఎం రేవంత్‌కు కమాండ్ కంట్రోల్ డీఎస్పీ గంగాధర్ ఫిర్యాదు చేశారు. తాను నార్సింగి సీఐగా ఉన్నప్పుడు భూ వివాదంలో జోక్యం చేసుకున్నానని ఆరోపిస్తూ రవీంద్ర తనను సస్పెండ్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనివల్ల ప్రమోషన్ పొందలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమోషన్ అంశాన్ని పరిశీలించాలని హైకోర్టు ఆదేశించినా ఆయన పట్టించుకోలేదని ఆరోపించారు.