India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లండన్‌లో ఓ లగ్జరీ హౌస్ కొన్నట్లు తెలుస్తోంది. తాను అద్దెకు ఉంటున్న ఇంటినే ఆయన భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. గతంలో ఆ ఇంటికి ప్రభాస్ నెలకు రూ.కోటి అద్దె చెల్లించేవారని టాక్. షూటింగ్స్, వెకేషన్‌కు వెళ్లినప్పుడు ఆయన ఆ ఇంట్లో ఉండేవారు. కాగా ప్రభాస్ ప్రస్తుతం ‘కల్కి 2898 ఏడీ’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మరోవైపు రాజా సాబ్ సినిమా షూట్ కూడా చేయనున్నారు.

ఓ యువతి తన ప్రియుడి కోసం రూ.వేల కోట్ల సంపదను తృణప్రాయంగా వదిలేశారు. మలేషియాకు చెందిన బిజినెస్ టైకూన్ కూ కే పెంగ్ కుమార్తె ఏంజెలిన్ ఫ్రాన్సిస్ ఆక్స్‌ఫర్డ్ వర్సిటీలో చదివారు. ఆ సమయంలో జెడిడియాను ప్రేమించారు. కానీ వారి పెళ్లికి ఏంజెలిన్ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. రూ.వేల కోట్ల ఆస్తి కావాలో.. బాయ్‌ఫ్రెండ్ కావాలో తేల్చుకోమన్నారు. కానీ తన వాటా రూ.25 వేల కోట్లను ఆమె వదిలేసుకుని ప్రియుడిని పెళ్లాడారు.

HYDలో నేడు SRHతో ముంబై మ్యాచ్ ఆడనుంది. అయితే పాండ్య టార్గెట్‌గా అరవాలని రోహిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ముంబై కెప్టెన్సీ చేపట్టినప్పటి నుంచి పాండ్యపై రోహిత్ ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. అహ్మదాబాద్‌లో జరిగిన GTvsMI మ్యాచ్‌లో హార్దిక్ చీటర్ అంటూ అరిచారు. HYDలోనూ అదే సీన్ రిపీట్ చేయాలని చూస్తున్నారు. పాండ్య వీటిని ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ఈ వ్యవహారంలో మీ అభిప్రాయం ఏంటి?

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించినట్లు ఆప్ వర్గాలు పేర్కొన్నాయి. ‘మధుమేహంతో బాధపడుతున్న కేజ్రీవాల్‌కు రక్తంలో చక్కెర స్థాయులు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఒక సమయంలో ఆయన బ్లడ్ షుగర్ లెవల్స్ 46 ఎంజీకి పడిపోయాయి. ఇది చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు’ అని ఆప్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు కేజ్రీవాల్ ఈడీ కస్టడీ రేపటితో ముగియనుంది.

AP: పల్నాడు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నాగవరానికి చెందిన టెన్త్ విద్యార్థిని చిన్నారి(15) గుండెపోటుతో మృతి చెందింది. ఆమె స్థానిక హైస్కూల్‌లో చదువుతూ బృగుబండలో టెన్త్ పరీక్షలు రాస్తోంది. ఇవాళ పరీక్షకు హాజరై ఇంటికి రాగానే అస్వస్థతకు గురైంది. వెంటనే చికిత్స కోసం సత్తెనపల్లి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. విద్యార్థిని కొన్నాళ్లుగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు బంధువులు తెలిపారు.

చెన్నై సౌత్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న తమిళిసై సౌందరరాజన్ అఫిడవిట్‌లో తన ఆస్తుల విలువ ప్రకటించారు. తనకు రూ.2.17 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అందులో రూ.50 వేల నగదుతోపాటు రూ.1.57 కోట్ల చరాస్తులు ఉన్నాయి. 2019 సెప్టెంబర్ 8న తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తమిళిసై ఇటీవలే ఆ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ రేపటితో ముగియనున్న నేపథ్యంలో CBI ఆయన కస్టడీని కోరనున్నట్లు తెలుస్తోంది. రేపు కోర్టు విచారణ సందర్భంగా సీబీఐ ఈ మేరకు విజ్ఞప్తి చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈనెల 21న కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన ఈడీ ఈ కేసుపై విచారిస్తోంది. మరోవైపు తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఈరోజు విచారణ చేపడుతోంది.

AP: జనం గెలవాలంటే.. సీఎం జగన్ గద్దె దిగిపోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ‘రాష్ట్రంలో టీడీపీ పెట్టిన పథకాలన్నీ జగన్ తీసేశారు. ప్రజల బతుకుల్లో చీకట్లు నింపారు. ప్రాజెక్టులు కట్టకుండా రాయలసీమకు తీరని ద్రోహం చేశారు. పొలాలకు నీళ్లు ఇవ్వకుండా రైతులను ముంచేశారు. వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది. అందుకే వైసీపీని గద్దె దించి.. కూటమిని ఆశీర్వదించండి’ అని ఆయన పేర్కొన్నారు.

బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్ ప్రతిపాదించిన టీ+0 సెటిల్‌మెంట్ సైకిల్ రేపటి నుంచి అమలులోకి రానుంది. 25 స్టాక్స్‌కు ఈ సదుపాయాన్ని కల్పించనుంది. ఇందులో అంబుజా సిమెంట్స్, బజాజ్ ఆటో, BPCL మొదలైన బడా స్టాక్స్ ఉన్నాయి. ఈ టీ+0లో లావాదేవీలు చేసిన రోజే సంబంధిత ఖాతాలకు క్యాష్/షేర్లు చేరతాయి. కాగా ప్రస్తుతం టీ+1 సైకిల్ అమలులో ఉంది. ఇందులో లావాదేవీలు చేసిన మరుసటి రోజు సంబంధిత అకౌంట్లకు క్యాష్/షేర్లు బదిలీ అవుతాయి.

AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను పలువురు టీడీపీ, బీజేపీ నేతలు కలిశారు. ఇవాళ మంగళగిరిలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆయనతో భేటీ అయ్యారు. వీరి వెంట ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్ కూడా ఉన్నారు. అలాగే తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ కూడా పవన్‌ను కలిశారు. ఎన్నికల్లో తమకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని వీరు కోరినట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.